Showing posts with label red pimples. Show all posts
Showing posts with label red pimples. Show all posts

ముఖం పై మొటిమలొస్తేనే ఎంతో ఫీల్ అయిపోతాం అలాంటిది ముఖం పై ఎర్ర గా పెద్ద పెద్ద బుడిపెలొస్తే ఇక చెప్పేదేముంది.. ఎందుకంటే ముఖంలో ఇవే కనిపిస్తాయి, ఉబ్బు గా కనిపించే ఇవి మహిళలకు చికాకు కల్గిస్తుంటాయి. ముఖానికంతటికీ ప్యాక్ చేసుకోవడం, అలాగే  బొడిపెలమీద మాత్రమే అప్లయ్ చేసుకునే కొన్ని ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా వీటిని నయం చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏమిటో చూద్దామా మరి...
  1. ముఖంలో బొడిపెలు ఉంటున్నట్లయితే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో తాకరాదు. అలాగే వాటిని బలవంతం గా  చిదపకూడదు. ముఖం కడుక్కునేటప్పుడు కూడా గట్టిగా రుద్దకుండా జాగ్రత్తగా నెమ్మదిగా శుభ్రం చేయాలి.
  2.  తాజా నిమ్మరసంతో ముఖం కడుక్కోవాలి. లేదా రోజుకు నాలుగైదు సార్లు నిమ్మరసాన్ని బిడిపే(పింపుల్)  మీద రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
  3. రెండు టీ స్పూన్ల తాజా తులసి రసాన్ని మరుగుతున్న నీటిలో కలిపి చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖం కడగాలి .లేదా ఆ మిశ్రమాన్ని నాలుగైదు సార్లు బొడిపెపై రాయాలి.ఇలా చేస్తే త్వరలోనే నయం అవుతుంది.
  4. కోడి గుడ్డుతెల్ల సొనను బొడిపె మీద రాసి ఆరిన తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది.
  5. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల   తేనెలో అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ని వేసి వేస్టులా చేసుకోవాలి. దీనిని రాత్రి పూట పడుకోబోయే ముందుగా బొడిపెపై రాసుకుని పడుకోవాలి. ఉదయం గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.
  6. రాత్రి నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, ఆపిల్ సైడర్ వెనిగర్‌ను బుడిపెమీద రాసి పడుకొని ఉదయాన్నే కడగాలి.

More

Recent Posts