2017 లో రాశి ని బట్టి మీ జాతక ఫలితాలు

ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం లో అడుగు పెట్టాం.. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో.. ఏమిటో అని అందరిలో ఒక కుతూహలం ఉంటుంది. అందుకే 2017 లో  జాతకం ఎలావుంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం


1. మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం):

ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 3
ఈ ఏడాది మేష రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. అయితే పైఅధికారులతో వ్యవహారాల్లో మౌనంగా ఉండాలట. సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఫిబ్రవరి7 నుంచి ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూన్ 7 తర్వాత కుదుట పడుతుంది. శని సంచారం వలన ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు.ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. 5, 4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా 2017లో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. కేతు సంచారం వలన ఉద్యోగంలో ప్రోత్సాహకరం. వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చట.

2. వృషభం: (కృత్తిక 2,3,4; రోహిణి మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 7 అవమానం - 6 .
ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఇల్లు/ స్థలం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. . ఆరోగ్యం, విద్య పట్ల అధిక శ్రద్ధ చూపితే లక్ష్యాలు సాధిస్తారు . సెప్టెంబర్ 13 నుంచి గురువు తులారాశిలో ప్రవేసించడం వలన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం. అయితే ఖర్చులు అంచనాలు మించుతాయి. ఈ సంవత్సరం శని సంచరించడంవలన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ లో పనిచేసేవారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. రాహుసంచారం కారణంగా కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. బదిలీలకు అవకాశం. కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో చికాకులు, ఒత్తిడి ఉంటాయి. ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం అంటున్నారు.

3. మిథున రాశి (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 3 అవమానం - 6 మిథున
ఈ రాశి వారు ఈ ఏడాది స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది శుభప్రదుడైన గురువు సంచరించడం వలన విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. ఇక పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శతృవులు కూడా మిత్రులవుతారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి- జూన్ మాసాల మధ్య రియల్ ఎస్టేట్ , గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది దూరంగా ఉండాలి. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శని ఈ సంవత్సరమంతా సంచారం చేయడంవలన వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. శని వక్రించిన ఏప్రిల్ 7- ఆగస్టు 26 మధ్య ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కేతు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు సాధిస్తారు. ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే, శుభఫలితం ఉంటుంది.

4.కర్కాటకం(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం - 14 వ్యయం - 2 రాజపూజ్యం - 6 అవమానం - 6
ఈ రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్ , రవాణా, కన్స ల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు. కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం మంద గిస్తుంది. మానసిక ఆందోళన అధికం. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. సొంత ఇల్లు సమకూర్చు కుంటారు. విద్య, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురు గ్రహం సెప్టెంబర్ 12 వరకు కన్యలో ఆ తరువాత తులారాశిలో సంచరించడం వలన సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన 19 వరకు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఈ ఏడాది శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఇక రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో ఉండదు. ఇక ఈ రాశివారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది.

5. సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం):

ఆదాయం - 2 వ్యయం - 14 రాజపూజ్యం - 2 అవమానం - 2
సింహ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.ఆరోగ్యం మెరుగవుతుంది. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనందం కలిగిస్తాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సెప్టెంబర్ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. ఫిబ్రవరి 7 నుంచి జూన 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. శని సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్ 7 - ఆగస్టు 26 తేదీల మధ్య ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. రాహు సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యభగవానుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

6. కన్యా రాశి(ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు):

ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 5 అవమానం - 2 .
కన్యా రాశి వారు ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్లు, ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. వివాహ, ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. ఫిబ్రవరిలో మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ లో పరిస్థితి మెరుగవుతుంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరించడంవలన సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రీవారు, శ్రీమతి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. సెప్టెంబర్ 13 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. శని సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి.కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం అవుతాయి. రాహుగ్రహ సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేస్తే మంచిది.

7. తులా రాశి (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 1 అవమానం - 5.
తులా రాశి వారు ఈ ఏడాది ప్రమోషన్లు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. 5, 4 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. గృహనిర్మాణ కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్ రంగాల వారికి శుభప్రదం. ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. రాజకీయ నేతలు ఉన్నత పదవులు అందుకుంటారు. సినీరంగానికి చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. శ్రీరామచంద్రుడిని ఆరాధన చేయడం ఈ రాశివారికి మంచిది.

8. వృశ్చిక రాశి(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 5
వృశ్చిక రాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. టెక్స్ టైల్స్ , చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్ , ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నా కారణంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. లక్ష్మీదేవి ని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం):


ఆదాయం - 11,వ్యయం - 5 రాజపూజ్యం - 7,అవమానం - 1
ఈ రాశిలో పుట్టినవారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకారరంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు ఏ మాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఫిబ్రవరి - జూన మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి.మనసు చికాకుగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు అధికం. సంతానం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సెప్టెంబర్ 13 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందర పాటు నిర్ణయాలు తగవు. శని సంచారం ఫలితంగా ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సహకారం, సలహాలు తీసుకుని ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. గణపతి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.

10. మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు):

ఆదాయం - 14,వ్యయం - 14 రాజపూజ్యం - 3,అవమానం - 1 ఈ రాశి వారు ఈ ఏడాది
ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీగమన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి- జూన్ మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. ఇక కేతు సంచారం కారణంగా అనవసర ఖర్చులు అధికం. చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలాగే శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికం. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఫలితాలు ఆశాజనకంగా లేక నిరుత్సాహపడతారు. రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్లే అవకాశం ఉంది. ఈరాశి వారు దుర్గామాత ఆరాధన చేస్తే మంచిది.

11. కుంభ రాశి (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు):

ఆదాయం - 14,వ్యయం - 14 రాజపూజ్యం - 6,అవమానం - 1
ఈ రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల కారణంగా ఆందోళన, వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి. జూన్ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి..శని సంచారం వలన రియల్ ఎస్టేట్ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఒత్తిళ్లు అధికమౌతాయి. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడులలో తొందరపాటు తగదు. రాహు సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. రుణబాధలు అధికం. శ్రీకృష్ణుడి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందగలరు.

12. మీన రాశి (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి):

ఆదాయం - 11,వ్యయం - 5 రాజపూజ్యం - 2 అవమానం - 4
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య ఆందోళనలు పెరుగుతాయి. వృత్తిపరమైన ఒత్తిళ్ళు, న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.రాహు సంచారం వల్ల రుణ బాధలు అధికం. ఆర్ధిక విషయాల్లో ఒత్తిడికి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు. ప్రత్యర్థులపై విజయం . ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కేతు సంచారం కారణంగా ఇంటి కోసం ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోరు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శని సంచరిస్తున్న ఫలితంగా ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల్లో చిక్కులు వస్తాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పార్వతీదేవి ఆరాధన మంచిది.

0 comments:

Post a Comment