Showing posts with label Devotional. Show all posts
Showing posts with label Devotional. Show all posts
బారత దేశంలో ఏమూల చూసినా ఏదో గుడి కచ్చితంగా ఉంటుంది. కొన్ని విగ్రహాలు అయితే వింతగా కూడా వుంటాయి. విగ్రహం ఎవరిదా అని ఎన్నో సందేహాలు రేకెత్తుతాయి. అయితే మన దేశం లో ఇలాంటి వింతదేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా...? మరింకెందుకు ఆలస్యం ...

విస్కీదేవి

ఇది ఒక కల్‌ భైరవుని దేవాలయం ఉజ్జయినీ లో ఈ దేవాలయం విచిత్రమైన ఆనావాయితీలతో ఉండడం చేత వింత వార్తలోకి చేరింది. మద్యం సీసాలను మోసుకు వెళుతున్న భక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది?చూసారా మీరు కళ్ళెర్ర చేసారు. నిజానికి ఈ కల్‌భైరవుని ఆలయానికి భక్తులు తండోపతండాలుగా మందు సీసాలను తీసుకువచ్చి వారి కోరికలను నెరవేర్చమని ఆ దేవతని కోరుకుంటారట.ఈ దేవత ప్రధాన సమర్పణ మద్యం అంట.ఇదే
భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. పురాణాల ప్రకారం మన హిందూ సంప్రదాయాలలో దేవుడికి నైవేద్యం పెట్టి కోరుకలు కోరుకుంటారు. ఇది ఆచారం అదే విదంగా ఇక్కడ మద్యం నైవేద్యంగా పెడతారట. ఉజ్జయిని లో దేవాలయం బయట పూజ బుట్టలను ఒకటి 40 రూ.లకి అమ్ముతూ ..వెళ్ళే భక్తులను ఆపుతూ కొనమని అడుగుతూ వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఆ పూజ బుట్టలో కొబ్బరి కాయలు,పువ్వులు,140 మిల్లీలీటర్లు లిక్కర్‌ సీసాలు కలిగి వుంటాయి.

బుల్లెట్‌ బాబా ఆలయం 

రాజస్థాన్‌లోని జోద్ఫూర్‌ సమీపంలో బుల్లెట్‌బాబా అనే ఆలయం ఉంది.ఈ ఆలయం ఓం బన్నా అనే వ్యక్తికి అంకితం చేసారు. అతను 20 సంవత్సరాల క్రితం బుల్లెట్‌ నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. దాంతో ఆ ఆలయానికి బుల్లెట్‌ బాబా అని పేరువచ్చింది. ఆ బైక్‌ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వాళ్ళు స్వాదీనం
పరుచుకున్నారు. కాని విచిత్రంగా ఆ బైక్‌ పోలీసు స్టేషన్‌ నుండి అదృశ్యమయి వేరొక స్థలంలో ప్రత్యక్షమయ్యింది. మళ్ళీ అదుపు లోకి తీసుకున్నా అదే పరిస్థితి ఎదురయ్యింది పోలీసులకి .దాంతో ఈ వార్త ఆనోట ఆనోట చేరింది. ఇది వింత కావడంతో అక్కడ బుల్లెట్‌బాబా ఆలయాన్ని నిర్మించారు. పాలీ-జోద్ఫూర్‌ రహదారి మీదుగ ప్రయాణించే వారు ఆ బుల్లెట్‌ బాబా ఆలయం దగ్గర ఆగకుండా వెళితే తమ గమ్యాన్ని శరీరం ముక్కలు ముక్కలై చేరుకుంటారని అక్కడి భక్తుల అభిప్రాయం.

ఎలుకల దేవాలయం 

ఇది రాజస్థాన్‌ లో కర్నిమాత దేవాలయం. ఈ దేవాలయంలో ఎలుకలు పొంచి ఉంటాయి. కాని అవి ఏమి చెయ్యవు ఎందుకంటే అది కర్నిమాత దేవాలయం కావడం చేత అంటున్నారు అక్కడి భక్తులు. ఈ ఎలుకలు భక్తులకు ఇబ్బంది కలిగించవని వారి అభిప్రాయం. ఒక వేళ మీరు అక్కడి ఎలుకని చంపితే దాన్నిమీరు ఒక
బంగారు ఎలుకని ఇచ్చి భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలుపు, నలుపు మరియు గోదుమరంగు ఎలుకలు ఆ గుడిలో ఎప్పుడు కనిపిస్తుంటాయి. కాని తెలుపు రంగు ఎలుక కనిపిస్తే మంచిదని భక్తుల నమ్మకం.

సోనియా గాంధీ ఆలయం

కాంగ్రెస్‌ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షురాలైన సోనియా గాంధీ దేవాలయాన్ని నిర్మించారట .ఈ దేవాలయం తెలంగాణాలో సోనియా తెల్లని పాలరాతి విగ్రహం మరియు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ చిత్రాలు బయట గోడలమీద ఉంటాయట.

వీసాబాబా

వీసా రాలేదని బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బాబా గురించి తెలుసుకోవాల్సిందే జలందర్‌ సమీపంలో షాషిద్‌ బాబా నిహాల్‌ సింగ్‌ అని ఒక బాబా ఉన్నారు. ఎవరైతే వీసా రాలేదని బాధపడుతుంటారో వారు ఈయనను కలిసి ఈ యనకు ఒక బొమ్మ విమానం ఇస్తేచాలు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అని భక్తుల నమ్మకం.

మోడీ ఆలయం

ప్రధాని నరేంద్రమోడీ ఆలయం గుజరాత్‌ లో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇక్కడి ప్రజలు ఉదయం,సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
నవ గ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు అని అందరికీ తెలుసు. అయితే మనం పుస్తకాలలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు 9 అని దానిలో ప్లూటో అనే గ్రహం తొలగించబడింది అని చదువుకున్నాం. అయితే భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో జీవితాలపైనా, ప్రభావం చూపే గ్రహాలకు, ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంచెం తేడా ఉంది. సూర్య చంద్రులను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పిలవబడతారు. ఇంకా యురేనస్‌ నెప్ట్యూన్‌లు ఈ లెక్కలోకి రావు. కాని రాహు, కేతువులు రెండు గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే హిందూ సంప్రదాలలో నవగ్రహాలను పూజించడం వలన అదృష్టం వరిస్తుందని చాలా మంది నమ్ముతారు. నవగ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు చేయడం వల్ల మంచి జరిగి అదృష్టం వరిస్తుందని హిందువుల గట్టి నమ్మకం. నవగ్రహాలను వారు ఇష్టపడే ఆహారంతో పూజిస్తే వారి ఆశీస్సులు పొందుతారు. అయితే కొంత మంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రీతికరమైన ఆహారం కూడా ఉంది అని వారు అంటున్నారు. మరి మీరు కూడా నవగ్రహాలకు ఇష్టమైన ఆహారాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుని వాటితో పూజించి ఆశీస్సులు పొందండి.

