ప్రపంచలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. అలాంటి కొన్ని మనకు తెలియని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇవి మీకు తెలుసా ?

  • ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి  అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ అంట . 1920 సంత్సరంలో ఎన్నో బ్యాంకులో దొంగతనం చేసి దొంగతనం చేసిన ప్రతి బ్యాంకు లో ఎంతో మంది పేదలకి సంబంధించిన రుణ పత్రాలని కాల్చేసేవాడు. అలా  ఒక దొంగ ఐనా ఆరోజుల్లోనే ఎంతోమందికి రుణ మాఫీ చేసాడు. అందుకే ఇతని అంతక్రియలలో కొన్ని వేళ మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారంట. నిజంగా మంచి దొంగ కదా !
  • ప్రపంచంలోనే ఎక్కువుగా అమ్ముడు అయ్యే బిస్కట్ ఏంటో తెలుసా పార్లే జి . ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమరుగుగా 48,00,00,000 కోట్ల పార్లే జి బిస్కట్ ప్యాకెట్లు అమ్ముడు అవుతున్నాయట.
  • ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాల లోని పోర్ట్ ల్యాండ్ అనే ప్రాంతం లో ఉంది.ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుందట. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ గా ఇది గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కింది.
  • ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే ఆపిల్ గింజలో కూడా ఉంటుందట. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల  మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లి గ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది.ఒక ఆపిల్ గింజలో 0.49 mg సైనైడ్ ఉంటుంది.అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున ఒకటి రెండు గింజలు తిన్నాకూడా మనకి ఏమి కాదు.
  • ఆడ కంగారూలు ఒకేసారి రెండు పిల్లలకు రెండు స్తనాల నుంచి రెండు రకాల పాలివ్వగలవట. పుట్టి నెలల వయసున్న కంగారూకు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే పాలిస్తుందంట. అదే సమయం లో మరో కంగారూ పుడితే దానికి కొవ్వు పదార్ధాలు ఎక్కువ గా ఉండే పాలిస్తుంది. అంటే…ఒకేసారి రెండు పిల్లలకు రెండు రకాల పాలన్నమాట.
  • ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్‌బే. అక్కడ గాలి గంటకు 150 మైళ్ళ వేగంతో వీస్తుంది
  • స్వీడన్ లో ఐస్ తో నిర్మించబడిన హోటల్ ఉంటుంది. సీజన్ మారుతున్నప్పుడు ఈ హోటల్ కరిగిపోతుంది,అందుకే ఈ హోటల్ ను ప్రతి ఏటా నిర్మిస్తూనే ఉంటారు.
  • స్ట్రాబెరీలలోకన్నా నిమ్మకాయల్లో చక్కెర శాతం ఎక్కువ.
  • ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండు రెట్లు పొడవుగా ఉంటుంది.
  •  ఒకే పరిమాణం లో ఉన్న ఇనుప గొట్టం, మనిషి ఎముకలను పరీక్షిస్తే మనిషి ఎముకే బలమైనదని తేలింది.
  •  ఏ రెండు జీబ్రాల వంటి మీది గీతలు….ఒకేలా ఉండవు.
  • చీమలకు సుద్దపొడి గిట్టదు. అందుకే సుద్దముక్కతో గీసిన గీతాలను అవి దాటలేవు.
  • మనకు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒక్కోమాట ఎంత ఆలోచించిన తట్టదు…ఈ స్థితిని lethologica అని అంటారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా అందరూ కూడా మాస్క్లని ధరించాల్సిందే .. కాబట్టి ఏ పనిమీద బయటకు వెళ్ళవలసి వచ్చినా కచ్చితంగా మాస్క్ని ధరించాలి అని  చెబుతున్నారు నిపుణులు.

కాబట్టి మీకు మాస్క్ అందుబాటులో లేకపోతే.. మీరే స్వయంగా ఇంట్లోనే మాస్క్ ని తయారు చేసుకోవచ్చు .


5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా మాస్క్ రెడీ

కావాల్సిన వస్తువులు

1. కాటన్ మెటీరియల్
2. 4 క్లాత్ స్ట్రిప్స్(చెవులకు తగిలించుకునేందుకు సన్నని తాడులాగా కుట్టుకోండి )
3. కత్తెర
4. కుట్టుమిషన్
  • ముందుగా కాటన్ మెటీరియల్ ని  కత్తిరించుకోవాలి..
  • పెద్దవారికైతే : 9 X 7 ఇంచులు
  • చిన్నవారికైతే : 7 X 5 ఇంచులు
  • ఇప్పుడు 4 స్ట్రిప్స్ ని  క్లాత్కి కట్టేందు, అదే విధంగా పైపింగ్లా చేసేందుకు కొంచం క్లోత్ కట్ చేసుకోవాలి.
  • కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని పైన, కింద ఇలా  చివరలు (పైపింగ్నీటి గా కుట్టుకోండి.
  • ఇప్పుడు క్లాత్ని కిందకి ప్లీట్స్ (మడత) పెడుతుూ కుట్టుకోవాలి. ఒక్కో ప్లీట్ 1.5 ఇంచ్ వచ్చేలా కుట్టుకోవాలి.పెట్టుకున్న తర్వాత రెండు పక్కలా పైపింగ్ చేయాలి.
  • ఇలా తయారైన మాస్క్కి కట్టుకునేందుకు నాలుగువైపులా స్ట్రిప్స్ క్లాత్ని కుట్టాలి.
  • ఇప్పుడు మీకు మాస్క్ రెడీ అయినట్లే, ఇది తయారు చేయడం మాత్రమే కాదు.. తయారైన మాస్క్ని ఎలా వాడాలన్నది కూడా ముఖ్యమే. మాస్క్ని మొత్తం నోరు, ముక్కు కవర్ అయ్యేటట్టు ముఖానికి, మాస్క్కి గ్యాప్ లేకుండా కట్టుకోవాలి. అదే విధంగా.. ప్లీట్స్ కిందికి ఉండేలా కట్టు కోవాలి.
  • మీరు రెండు మాస్క్ ని వాడడం మంచిది. ఒకటి ఉతికినప్పుడు ఇంకొకటి వాడొచ్చు.

