Showing posts with label 5 Home Remedies To Get Rid Of Rats. Show all posts
Showing posts with label 5 Home Remedies To Get Rid Of Rats. Show all posts
ఒక్క ఎలుక తో మొదలై  ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది వాటి సంఖ్య. ఇంటిలో  పుస్తకాలు మరియు బట్టలను పాడుచేస్తాయి  అంతే కాదు వీటి వలన అనేక వ్యాధులు కూడా వస్తాయి. ఎలుకలతో విసుగు చెందినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో అని ఆలోచిస్తుంటాం. అయితే ఇక్కడ తెలిపిన  సులువైన మార్గాల ద్వారా ఎలుకలను ఈజీ గా వదిలించుకోవచ్చు.



టిప్ నెంబర్ 1 : పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్

పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్  ఘాటైన  వాసన  కలిగి ఉంటుంది . ఈ వాసన ఎలుకలకు పడదు. అందువల్ల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి
 అవి పారిపోతాయి. కాబట్టి ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి
సహాయపడుతుంది.

కావలసినవి
పిప్పరమింట్ నూనె
కాటన్ బాల్స్

పద్దతి
* పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి.
* సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
* అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.

టిప్ నెంబర్ 2 : లవంగం ఎసెన్షియల్ ఆయిల్
ఎలుకలు బలమైన లవంగం ఎసెన్షియల్ ఆయిల్ వాసనను భరించలేవు. లవంగం వాసన ఉన్న
చోటు నుండి ఎలుకలు పారిపోతాయి. దీని కోసం లవంగాలు లేదా లవంగాల నూనెను
ఉపయోగించవచ్చు.

కావలసినవి
లవంగం ఎసెన్షియల్ ఆయిల్
కాటన్ బాల్స్

పద్దతి
* లవంగం ఎసెన్షియల్ ఆయిల్ లో కాటన్ బాల్ ని ముంచాలి.
* ఈ కాటన్ బాల్స్ ని తలుపుల దగ్గర మరియు ఎలుకలు ఎక్కువగా తిరిగే
ప్రాంతంలో పెట్టాలి.
* అలాగే ఒక కాటన్ క్లాత్ లో కొన్ని లవంగాలను వేసి ర్యాప్ చేసి ఎలుకలు
తిరిగే ప్రదేశంలో పెట్టవచ్చు.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

టిప్ నెంబర్ 3 : కలరా ఉండలు
కలరా ఉండల బలమైన వాసన ఎలుకలను తరిమి కొడుతుంది.

కావలసినవి
మూత ఉన్న చిన్న కంటైనర్
కలరా ఉండలు

పద్దతి
* చిన్న కంటైనర్లను తీసుకోని వాటికీ రంద్రాలు చేయాలి.
* ఈ చిన్న కంటైనర్లలో రెండు లేదా మూడు కలరా ఉండలను ఉంచాలి.
* ఈ చిన్న కంటైనర్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంచాలి.
* ఈ విధంగా చేయుట వలన ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

టిప్ నెంబర్ 4 : అమ్మోనియా
అమ్మోనియా బలమైన వాసనను ఎలుకలు భరించలేక పారిపోతాయి. అమ్మోనియా వాసన
ఎలుకలు ఆ ప్రదేశం వదిలి వెళ్ళేలా వెంటాడుతుంది.

కావలసినవి
మూత ఉన్న చిన్న కంటైనర్
అమ్మోనియా

పద్దతి
* ఎలుకలు వదిలించుకోవటం కొరకు కలరా ఉండలతో  ఉపయోగించిన అదే ప్రక్రియను అనుసరించాలి.
* ఎలుకలు తరచుగా తిరిగే ప్రదేశాలను అమ్మోనియాతో శుభ్రం చేయాలి.
* అంతేకాకుండా ఎలుకల రెట్టను శుభ్రం చేయటానికి కూడా అమ్మోనియా సహాయపడుతుంది.

టిప్ నెంబర్ 5 :సబ్బు డిటర్జెంట్ మరియు టబాస్కో సాస్
ఇది ఇంటిలో ఎలుకలను బయటకు తరమటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కావలసినవి
సోప్ డిటర్జెంట్ - ¼ కప్పు
టబాస్కో సాస్ - 1 టేబుల్ స్పూన్
ఒక స్ప్రే బాటిల్
నీరు - 1 గాలన్

పద్దతి

* నీరు, సాస్ మరియ డిటర్జెంట్ ఈ మూడింటిని బాగా కలపాలి.
* ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఎలుకలు తరచుగా వచ్చే ప్రదేశంలో
స్ప్రే చేయాలి.
* ఈ మిశ్రమం ఎలుకలు ఇంటిలో నుండి బయటకు పోవటానికి సహాయపడుతుంది.

More

Recent Posts