రవి (సూర్యుడు)

ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అగ్నికి గుర్తు. సూర్యభగవానుడు ఎరుపు రంగుని ఇష్టపడతాడట. అందుకే బెల్లం, ఎరుపు పప్పులు, కేసరి, కుంకుమ పువ్వు, గోధుమలు, ఎరుపు పండ్లుతో పూజించి  సూర్య భగవానుడిని శాంతింపజేస్తే దీర్ఘాయువును ప్రసాదిస్తాడట.

మూన్‌ (చంద్రుడు)

సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు. చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి అతనికి బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, ఉప్పు, చక్కెర, జీడిపప్పు మరియు ముల్లంగి వంటి పదార్ధాలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం .

మార్స్‌ (అంగారకుడు)

మార్స్‌ గ్రహానికి అధిపతి హనుమంతుడు. ఇతడికి ఇష్టమైన రోజు మంగళవారం. హనుమాన్‌కి ఇష్టమైన ఆహారాలు ఎర్రని పప్పుదినుసులు, పళ్ళు, బెల్లం, దానిమ్మపండ్లు. ఇలా ఎర్రని పళ్ళుతో పూజించడం వల్ల తలనొప్పి, రక్తసంబంధిత సమస్యలు నయమవుతాయట.

మెర్క్యురీ (బుధుడు)

బుధుడుకి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమట. ఇతడికి ప్రీతికరమైన రోజు బుధవారం. పెసరపప్పు, గుమ్మడికాయ, ఆకుపచ్చ పండ్లు, ఇటువంటి ఆహార పదార్ధాలతో పూజించడం వలన మానసిక రుగ్మతలు నయం అవుతాయని హిందువుల నమ్మకం.

బృహస్పతి (గురుడు)

గురువారం నాడు పసుసు రంగు కలిగిన వాటితో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. లడ్డు, శనగపప్పు, బెల్లం వంటి వాటితో పూజిస్తే మూత్రపిండ వ్యాదులు దూరం అవుతాయట. అలాగే వ్యాధి రహిత జీవితం లభిస్తుందని అంటుంటారు.

వీనస్‌ (శుక్రుడు)

శుక్రాచార్యుడు బియ్యం, చక్కెర, సెమోలినా వంటి తెల్లని రంగు కలిగిన వాటిని ఇష్టపడతాడట. ఇలా శుక్రాచార్యుడికి ఇష్టమైన వాటితో పూజించడం వలన భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడట.

సాటర్న్‌ (శని)

శని భగవానుడికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల పువ్వులు, నలుపు పండ్లు మొదలగు వాటితో పూజించడం వల్ల మీ శత్రువులు నాశనం అవుతారు. అలాగే మానసిక రుగ్మతలు  తొలగిపోతాయి.

రాహు - కేతు

రాహు - కేతువులు చాయాగ్రహాలు, వీరికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, నల్లని స్వీట్లు మొదలగు వాటితో వీరిని పూజించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు.
కోరింది తడవుగా వరాలిచ్చే దేవుడు పరమేశ్వరుడు. అందుకే బోళా శంకరుడు అని అంటారు. ఇక  పరమేశ్వరుని దర్శించాలంటే ఎన్నో పవిత్ర క్షేత్రాలున్నాయి. అందులో  పరమ పవిత్రమైనది కేదార్‌నాథ్‌ మహాక్షేత్రం అని చెప్పాలి. ఎందుకంటే, హిమగిరుల్లో నెలకొన్న ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా యుగయుగాలుగా వేలాదిమంది భక్తుల పూజలు అందుకుంటోంది. రుద్రహిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే భక్తులు చాలా శ్రమించాల్సి వుంటుంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌ జిల్లాలోని పర్వతాల్లో పరమశివుడు కేదారేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. శీతాకాలంలో ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. వేసవికాలం ప్రారంభంలోనే ఆలయాన్ని తెరవడం సంప్రదాయంగా వస్తోంది. మందాకిని నది జన్మస్థానం కూడా కేదార్‌నాథ్‌ సమీప పర్వతాల్లోనే వుంది.

