బొద్దింకలు ముఖ్యం గా వంటగదిలో చాలా ఇబ్బంది పెడతాయి, కానీ ఇంట్లోనే ఉండే కొన్ని సులభమైన వాటిని ఉపయోగించి నేచురల్ చిట్కాలు వాడితే వీటిని దూరం పెట్టొచ్చట. అవేమిటో ఇప్పుడు చూద్దాం..


Simple tips to get rid of cockroaches



బొద్దింకల్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు


1. బేకింగ్ సోడా + పంచదార

  • సమాన మోతాదులో బేకింగ్ సోడా, పంచదార కలిపి బొద్దింకలు తిరిగే మూలలలో, సింక్ దగ్గర చల్లాలి.
  • పంచదార వాసనకి బొద్దింకలు వస్తాయి → తిన్న తర్వాత బేకింగ్ సోడా వల్ల చనిపోతాయి.


2. బోరాక్స్ పొడి + పిండి

  • 1 స్పూన్ బోరాక్స్ పొడిని కొద్దిగా పిండి లేదా పంచదారలో కలిపి ఉంచాలి.
  • ఇది బొద్దింకలకు విషంలా పనిచేస్తుందట. (⚠️ పిల్లలు, పెంపుడు జంతువులు  అందుకోలేని చోట పెట్టండి. పిల్లలు ఉన్నవాళ్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది).


3. నిమ్మకాయ తొక్కలు

  • బొద్దింకలు ఎక్కువగా వచ్చే మూలల్లో, అల్మారీల్లో పొడిచేసిన నిమ్మకాయ/కామలాపండు తొక్కలు పెట్టాలి.
  • వీటి వాసన బొద్దింకలు అస్సలు ఇష్టపడవు.


4. వెల్లులి, ఉల్లిపాయ నీరు

  • ఒక గ్లాస్ నీటిలో 4–5 వెల్లులి రెబ్బలు, సగం ఉల్లిపాయ ముద్ద వేసి ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి బొద్దింకలు వచ్చే మూలల్లో స్ప్రే చేస్తే అవి దూరం అవుతాయి.


5. కొబ్బరి నూనె + పసుపు

  • కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు కలిపి మూలల్లో రాయండి.
  • ఇది యాంటీ ఇన్సెక్ట్ గుణాలు కలిగి ఉండి బొద్దింకలను తరిమేస్తుంది.


 అదనంగా పాటించవలసినవి


* సింక్, డ్రెయిన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

* రాత్రి తిన్న ప్లేట్లు, ఆహారపు గిన్నెలు అలాగే వదలకూడదు ఆలా ఉంచడం వాళ్ళ బొద్దింకలు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.

* చెత్త డబ్బా మూత వేసి ఉంచాలి.

* వంటగది మూలల్లో వారానికి ఒకసారి అయినా ఫినైల్ నీరు లేదా డెటాల్ నీటితో శుభ్రం చేసుకోవాలి.

అలోవెరా చర్మం ఇంకా జుట్టుకి చాలా మేలు చేస్తుంది అని అందరికి తెలుసు కానీ కొంతమందికి అలోవెరా ని ఏ విధంగా ఉపయోగించాలో తెలియక దాని జోలికి వెళ్ళరు. ఇది వాడడం వల్ల మన స్కిన్ మరియు హెయిర్ ఎంత బాగుంటుందో తెలిస్తే తప్పక ట్రై చేస్తారు. అలోవెరా నేచురల్ మాయిశ్చరైజర్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లాంటి గుణాలు కలిగి ఉంటుంది. అలోవెరా స్కిన్ అండ్ హెయిర్ కి ఎలా పనిచేస్తుందో చూద్దామా..

Aloe vera gel benefits for skin and hair


ముఖానికి (Face) అలోవెరా వాడే విధానం

1. కాంతివంతమైన చర్మం కోసం:

   * అలోవెరా ఆకును కోసి పైన దుమ్ము ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకొని లోపల ఉండే జెల్ తీసుకోవాలి.
   * ముఖంపై ఆ జెల్ ని  అప్లై చేసి 15–20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
   * రోజూ వాడితే స్కిన్ ఫ్రెష్‌గా, గ్లోయింగ్‌గా ఉంటుంది.

