పరగడుపున నీటిని తాగితే ఏమవుతుందో తెలుసా?

చాలామంది ఉదయం లేవగానే చేసేపని  టీ, కాఫీలు తాగడం.. అవి తాగడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీలేదు. అదే ఉదయం లేచిన వెంటనే పరగడుపున మంచి నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో. మంచి నీటిని తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. శరీరంలో ఉండే వ్యర్ధాలు నీటి ద్వారానే  బయటకు పాతాయి. అసలు పరగడుపున నీరు ఎంత తాగాలి ? ఎందుకు తాగాలి? తాగడం వల్ల ప్రయోజనం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


  • ఉదయం లేవగానే ఒకటిన్నర లీటరు మంచినీటిని తాగాలట . తర్వాత గంట వరకు ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకోకూడదని నిపుణుల సూచన. 
  • కొంతమంది అసలు నీరు తాగరు. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు ఏదో అప్పుడప్పుడు తాగుతారు. అలా చేయడం వల్ల వీరిని అనారోగ్య సమస్యలు వెంటాడుతాయట. అందువల్ల నీరు తాగని వారు ఇప్పటికైనా మించి పోయింది ఏమిలేదు నీటిని ఎక్కువగా తాగండి.  
  • ఖాళీ కడుపుతో ఉదయాన్నే నీటిని తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. అందుకే ఉదయం లేవగానే పరగడుపున నీళ్ళను తాగడం చాలా మంచిదని  చెప్తుంటారు. 
  • పరగడుపున నీటిని తాగడం వల్ల కొత్తరక్తాన్ని వృద్ధి చేస్తుంది. అలాగే కండర కణాల వృద్ధికి దోహదపడుతుంది. ఉదయం లేచిన తరువాత ఖాళీ కడుపులో కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచి, మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
  • పరగడుపున నీళ్ళు తాగడం వల్ల శరీరంలో మలినాలు తొలగిపోతాయి. రక్త కణాలను శుభ్రం చేస్తుంది. అందువల్ల శరీర ఛాయ ప్రకాశిస్తుంది. 
  • శ్వేతధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ గ్రంధులు వలన రోజూవారీ కార్యక్రమాలలో ఎలాంటి ఆటంకం కలగకుండా, శరీర ద్రవపదార్ధాన్ని కోల్పోకుండా అలాగే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరి చేరకుండా పోరాడుతుంది.
     

0 comments:

Post a Comment