శివుడు ఇక్కడ స్వయంభువు.. 
పరమశివుడు ఇక్కడ స్వయంభువుగా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంటాడు. ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు విజేతలుగా నిలుస్తారు. అయితే యుద్ధంలో తమ సొంత దాయాదులను చంపవలసివచ్చినందుకు ఎంతగానో వేదనకు గురవుతారు. తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకు మహేశ్వరుని దర్శనం కోసం హిమాలయాలకు చేరుకుంటారు.
వృషభరూపంలో... 
ఇక్కడ  ఈశ్వరుడు వృషభరూపంలో కేదారం వద్ద వుండటాన్ని పాండవులు గమనిస్తారు. వారు వచ్చేలోగా శివుడు భూమిలోకి వెళ్లిపోతాడు. పాండవులకు మోపురం మాత్రమే దర్శనమిస్తుంది. ఆ దర్శనంతో పాండవులకు పాప విముక్తి కలుగుతుంది. భూమిలోకి వెళ్లిన పరమేశ్వరుని ముఖ భాగం నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలో వున్నట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. మధ్యమహేశ్వర్‌, తుంగ్‌నాథ్‌, రుద్రనాథ్‌, కల్పేశ్వర్‌, కేదార్‌నాథ్‌... ఈ ఐదింటిని పంచ కేదార్‌నాథ్‌ క్షేత్రాలుగా పేర్కొంటారు.
శ్రమతో కూడిన పని  ... 
     మంచుకొండల్లోని కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవడం అత్యంత శ్రమతో కూడుకున్న పని. కానీ శివానుగ్రహం భక్తుల్ని ఆ ఇబ్బందులనుంచి దూరంచేస్తుంది. ఇక్కడ ఆలయాన్ని పాండవులు నిర్మించారని తెలుస్తోంది.
ప్రాచీన ఆలయానికి సమీపంలోనే .... 
    అనంతరం ఆదిశంకరాచార్యులు ప్రాచీన ఆలయానికి సమీపంలోనే ప్రస్తుతం మనం చూసే ఆలయాన్ని నిర్మించారు. ఎన్నో వందల సంవత్సరాలు మంచుతో కప్పబడిన మహాపుణ్యక్షేత్రం అనంతరం దర్శనమివ్వడం భగవద్‌ అనుగ్రహమే. ఆదిశంకరులు ఇక్కడి నుంచే కైలాసానికి చేరుకున్నట్టు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఆదిశంకరుల సమాధి... 
   ఆదిశంకరుల సమాధిని కూడా ఆలయ సమీపంలో దర్శించవచ్చు. మంచు కొండల నడుమ పెద్ద పెద్ద రాళ్లతో ఆలయాన్ని నిర్మించడం దైవానుగ్రహమని పెద్దలు చెబుతారు.
ఆలయ ముందు భాగంలో ... 
   ఆలయం ముందు భాగంలో కుంతీదేవి, పాండవులు, శ్రీకృష్ణ విగ్రహాలు వుంటాయి. ఆలయం ముందు నంది విగ్రహం వుంటుంది. ఆలయంలో పరమశివుడు సదాశివమూర్తిగా దర్శనమిస్తారు.
కొండలనెక్కి... 
     ఉత్తరాఖండ్‌లోని పవిత్రపుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, యమునోత్రి, గంగోత్రిలను దర్శించుకోవడాన్ని మినీ చార్‌ధామ్‌ యాత్రగా పేర్కొంటారు. కేదార్‌నాథ్‌ ప్రయాణం క్లిష్టంగా వుంటుంది. రిషికేశ్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు సులభంగా చేరుకోవచ్చు.
ప్రయాణానికి ....
  గౌరీకుండ్‌ నుంచి గుర్రాలు, డోలీలు / కాలినడక ద్వారా ప్రయాణించాల్సి వుంటుంది. హిమపాతంతో కూడిన ప్రతికూల వాతావరణంలో భక్తులు ప్రయాణించాలి.
 హెలికాప్టర్ల సర్వీసులు కూడా ...
  హెలికాప్టర్ల సర్వీసులను ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం కల్పించింది. కానీ ఈ ప్రయాణానికి ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. సముద్రమట్టానికి దాదాపు 3500 మీటర్ల ఎత్తులో వుండే కేదార్‌నాథ్‌ను చేరుకోవడంతో బడలిక మొత్తం పోతుంది. ఇక  ఆ నీలకంఠుని దర్శనంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది.
మే నుంచి అక్టోబరు మాసాల మధ్య
  మే నుంచి అక్టోబరు మాసాల మధ్య కాలం కేదారేశ్వరుడిని దర్శించుకునేందుకు అనుకూలమైన సమయం. శీతాకాలం నుంచి వేసవి కాలం ప్రారంభం వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తారు. మే చివర నుంచి జూన్‌ నెలాఖరు వరకు రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. 2013లో వర్షాలు ఎక్కువగా కురవడంతో అనేక నదులకు వరదలు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని యాత్ర కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సి వుంటుంది.
ప్యాకేజీ యాత్ర ... 
  ముఖ్యంగా  ఉత్తరాఖండ్‌ పర్యాటక శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థలు ప్యాకేజీ యాత్రను నిర్వహిస్తుంటాయి. వీటిని ముందుగా సంప్రదించి వెళ్లడం ఉత్తమం. మంచు కురిసే ప్రాంతంలో ప్రయాణం కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్డు మార్గం... 
కేదారనాధ్ చేరుకోడానికి చాలా రవాణా మార్గాలున్నాయి. ఇందులో  రిషికేశ్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, దిల్లీనుంచి రోడ్డు మార్గం వుంది. గౌరీకుండ్‌ నుంచి 14 కి.మీ. నడక ప్రయాణముంటుంది. 2013లో సంభవించిన వరదల అనంతరం ఈ మార్గం ధ్వంసమయింది. దీంతో ఈ  మార్గాన్ని పునర్‌నిర్మించారు.
రైలుమార్గం ...
రిషికేశ్‌ రైల్వేస్టేషన్‌ 243 కి.మీ. దూరంలో వుంది. రిషికేశ్‌కు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రైలు సౌకర్యముంది.
విమానయానం ...
 డెహ్రాడూన్‌లోని జాలిగ్రాంట్‌ విమానాశ్రయం. 243 కి.మీ.లో వుంది.
రంగులు మార్చే వినాయకుడిని చూసారా ?  అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సోషల్ సైట్లలో కూడా  అవును నిజమే అంటూ కధనాలు  వస్తున్నాయి.  వినడానికి విచిత్రం గా ఉన్నా నిజం గా రంగులు మార్చే వినాయకుడి ఆలయం తమిళనాడు లోని  నాగర్‌కోయిల్ జిల్లా  కేరళపురం గ్రామంలో ఉందట.

  1.  ఈ వినాయకుడి విగ్రహం  రంగు ఆరు నెలలకు ఒకసారి మారుతుందట. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు.

 2.   దక్షిణాయన కాలం(జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా విగ్రహం రంగులు మారడం  వినాయకుని మహిమే అని భక్తులు అంటారు.

3.  దీన్ని మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అంటారు. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా  చిత్రాలు చాలా ఉన్నాయి.
 4.   ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన సంగతే.  కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ. ఇక్కడ  మాత్రం అది చెల్లదు అంటుంది  ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయట.
 5.  అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉందని అంటున్నారు.  వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో, ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.
6.  వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.. ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి.
7.   అంతేకాదు, ఇంతకన్నా మరో విచిత్రం కూడా ఉందట. సాధారణంగా శిశిరఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్ వినాయకర్ ఆలయం అని కూడా పిలుస్తారని చెబుతారు.
8. ఈ ఆలయం 1317 సంవత్సరంలో  నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారుల అంచనా.
9.  నిజానికిది శివాలయమట. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అని అంటారు.
10.  ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించారు.
11. ఇక  ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి క్రీ.శ 1608 లో కాశీ పట్టణంలో జన్మించారు. ఇతడు 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘసంస్కర్త కూడా. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏమి జరిగినా బ్రహ్మంగారి కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించిన చాలా విషయాలు నిజమయ్యాయి. ప్రపంచం లో ఏం జరిగినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అని అంటూ ఉంటారు జనాలు. ఆయన చెప్పిన సంఘటనలు పొల్లుపోకుండా అన్ని జరగుతూ వస్తున్నాయి. బ్రహ్మంగారు సాక్షాత్తు దైవస్వరూపులు. ఈయన మొదటి జ్ఞాన బోధ తల్లితో ప్రారంభించాడు. ఆమెకు జ్ఞాన బోధ చేసి దేశాటనకు బయలుదేరాడు. కాలజ్ఞానంలో చెప్పినవి ఇప్పటివరకూ జరిగినవి.



1. నీళ్ళతో దీపాలు వెలిగిస్తారు. విద్యుత్‌ శక్తి గురించి ఈ విధంగా చెప్పారు. నీటిని ఉపయోగించి జనరేటర్స్‌ తయారు చేస్తున్నారు.

2. ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి. ఒకప్పుడు జంతువులను ఉపయోగించి ప్రయాణాలు చేసేవారు. ఇప్పుడు యాత్ర వాహనాలను ఉపయోగిస్తున్నాం.

3. కాశీ పట్నం 40 రోజులపాటు పాడుబడుతుంది.

4. ఒక అంబ (వితంతువు) 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. ఇందిరాగాంధీ  గురించి తెలియజేసారు..

8. కృష్ణ గోదావరి నదుల మధ్య రక్తం ఏరులై పారుతుంది.

19. కంచి, శృంగేరి, పుష్పగిరిలో అనేక వింతలు పుట్టును ఆ పీఠములకు గట్టు కాలము పీఠాధిపత్యములు తిరిగి విశ్వ బ్రహ్మణులకు చేరునని బ్రహ్మంగారు చెప్పెను.