   * ముఖం మరింత కాంతివంతంగా ఉండాలంటే మరొక చిట్కా చిటికెడు పసుపు, ఒక చెంచా పాలు, కొంచెం 
       రోజ్‌వాటర్, చెంచా తేనె వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. 
   * ఈ మిశ్రమానికి అలోవెరా జెల్ జోడించి బాగా మిక్స్‌ చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి 
      ఇరవై నిమిషాలు ఉంచుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

2. పింపుల్స్ / మచ్చలు తగ్గించేందుకు:

   * అలోవెరా జెల్‌లో ఒక చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి.
   * ఇది డార్క్ స్పాట్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.


3. పొడిబారిన చర్మానికి:

  * అలోవెరా జెల్ + కొబ్బరి నూనె కలిపి రాత్రివేళ ఫేస్ ప్యాక్‌లా వేసుకోవాలి.పడుకునే ముందు శుభ్రం 
      చేసుకొని పడుకోవాలి 
   * చర్మం మృదువుగా, తేమగా ఉంటుంది.


జుట్టుకు అలోవెరా వాడే విధానం:

1. హెయిర్ మాస్క్:

   * అలోవెరా జెల్‌ను నేరుగా తలకు, జుట్టు కుదుళ్ళకి (రూట్స్)రాయాలి.
   * 30–40 నిమిషాలు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
   * జుట్టు మెరిసిపోతుంది, డ్రైనెస్ తగ్గుతుంది. మెత్తగా సిల్కీ గా అనిపిస్తుంది.


2. చుండ్రు తగ్గించేందుకు:

    * అలోవెరా జెల్‌లో కొన్ని చుక్కలు నిమ్మరసం కలిపి తలకు అప్లై చేయాలి.
    * ఇది చుండ్రు తగ్గించి, స్కాల్‍ప్‌ను కూల్‌గా ఉంచుతుంది. నెమ్మదిగా చుండ్రు సమస్య ని తగ్గిస్తుంది.


3. జుట్టు పెరగడానికి అలోవెరా:

   * అలోవెరా జెల్ + కస్టర్ ఆయిల్ కలిపి వారానికి 2 సార్లు తలకు మర్దన చేయాలి.
   * జుట్టు రాలిపోవడం తగ్గి కొత్త జుట్టు పెరుగుతుంది.


⚠️ **జాగ్రత్త:**

* మొదట అలోవెరా జెల్ వాడే ముందు చేతిపై కొంచెం రాసి అలర్జీ వస్తుందా చూడండి.
* అలర్జీ లేకపోతేనే ఫేస్/హెయిర్ మీద వాడండి.
* ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి. 


ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కకి చాల ప్రాధాన్యత ఇచ్చేవారు ఇంకా చాలా పవిత్రంగా పూజిస్తారు. రోజూ తులసిని పూజించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని మనఅందరికీ తెలుసు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి రోజంతా ప్రాణవాయువును విడుదల చేస్తుంది అంట. తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమమ్ టెన్యూయి ఫ్లోరం. ఇప్పుడు తులసి యొక్క ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Benefits Of Tulsi Plant In Home


తులసిని పూజించడానికి కారణమేంటి?

పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కథనాలు ఉన్నాయి. తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే లక్ష్మీ దేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతి రోజూ ఎంతో భక్తితో కొలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని హిందువుల నమ్మకం. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయట.

 తులసి చేసే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం తులసి. మహాభారత కాలంలో ఘటోత్కచుడు కూడా మోయలేని ఆ భగవత్ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి.

  • కొన్ని తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటితో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
  • ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ తులసి ఆకుల రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
  • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే కూడా ఫలితం ఉంటుంది.
  • కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడం లాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి)ఫలితం ఉంటుంది.
  • తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంటుంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
  • తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే  బరువు తగ్గుతారట. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారించే గుణం ఉంది.
  • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
  • తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా మారుతుంది.
  • తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుందంట .
  • జీర్ణ శక్తికి తులసి చాలా మంచి ఔషధం. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది అంట. తిన్నది కూడా జీర్ణమవుతుంది.
  • కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉందంట. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
  • 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటే అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

 

More

Recent Posts