మాస్క్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మాస్క్ని వాడే ముందు కచ్చితంగా  శుభ్రం చేయాలి అదే విధం గా చేతులను  కూడా శుభ్రం చేసుకోవాలి.
  • మాస్క్ త్వరగా మెత్తగా అయినట్లు అనిపిస్తే వేరే మాస్క్ వాడడం మంచిది.
  • ఒకసారి వాడిన మాస్క్ని క్లీన్ చేయకుండా మరోసారి అసలు వాడరాదు  .

మాస్క్ తీసేటప్పుడు..

మాస్క్ని ముందుభాగంలో ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. కేవలం పక్కభాగంలో ఉన్న స్ట్రింగ్స్ ద్వారే తీసేయాలితీసిన వెంటనే మీ చేతులని70 శాతం ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా సబ్బు నీటితో 40 సెకన్ల పాటు బాగా రుద్దుతూ కడగాలిమాస్క్ని ఉప్పు కలిపిన మరుగుతున్న నీటిలో లేదా సబ్బు నీటిలో నేరుగా వేయండి.

వాడిన మాస్క్ని ప్రతి రోజూ ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి ?

  • రెండోసారి వాడలేని మాస్క్లని వాష్ చేయొద్దు. ఎందుకంటే అవి ఉతకాల్సిన మెటిరీయల్ కాదని గుర్తుపెట్టుకోవాలి.
  • వాడిన మాస్క్లని సబ్బు, వేడి నీటితో ఉతికిన తర్వాత దానిని ఎండలో కనీసం 5 గంటలపాటైనా ఆరవేయాలి.

ఎండ లేకపోతే ?

వాడిన మాస్క్ని ప్రెజర్ కుక్కర్లో వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆరేయాలి. నీటిలో ఉప్పు వేస్తే మంచిది. కుక్కర్ లేకపోయినట్లైతే దానిని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడకబెట్టొచ్చు.

కుక్కర్, వేడి నీటిని వాడే వీలు లేకపోతే ?

మాస్క్ని సబ్బుతో శుభ్రం చేసి దానిని 5 నిమిషాల పాటు మీడియం వేడితో ఐరన్ చేయొచ్చు.

మాస్క్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ?

ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే తీసుకోవాలి. దీనిని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని రెండు వైపులా ఆరవేయాలి. ఇప్పుడు అందులో రెండో మాస్క్ని పెట్టి దాచొచ్చు.
అయితే, కవర్ని ఎప్పుడు కూడా సీల్ చేయడం చాలా ముఖ్యం. 

ఎందుకు కాటన్ మాస్క్ని ఉపయోగించాలి ?

కాటన్ మాస్క్ల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఇంట్లో తయారు చేయడం వలన ఇవి కాస్తా పెద్దవిగా ఉంటాయి దాని  వల్ల వైరస్లు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న వైరస్లని కూడా మనదరికి చేరనివ్వవు. వీటిని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం.

రామనామ జపంతో తరిచి చిరంజీవి అయిన  శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. ఎక్కడైనా రామనామ జపం , కీర్తనలు జరుగుతుంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడని చెబుతుంటుంటారు. అంతేకాదు, నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. చాలాచోట్ల హనుమాన్ మందిరాలున్నాయి. ఇక  ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన ఆలయం ఒకటి వుంది. అదే  హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ లోని ఆంజనేయ స్వామి టెంపుల్.  వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయని అంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయం వెనుక చాలా చరిత్ర మహిమ వున్నాయి.


  • క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే  రాజు రెండో ప్రతాపరుద్రుడు. అతడు వేటాడుతూ అలసిపోయి  ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. 
  • కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు చేరుకుంటాడు . 
  • అక్కడ ఎటు చూసినా ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు బయలు దేరి వస్తాడు . 
  • మళ్లీ పులి గాండ్రింపు వినిపిస్తుంది దాంతో చుట్టుపక్కల అంతా శోధిస్తాడు అయినా  కూడా ఎలాంటి జంతువు  ప్రతాపరుద్రుడుకు కనిపించదు. 
  • అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు ప్రతాపరుద్రుడు. 
  • ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేయడం మొదలు పెడతాడు . 
  • కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం అతనికి కనపడుతుంది . 
  •  దీంతో పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి అనంతరం  తిరిగి కోటకు చేరుకుంటాడు . ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు.
  •  స్వామి ఆదేశం ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని  కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు.
  • అయితే 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్‌ పాలకుడు ఔరంగజేబ్‌ స్వాధీనం చేసుకున్నాడు. 
  • అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు దాంతో ఆ స్వామి  దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్‌ స్వయంగా దాడికి దిగాడు. 
  • ఔరంగజేబ్‌  ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ‘మందిర్‌ తోడ్‌నా హైతో పహలె తుమ్‌ కరో మన్‌ఘట్‌’(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్‌ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం అతడికి  కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. అప్పటినుంచి  కరో మన్‌ఘట్‌ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.
  • కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి వారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి .రోజూ వందలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను ఉంటాయి . 
  • ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్‌ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతుంది.
  • హైదరాబాద్‌ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ  ఆలయం వుంది.  దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ల నుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్ వెళ్తే, మహిమ గల కర్మన్ ఘాట్ ఆంజనేయుని దర్శనం చేసుకోండి .