20. శ్రీ శైలంలో పరుసవేది దొరికి తిరిగి బ్రహ్మంగారి మతం చేరుతుంది అని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తెలిపారు.

21. ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది అని కాలజ్ఞానంలో చెప్పబడింది.

22. శ్రీశైల మల్లిఖార్జున గుడిలో పొగ, మంట వచ్చును. మల్లిఖార్జునుడు సాక్షాత్కారమయి ప్రజలతో మాట్లాడును. శ్రీశైల బ్రమరాంబ గుడిలో ఒక ముసలి వచ్చి 8 దినములు ఉండి మేకపోతువలె అరచి మాయమవును. శివుని కంట నీరు కారును, బసవేశ్వరుడు రంకి వేసి కాలుదువ్వును. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పబడింది.

23. పుట్ల కంబము మీద ప్రతిమ మాట్లాడును కాలభైరవుడు మంత్రములు చదవును. అని బ్రహ్మం గారు చెప్పారు.

24. శ్రీ స్వామివారి సైన్యం కోసం లక్షలాది గుఱ్ఱాలు యాగంటి గుహల నుండి వస్తాయి.

25. కంచి కామాక్షమ్మ ఉగ్రం వల్ల దక్షిణ దేశదొరలు ప్రజలు నష్టమవుతారు. రామేశ్వరం వద్ద భయంకరమైన యుద్దం సంభవిస్తుందని బ్రహ్మం గారు చెప్పారు.

26. గుళ్ళలో దేవుళ్లుకు మూర్తిమంతములు వచ్చి ఊరురా నాట్యమాడును కంచి కామాక్షి గిర్రున తిరుగును....  బిళం కామాక్షమ్మ కండలు కక్కును గండకి నదిలో సాలగ్రాములు నాట్యమాడును. వినాయకుడు వలావలా ఏడ్చును. దేవతలు ప్రజలతో మాట్లాడును. కాలజ్ఞానం లో ఈ విధంగా చెప్పారు.

27. వినాయకుడు ఊరూరా తిరిగి వేద మంత్రములను చదువును. తామే వీరభోగవసంతరాయులమని చాలామంది దొంగ సాధువులు వస్తారని ఆయన తెలిపారు.

28. కృష్ణానది వరదలలో ఆనకట్టలు, 14 నగరాలు కొట్టుకుపోతాయి. కృష్ణ నీరు దుర్గమ్మ ముక్కు పోగు అంటుతుంది.

29. భారతదేశ ఆర్ధిక రాజధానిగా కందిమల్లాయిపల్లె విలసిల్లుతుందని ఆయన పలికారు.

30. కంచికి పడమట కామ ధేనువు జన్మింస్తుందని నవ నారశింహక్షేత్రాలు, యాగంటి, అలంపూర్‌, బెల్లంకొండ, శ్రీశైలంలో ఉన్నమహా విధులను తిప్పారు అని బ్రహ్మం వాక్కు.

31. బాపల పంచాగము తలక్రిందులవును వారు చెప్పే భవిష్యత్తు జరుగకపోవును అని బ్రహ్మం గారు అన్నారు.

32. పన్నెండు రోజులు గోదావరి నదిలో చుక్కనీరు ఉండదు. 13న రోజు భయంకరమైన వరదలు వస్తాయి.

33. గోపురము కూలి కుంభుని కుంభకోణం రూపుమారుతుంది. క్షిపణి అణుదాడితో హంపి దెబ్బతింటుంది. మాయజంగాలు వస్తారు. ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పబడ్డారు.

34. వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేసుకుని ఎక్కే ప్రమణముగల మనుషులు పుడతారు. అని కాలజ్ఞానం చెప్తుంది.

35. ఊరూర పొలిమేర్ల వద్ద తెల్ల కాకులు చేరి ఏడుస్తాయి. ఐదేళ్ళ నాగయ్య వేదాలు చదువుతాడు. ఇంకొక బాలుడు భవిష్యత్తు చెపుతాడు.

36. వెంకటేశ్వరుని కుడి భుజము అదురును తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసుకుపోతాయి.

37. గోల్కొండ వద్ద గోవిందాపురములో ఒకఆవు మనిషికి జన్మనిస్తుంది. పంది కడుపున ఏనుగు జన్మిస్తుంది. అని కాలజ్ఞానంలో చెప్పబడింది.

38. రెండు బంగారు  హంసలు ఊరూరా తిరుగుతాయి. వాటిని పట్టుకోవాలని చూసిన వారు అందులవుతారని బ్రహ్మం పలికారు.

39. అహాబిలంలో ఉక్కు స్తంభమునకు సన్నజాజులు పూయును. మూడవ ప్రపంచయుద్దం ముగిసే నాటికి 7 ఊర్లకు 1 ఊరు మిగులుతుంది.

40. కొండ పగిలి నిలువ నీడలేక కనకదుర్గమ్మ కందిమల్లాయ పల్లె చేరుతుంది.

వీరబ్రహ్మంగారు తిరిగి జన్మించి రాబోయేముందు జరుగుకొన్ని సంఘటనలు.

41. కలియుగ 5000 సంవత్సరాలు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్ధం బ్రహ్మంగారు ఉద్భవిస్తారు.

42. ఉప్పుకోటారులో ఊరచెరువులో ఉత్సవాలు పుడతాయి. 14 నగరాలను జల ప్రవాహాలు ముంచుతాయి. ఇదే శ్రీస్వామి వారు రావటానికి నిదర్శనం.

43. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.

44. 5972 ధాతు నామసంవత్సరాన మాఘశుద్ధ బుధవారం రోజున పట్టపగలే 18 పట్టణాలు దోపిడీకి గురవుతాయి. కొటొదూపాటితో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది.

45. కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో భేరీకోమటి మహాత్ముడై నిలుస్తాడు.

46. మధుర మీనాక్షి మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుండి పిడుగుల వాన పడి నిప్పులవాన కురుస్తుంది.

47. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది. బనగానపల్లెలో కాలజ్ఞానం పాతరపై ఉన్న వేపచెట్టుకు చేమంతి పూలు పూస్తాయి.

48. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది అందువల్ల ఎందరో నష్టపోతారు. గోల్కొండ నుండి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.

మన వాళ్లకు సెంటిమెంట్లు, నమ్మకాలు ఎన్నో వున్నాయి. మనం నమ్మే అనేక విశ్వాసాల్లో జ్యోతిషం కూడా ఒకటి. పుట్టిన దగ్గర నుంచి ఏ కార్యక్రమం జరగాలన్నా, ఎవరైనా వ్యక్తులకు ఎప్పుడూ కష్టాలు కలుగుతున్నా.. వారు జాతకం చూసి అందుకు అనుగుణంగా శాంతి చేయించుకుంటుంటారు. అయితే చాలా మంది జాతకాల్లో కాలసర్ప దోషం అని ఒకటి ఉంటుంది. అది ఉంటే అనేక మంది భయపడిపోతారు. తమకు అంతా చెడు జరుగుతుందని భయపడతారు. దీంతో శాంతి పూజలు చేయిస్తారు. అయితే నిజానికి కాలసర్ప దోషం వల్ల చెడు ఫలితాలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు మంచి ఫలితాలు కూడా కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


మొత్తం నవ గ్రహకూటమిలో రాహు, కేతువులు కాకుండా, మిగిలిన 7 గ్రహాలూ ఆ రెండు గ్రహాల చట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్ప దోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి ఈ దోషం కలుగుతుందని, అంటారు. అయితే దోషం మాట వాస్తవమే గానీ దీంతో ఎప్పుడూ చెడు ఫలితాలు కలగవట. కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయట. అంతెందుకు, ధీరూభాయ్ అంబానీ, సచిన్ టెండుల్కర్, లతా మంగేష్కర్, జవహర్ లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులకు కాలసర్ప దోషం ఉండేదట. కానీ నిజానికి చూస్తే వారు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు. చాలా పేరు తెచ్చుకున్నారు. కీర్తి గడించారు. ఈ క్రమంలో కాలసర్ప దోషం ఉన్నా అంతగా భయపడాల్సిన పనిలేదని పలువురు పండితులు చెబుతున్నారు. కష్టపడి పని చేసే వారికి ఆ దోషం ఉండదని, జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిర పడతారని వారు చెబుతున్నారు.

1. కాలసర్ప దోషం ఉన్నవారు పనిలో అంకిత భావంతో ఉంటారట. ధైర్యం, నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే వాళ్ళను ఉన్నత స్థానాల్లో నిలబెడతాయట.

2. కాలసర్ప దోషం ఉన్న వారి జాతక చక్రంలో సూర్యుడు రాహువుతో కలసి 1, 2, 3, 10 స్థానాల్లో ఉంటే అప్పుడు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. వారు కోరుకున్నవి నెరవేరుతాయట. వారి ఆరోగ్యం బాగు పడడమే కాదు, సంపద కూడా వృద్ధి చెందుతుందట. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయట. రాజకీయాల్లో రాణిస్తారట.

3. కాలసర్ప దోషం ఉన్న వారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో ఉన్నా లేదంటే రాహువుతో కలసి ఉన్నా అలాంటి వారి జీవితం మారిపోతుందట. వారు అత్యంత ప్రతిభావంతులవుతారట.

4. అదేవిధంగా కుజ గ్రహం కాలసర్పం నోటి వద్ద ఉంటే అలాంటి వ్యక్తులు మిక్కిలి ధైర్యవంతులుగా ఉంటారట.

5 అదే ఆ స్థానంలో బుధ గ్రహం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా తయారవుతారట. వారు జీవితంలో ప్రతి మెట్టుకు విజయం సాధిస్తారట.

6. కాలసర్ప దోషం ఉన్నవారికి అనుకూలంగా ఉండే గ్రహాలు కూటమిలోకి వచ్చినప్పుడు వారి దశ తిరుగుతుందట.
ఎన్నో ఆశలతో కొత్త సంవత్సరం లో అడుగు పెట్టాం.. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో.. ఏమిటో అని అందరిలో ఒక కుతూహలం ఉంటుంది. అందుకే 2017 లో  జాతకం ఎలావుంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం


1. మేషం(అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం):

ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 3
ఈ ఏడాది మేష రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా మొత్తం మీద పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసం ధైర్య సాహసాలతో చేసే ప్రయత్నాలు జయప్రదం అవుతాయి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.శతృవులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. అయితే పైఅధికారులతో వ్యవహారాల్లో మౌనంగా ఉండాలట. సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రత్యర్థులపై విజయం. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఫిబ్రవరి7 నుంచి ప్రత్యర్థుల నుంచి, వైవాహిక జీవితంలో కొన్ని చిక్కులు ఎదురవుతాయి. జూన్ 7 తర్వాత కుదుట పడుతుంది. శని సంచారం వలన ఫలితంగా ప్రమోషన్లు అందుకుంటారు.ఇల్లు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే కొత్త వ్యాపారాల ప్రారంభానికి తగిన సమయం కాదు. 5, 4 స్థానాల్లో రాహు సంచారం కారణంగా 2017లో ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. కేతు సంచారం వలన ఉద్యోగంలో ప్రోత్సాహకరం. వ్యాపార రంగం వారికి ఆర్థికంగా అనుకూలం. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దత్తాత్రేయ ఆరాధన చేస్తే శుభ ఫలితాలు పొందవచ్చట.

2. వృషభం: (కృత్తిక 2,3,4; రోహిణి మృగశిర 1,2 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 7 అవమానం - 6 .
ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విషయాల్లో ఆనందప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. ఇల్లు/ స్థలం కొనుగోలు చేస్తారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. గురుసంచారం కారణంగా ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉన్నత విద్యాయత్నాలు ఫలిస్తాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో పట్టుదలతో వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ సృజనాత్మకతకు తగిన అవకాశాలు లభిస్తాయి. శాస్త్ర, విజ్ఞాన రంగాల వారికి ప్రోత్సాహకరం. పిల్లల విద్య, వృత్తి, వివాహం విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. . ఆరోగ్యం, విద్య పట్ల అధిక శ్రద్ధ చూపితే లక్ష్యాలు సాధిస్తారు . సెప్టెంబర్ 13 నుంచి గురువు తులారాశిలో ప్రవేసించడం వలన ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో వికాసం. అయితే ఖర్చులు అంచనాలు మించుతాయి. ఈ సంవత్సరం శని సంచరించడంవలన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సంస్థలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్ లో పనిచేసేవారు ఆశించిన ఫలితాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాహనాలు నడిపేవారు జాగ్రత్త వహించాలి. రాహుసంచారం కారణంగా కుటుంబ పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. బదిలీలకు అవకాశం. కేతు సంచారం కారణంగా ఉద్యోగంలో చికాకులు, ఒత్తిడి ఉంటాయి. ఈశ్వరుడి ఆరాధన శుభప్రదం అంటున్నారు.

3. మిథున రాశి (మృగశిర 3,4; ఆరుద్ర; పునర్వసు 1,2,3 పాదాలు)

ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 3 అవమానం - 6 మిథున
ఈ రాశి వారు ఈ ఏడాది స్థల సేకరణ, గృహనిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలం. వాహనం కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది శుభప్రదుడైన గురువు సంచరించడం వలన విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు, ఇంట్లో వేడుకలు, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. అదనపు బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలు సాధిస్తారు. ఇక పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థల సేకరణ, గృహ నిర్మాణానికి అనుకూలం. విద్యార్థులకు శుభప్రదం. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. విద్య, వైజ్ఞానిక రంగాల వారికి విశేష ప్రోత్సాహం లభిస్తుంది. శతృవులు కూడా మిత్రులవుతారు. స్నేహబాంధవ్యాలు విస్తరిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి- జూన్ మాసాల మధ్య రియల్ ఎస్టేట్ , గృహనిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. భారీ పెట్టుబడులకు ఈ ఏడాది దూరంగా ఉండాలి. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శని ఈ సంవత్సరమంతా సంచారం చేయడంవలన వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది. శని వక్రించిన ఏప్రిల్ 7- ఆగస్టు 26 మధ్య ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడికి లోనవుతారు. వైవాహిక జీవితంలో మనస్ఫర్థలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. కేతు సంచారం కారణంగా ఉన్నత చదువుల కోసం పట్టుదలతో ప్రయత్నించి సత్ఫలితాలు సాధిస్తారు. ఆస్తిపాస్తుల విషయాల్లో వివాదాలకు ఆస్కారం ఉంది. ఆంజనేయస్వామి ఆరాధన చేస్తే, శుభఫలితం ఉంటుంది.

4.కర్కాటకం(పునర్వసు 4; పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం - 14 వ్యయం - 2 రాజపూజ్యం - 6 అవమానం - 6
ఈ రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్ , రవాణా, కన్స ల్టెన్సీ, ఏజెన్సీలు, విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పని ఒత్తిడి అధికం అవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు. కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం మంద గిస్తుంది. మానసిక ఆందోళన అధికం. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. సొంత ఇల్లు సమకూర్చు కుంటారు. విద్య, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురు గ్రహం సెప్టెంబర్ 12 వరకు కన్యలో ఆ తరువాత తులారాశిలో సంచరించడం వలన సోదరీసోదరులు, బంధువుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన 19 వరకు వృత్తి, వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఈ ఏడాది శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఇక రుణబాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో ఉండదు. ఇక ఈ రాశివారు శ్రీవేంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది.

5. సింహ రాశి (మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం):

ఆదాయం - 2 వ్యయం - 14 రాజపూజ్యం - 2 అవమానం - 2
సింహ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. ఉద్యోగంలో బదిలీలు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానం విషయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది.ఆరోగ్యం మెరుగవుతుంది. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య తొందరపాటు నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. 2-3 స్థానాల్లో గురుగ్రహ సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. స్థిర, చరాస్తులు, విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. విద్యార్థులు పట్టుదలతో కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తారు. సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. అనుబంధాలు బలపడతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలకు, ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో చిన్నపాటి మార్పులు చేయడం వల్ల లాభాలు ఆర్జిస్తారు. కుటుంబ వ్యవహారాలు అనందం కలిగిస్తాయి. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. సెప్టెంబర్ 13 నుంచి సోదరులు, సన్నిహితులతో సదవగాహన ఏర్పడుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. విద్యాసంస్థలు, కన్సల్టెన్సీ, ఏజెన్సీల వారికి శుభప్రదం. ఉద్యోగం చేస్తూ చదువుకునేందుకు అనుకూలం. ఫిబ్రవరి 7 నుంచి జూన 10 వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. శని సంచారం కారణంగా ఆస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. విద్యార్థులు అశ్రద్ధ కారణంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు ఎదురవుతాయి. శని వక్రించిన ఏప్రిల్ 7 - ఆగస్టు 26 తేదీల మధ్య ఉన్నత విద్యా విషయాలకు అనుకూలం. స్నేహబాంధవ్యాలు, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహాల వల్ల చదువుల పట్ల కొంత అశ్రద్ధ చూపే అవకాశం వుంది. ప్రేమ వ్యవహారాల్లో చిక్కులు, ఆటంకాలెదురైనా ఓరిమితో అందరినీ ఒప్పించేందుకు యత్నిస్తారు. రాహు సంచారం కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కంగారు పడతారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. విలాస ఖర్చులు అధికం. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు సాధిస్తారు. కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. అపార్థాలు, కోపావేశాల కారణంగా సంబంధాలు దెబ్బతింటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. సూర్యభగవానుడి ఆరాధన శుభఫలితాలనిస్తుంది.

6. కన్యా రాశి(ఉత్తర 2,3,4; హస్త; చిత్త1,2 పాదాలు):

ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం - 5 అవమానం - 2 .
కన్యా రాశి వారు ఈ ఏడాది అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత ప్రతిష్ఠ పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీ యత్నాలు ఫలిస్తాయి. స్పెక్యులేషన్లు, ఆర్ధిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. గృహ నిర్మాణం, స్థలసేకరణకు అనుకూలం. వివాహ, ఉన్నత విద్యా యత్నాలు ఫలిస్తాయి. వైద్య, రాజకీయ సినీరంగాల వారికి ప్రోత్సాహకరం. ఫిబ్రవరిలో మధ్య అశాంతికి లోనవుతారు. చేపట్టిన పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జూన్ లో పరిస్థితి మెరుగవుతుంది. ఏడాది ప్రారంభం నుంచి గురువు మీ చంద్రరాశిలో సంచరించడంవలన సృజనాత్మక ప్రతిభతో వినూత్నమైన ప్రాజెక్టులు చేపడతారు. ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రీవారు, శ్రీమతి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బాంధవ్యాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాలు లాభిస్తాయి. శతృవులు కూడా మిత్రులుగా మారతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల వారికి పురోగతి కనిపిస్తుంది. కుటుంబం విస్తరిస్తుంది. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. సెప్టెంబర్ 13 నుంచి ఆర్థికంగా ప్రోత్సాహకరం. శని సంచారం ఫలితంగా పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బదిలీలు, సీట్ల మార్పిడి వల్ల అసౌకర్యానికి లోనవుతారు. దానివల్ల ఆందోళన పెరిగినా నెమ్మదిగా పరిస్థితులు సర్దుకుంటాయి.కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాలి. ఇంట్లో, కార్యాలయంలో బాధ్యతలు అధికం అవుతాయి. రాహుగ్రహ సంచారం కారణంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేస్తే మంచిది.

7. తులా రాశి (చిత్త 3,4; స్వాతి; విశాఖ 1,2,3 పాదాలు)

ఆదాయం - 2 వ్యయం - 8 రాజపూజ్యం - 1 అవమానం - 5.
తులా రాశి వారు ఈ ఏడాది ప్రమోషన్లు అందుకుంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో భాగంగా విదేశీయానం చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు ఫలిస్తాయి. 5, 4 స్థానాల్లో కేతు సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తలెత్తే అవకాశం ఉంది. తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడతారు. ఆరోగ్యం మందగిస్తుంది. గృహనిర్మాణ కోసం చేసే ప్రయత్నాలు నెమ్మదిగా ఫలిస్తాయి. రాజకీయ, సినీ, బోధన, న్యాయ, రక్షణ, మైనింగ్ రంగాల వారికి శుభప్రదం. ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో తొందరపాటు తగదు. రాజకీయ నేతలు ఉన్నత పదవులు అందుకుంటారు. సినీరంగానికి చెందిన వారు మంచి ప్రాజెక్టులు చేపడతారు. స్నేహ బాంధవ్యాలు పెంపొందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విశ్వాసంతో అనుకున్న పనులు నిరాటంకంగా పూర్తిచేయగలుగుతారు. సంతతి విషయంలో శుభపరిణామాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు ఖర్చు చేస్తారు. శని సంచారం ఫలితంగా ఆర్థిక విషయాల్లో నిదానం పాటించండి. శ్రీరామచంద్రుడిని ఆరాధన చేయడం ఈ రాశివారికి మంచిది.

8. వృశ్చిక రాశి(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ):

ఆదాయం - 8 వ్యయం - 14 రాజపూజ్యం - 4 అవమానం - 5
వృశ్చిక రాశి వారు ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించి, విజయం సాధిస్తారు.ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వినోద, విలాసాలకు సమయం వెచ్చిస్తారు. దంపతుల మధ్య సదవగాహన నెలకొంటుంది. టెక్స్ టైల్స్ , చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్ , ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరం ఫిబ్రవరి - జూన్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహంగా ఉంటుంది. మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ లోపిస్తుంది. గురువు ఈ ఏడాది లాభ, వ్యయ స్థానాల్లో సంచరిస్తున్నా కారణంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇక కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతి కలిగిస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. సోదరీసోదరులు, బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. లక్ష్మీదేవి ని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

9. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం):


ఆదాయం - 11,వ్యయం - 5 రాజపూజ్యం - 7,అవమానం - 1
ఈ రాశిలో పుట్టినవారు ఈ ఏడాది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులకు అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ, ప్రభుత్వ, సహకారరంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వైవాహిక జీవితం ఉల్లాసంగా ఉంటుంది. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది. క్రయవిక్రయాలకు ఏ మాత్రం అనుకూల సమయం కాదు. కీలక నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది. గృహనిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. ఫిబ్రవరి - జూన మాసాల మధ్య పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. బాధ్యతలు అధికం అవుతాయి.మనసు చికాకుగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు అధికం. సంతానం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. అదనపు ఆదాయం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి ఊహించని లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. సెప్టెంబర్ 13 నుంచి లాభస్థానంలో గురు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వివాహ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు అధికం. తొందర పాటు నిర్ణయాలు తగవు. శని సంచారం ఫలితంగా ప్రేమలు ఫలిస్తాయి. బంధుమిత్రుల పరిధి విస్తరిస్తుంది. పెద్దల సహకారం, సలహాలు తీసుకుని ముందడుగు వేయాలి. ఆరోగ్యం మందగిస్తుంది. శిరోవేదన, నరాలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఎడబాటు తప్పకపోవచ్చు. పోలీసు, రక్షణ రంగాల వారికి చిక్కులు ఎదురవుతాయి. గణపతి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది.

10. మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం; ధనిష్ఠ 1,2 పాదాలు):

ఆదాయం - 14,వ్యయం - 14 రాజపూజ్యం - 3,అవమానం - 1 ఈ రాశి వారు ఈ ఏడాది
ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విదేశీగమన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉన్నత పదవులు అందుకుంటారు. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. గురువు వక్రగమనంలో ఉండే ఫిబ్రవరి- జూన్ మాసాల మధ్య ఆందోళనలు అధికం అవుతాయి. వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. గురు సంచారం వల్ల ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాలలో ఉన్నవారికి ప్రోత్సాహకరం. సంతాన ప్రాప్తికి అనుకూలం. కళ, సాంస్కృతిక, బోధన, ఉన్నత విద్య, విదేశీ వ్యవహార రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. ఇక కేతు సంచారం కారణంగా అనవసర ఖర్చులు అధికం. చికాకులు కారణంగా ఏ విషయం మీదా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలాగే శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విలాసాలకు ఖర్చులు అధికం. రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, కళలు, సినిమాలు, వినోదం, పర్యాట రంగాల వారు ఫలితాలు ఆశాజనకంగా లేక నిరుత్సాహపడతారు. రహస్య కార్యకలాపాల కారణంగా అప్రతిష్ఠకు గురవుతారు. కుటుంబ బాధ్యతలు, వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. రాహు సంచారం కారణంగా పెట్టుబడుల్లో తొందరపాటు తగదు. ఆర్థిక విషయాల్లో ఇతరులకు సాయం చేసే విషయంలో ఒకటి రెండు సార్లు అలోచించాలి. వివాహ సంబంధాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ప్రేమానుబంధాలు బెడిసికొట్లే అవకాశం ఉంది. ఈరాశి వారు దుర్గామాత ఆరాధన చేస్తే మంచిది.

11. కుంభ రాశి (ధనిష్ఠ 3,4; శతభిషం; పూర్వాభాద్ర 1,2,3 పాదాలు):

ఆదాయం - 14,వ్యయం - 14 రాజపూజ్యం - 6,అవమానం - 1
ఈ రాశి వారు ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. పైచదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారాలకు తగిన సమయం. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థలమార్పిడికి, ప్రమోషన్లకు అవకాశం ఉంది. రాజకీయ, కళ, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆర్థిక విషయాల కారణంగా ఆందోళన, వృత్తిపరమైన ఒత్తిడులకు లోనవుతారు. న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. కేతు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. ఆరోగ్యం మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. గురు సంచారం ఫలితంగా ఈ ఏడాది స్థిరచరాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు. న్యాయ, ఆధ్యాత్మిక, బోధన, పత్రికలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యరంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది. శత్రువులతో విబేధాలు సమసిపోతాయి. జూన్ 10 వరకు ఆస్తి వ్యవహారాల్లో చికాకులు ఎదురవుతాయి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆర్థిక సాయం చేస్తే సమయానికి డబ్బు తిరిగి రాదు. న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయి..శని సంచారం వలన రియల్ ఎస్టేట్ రంగంలోని వారి పరిస్థితి మెరుగుపడుతుంది. నూనెలు, ఇనుము, భూములు, ఖనిజాల వ్యాపారులకు ప్రోత్సాహకరం. వృత్తి, వ్యాపారాల్లో అదనపు బాధ్యతలు మోయాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. ఒత్తిళ్లు అధికమౌతాయి. ఆలస్యాలు, ఆటంకాలు, న్యూనత, వైఫల్యాల వల్ల అసంతృప్తి, అశాంతికి లోనవుతారు. వాహనాలు నడిపే సమయంలో ఏకాగ్రత అవసరం. చెడు స్నేహాల వల్ల నష్టపోయే అవకాశం వుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. పెట్టుబడులలో తొందరపాటు తగదు. రాహు సంచారం కారణంగా స్నేహ బాంధవ్యాల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. రుణబాధలు అధికం. శ్రీకృష్ణుడి ఆరాధన చేస్తే మంచి ఫలితాలు పొందగలరు.

12. మీన రాశి (పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి):

ఆదాయం - 11,వ్యయం - 5 రాజపూజ్యం - 2 అవమానం - 4
ఈ రాశి వారికి ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తులు పెంపొందించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పై చదువులు, విదేశీ గమనానికి అనుకూలం. కొత్త వ్యాపారానికి, పరిశ్రమల ప్రారంభానికి తగిన సమయం. ఫిబ్రవరి-జూన మాసాల మధ్య ఆందోళనలు పెరుగుతాయి. వృత్తిపరమైన ఒత్తిళ్ళు, న్యాయ, ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.రాహు సంచారం వల్ల రుణ బాధలు అధికం. ఆర్ధిక విషయాల్లో ఒత్తిడికి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గురు గ్రహ సంచారం ఫలితంగా శ్రీవారు, శ్రీమతి విషయాలలో పురోగతి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు, అభిమానులు మీ లక్ష్యసాధనలో సహకరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు. ప్రత్యర్థులపై విజయం . ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. కేతు సంచారం కారణంగా ఇంటి కోసం ఖర్చులు అధికం. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. క్రయవిక్రయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక విషయాల్లో తొందరపాటు తగదు. ఇచ్చిన మాట నిలుపుకోరు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. విద్యార్థులు, క్రీడారంగంలోని వారికి శుభప్రదం. రాజకీయ, కళా, సినీ, రవాణా, విద్య, ఐ.టి. రంగాల వారికి ప్రోత్సాహకరం భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. యుక్తితో నెమ్మదిగా పనులు పూర్తి చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. శని సంచరిస్తున్న ఫలితంగా ఉన్నత చదువులు, విదేశీ ప్రయాణాల్లో చిక్కులు వస్తాయి. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. అదనపు బాధ్యతలు చేపట్టాల్సి రావడం వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకుంటాయి. పెద్దల ఆరోగ్యం కలవరపెడుతుంది. సన్నిహితులు, బంధువుల భాగస్వామ్యంతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పార్వతీదేవి ఆరాధన మంచిది.
మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథస్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పేరుగాంచిన క్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాధ, బలభద్ర, సుభద్ర స్వామివారు కొలువై ఉన్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పూరి శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుంది

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది పూరిజగన్నాథుని ఆలయం. ఈ ఆలయంపై జెండా ఎప్పుడూ గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుందట.

చరిత్ర

ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ నిర్మితమైందో ఆధారాలు లేకపోయినప్పటికీ గంగదేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో నిర్మించాడని శాసనాల ద్వారా అవగతమవుతుంది.

మీవైపే చూస్తున్నట్లు

ఈ ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం మీరు పూరి పట్టణంలో ఎక్కడినుండి చూసినా మీవైపే చూస్తున్నట్లు ఉంటుంది.

లోపల 120 ఆలయాలు

ఈ ఆలయ సమూహం నాలుగులక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూ ఎత్తైన ప్రాకారం కలిగి ఉంటుంది. లోపల 120 వరకు ఆలయాలు ఉన్నాయి.

మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి

భారతదేశంలో 7 మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి. మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది సాయంకాలం దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ పూరిలో మాత్రం పూర్తి విరుద్దంగా ఉంటుందట.

ఆలయం మీద వెళ్ళవు

పక్షులు, విమానాలు ఆలయం మీద వెళ్ళవు.

నీడ ఏ సమయంలోనైనా కన్పించదు

ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా సరే ఏ దిశలోనూ అస్సలు కన్పించదు.

20 లక్షల మందికి పెట్టవచ్చు

పూరి జగన్నాథుని ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని సుమారు 20 లక్షల మందికి పెట్టవచ్చు. అయినా సరే ఆ ప్రసాదం వృధా అవ్వదు, తక్కువకూడా అవ్వదు.

ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది

పూరి జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పుమీద 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరి ఒకటి పెట్టి వంట చేస్తారు. అయితే సాదారణంగా కింద ఉండే పాత్ర వేడవుతుంది. కాని విచిత్రంగా ఇక్కడ మాత్రం ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది ఆ తరువాత కింద పాత్ర వేడెక్కుతుంది.

సముద్రం శబ్ధం వినపడదట

ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేస్తే సముద్రం శబ్ధం వినపడదట. అదే ఒక అడుగు వెనక్కివేస్తే శబ్ధం వినిపిస్తుందట.

దీపావళి అంటే చిన్నపిల్లలనుండి  పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన పండుగ. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటో వివరాల్లోకి వెళ్తే.. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటంటే...

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అని ఇంద్రుడు అంటాడు. దీనికి ఆ మాత.. త్రిలోకాథిపతీ, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని సమాధానమిచ్చింది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
సాధారణం గా ఆడవారు ప్రవేశించని దేవాలయాలు ఉంటాయి కానీ మగవారు కూడా ప్రవేశించని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా ?మగవాళ్ళను అనుమతించని ఆలయాలు మన భారతదేశంలో కొన్ని ఉన్నాయి. ఈ దేవాలయాలలో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి  ఉండగా, మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడి లోకి మగవాళ్ళు రాకుండా చూసుకునేందుకు అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాం…

రాజస్థాన్-  బ్రహ్మ దేవుడు ఆలయం 

రాజస్థాన్ లోని పుష్కర్ లో బ్రహ్మ దేవుడు ఆలయం ఉంది.  బ్రహ్మ దేవునికి ఆలయాలు అరుదు అంతే కాకుండా ఆయన మగవాడు అయినప్పటికీ ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం… బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్కన ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. అందువలన సరస్వతి దేవికి ఆగ్రహం వచ్చి, ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని శపిస్తుంది. అందుకే ఆ ఆలయానికి మగవాళ్ళు వెళ్లారు.

కన్యాకుమారి- దేవీ ఆలయం

దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఒకటైన కన్యాకుమారి లో దేవీ ఆలయంలో ప్రధాన దేవత దుర్గా మాత అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.


కేరళ-భగవతీ ఆలయం

చెంగన్నూర్ భగవతీ ఆలయం కేరళలో కలదు. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఆ ఆలయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు.  ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.


కేరళ-అట్టుకల్ దేవాలయం

కేరళ రాష్ట్రంలో అట్టుకల్ దేవాలయం గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఒక్క మగాడూ కూడా వెళ్లారు కాదని వెళితే  పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.

కేరళ-దుర్గా దేవిదేవాలయం

కేరళ రాష్ట్రంలో దుర్గా దేవి కొలువై ఉండే ఈ దేవాలయాన్ని చక్కులాతుకవు దేవాలయం అంటారు. ప్రతీ సంవత్సరం  వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు.


బీహార్ -మాతా ఆలయం 

మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.
ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం  వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా... ఆలస్యం చేయకుండా చదివేయండి.
శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన బక్తుడు శ్రీ అనంతాళ్వార్‌. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వరస్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు. ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు. ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు గా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే  మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.

More

Recent Posts