Showing posts with label Health Tips. Show all posts
Showing posts with label Health Tips. Show all posts

బొద్దింకలు ముఖ్యం గా వంటగదిలో చాలా ఇబ్బంది పెడతాయి, కానీ ఇంట్లోనే ఉండే కొన్ని సులభమైన వాటిని ఉపయోగించి నేచురల్ చిట్కాలు వాడితే వీటిని దూరం పెట్టొచ్చట. అవేమిటో ఇప్పుడు చూద్దాం..


Simple tips to get rid of cockroaches



బొద్దింకల్ని తరిమికొట్టే సింపుల్ చిట్కాలు


1. బేకింగ్ సోడా + పంచదార

  • సమాన మోతాదులో బేకింగ్ సోడా, పంచదార కలిపి బొద్దింకలు తిరిగే మూలలలో, సింక్ దగ్గర చల్లాలి.
  • పంచదార వాసనకి బొద్దింకలు వస్తాయి → తిన్న తర్వాత బేకింగ్ సోడా వల్ల చనిపోతాయి.


2. బోరాక్స్ పొడి + పిండి

  • 1 స్పూన్ బోరాక్స్ పొడిని కొద్దిగా పిండి లేదా పంచదారలో కలిపి ఉంచాలి.
  • ఇది బొద్దింకలకు విషంలా పనిచేస్తుందట. (⚠️ పిల్లలు, పెంపుడు జంతువులు  అందుకోలేని చోట పెట్టండి. పిల్లలు ఉన్నవాళ్లు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది).


3. నిమ్మకాయ తొక్కలు

  • బొద్దింకలు ఎక్కువగా వచ్చే మూలల్లో, అల్మారీల్లో పొడిచేసిన నిమ్మకాయ/కామలాపండు తొక్కలు పెట్టాలి.
  • వీటి వాసన బొద్దింకలు అస్సలు ఇష్టపడవు.


4. వెల్లులి, ఉల్లిపాయ నీరు

  • ఒక గ్లాస్ నీటిలో 4–5 వెల్లులి రెబ్బలు, సగం ఉల్లిపాయ ముద్ద వేసి ఉంచాలి.
  • ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో వేసి బొద్దింకలు వచ్చే మూలల్లో స్ప్రే చేస్తే అవి దూరం అవుతాయి.


5. కొబ్బరి నూనె + పసుపు

  • కొద్దిగా కొబ్బరి నూనెలో పసుపు కలిపి మూలల్లో రాయండి.
  • ఇది యాంటీ ఇన్సెక్ట్ గుణాలు కలిగి ఉండి బొద్దింకలను తరిమేస్తుంది.


 అదనంగా పాటించవలసినవి


* సింక్, డ్రెయిన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

* రాత్రి తిన్న ప్లేట్లు, ఆహారపు గిన్నెలు అలాగే వదలకూడదు ఆలా ఉంచడం వాళ్ళ బొద్దింకలు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది.

* చెత్త డబ్బా మూత వేసి ఉంచాలి.

* వంటగది మూలల్లో వారానికి ఒకసారి అయినా ఫినైల్ నీరు లేదా డెటాల్ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కకి చాల ప్రాధాన్యత ఇచ్చేవారు ఇంకా చాలా పవిత్రంగా పూజిస్తారు. రోజూ తులసిని పూజించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని మనఅందరికీ తెలుసు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి రోజంతా ప్రాణవాయువును విడుదల చేస్తుంది అంట. తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమమ్ టెన్యూయి ఫ్లోరం. ఇప్పుడు తులసి యొక్క ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Benefits Of Tulsi Plant In Home


తులసిని పూజించడానికి కారణమేంటి?

పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కథనాలు ఉన్నాయి. తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే లక్ష్మీ దేవికి భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతి రోజూ ఎంతో భక్తితో కొలిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని హిందువుల నమ్మకం. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయట.

 తులసి చేసే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం తులసి. మహాభారత కాలంలో ఘటోత్కచుడు కూడా మోయలేని ఆ భగవత్ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి.

  • కొన్ని తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటితో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
  • ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ తులసి ఆకుల రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
  • తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే కూడా ఫలితం ఉంటుంది.
  • కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడం లాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి)ఫలితం ఉంటుంది.
  • తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంటుంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
  • తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే  బరువు తగ్గుతారట. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారించే గుణం ఉంది.
  • తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
  • తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా మారుతుంది.
  • తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుందంట .
  • జీర్ణ శక్తికి తులసి చాలా మంచి ఔషధం. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది అంట. తిన్నది కూడా జీర్ణమవుతుంది.
  • కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉందంట. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
  • 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటే అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.

 

ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా అందరూ కూడా మాస్క్లని ధరించాల్సిందే .. కాబట్టి ఏ పనిమీద బయటకు వెళ్ళవలసి వచ్చినా కచ్చితంగా మాస్క్ని ధరించాలి అని  చెబుతున్నారు నిపుణులు.

కాబట్టి మీకు మాస్క్ అందుబాటులో లేకపోతే.. మీరే స్వయంగా ఇంట్లోనే మాస్క్ ని తయారు చేసుకోవచ్చు .


5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా మాస్క్ రెడీ

కావాల్సిన వస్తువులు

1. కాటన్ మెటీరియల్
2. 4 క్లాత్ స్ట్రిప్స్(చెవులకు తగిలించుకునేందుకు సన్నని తాడులాగా కుట్టుకోండి )
3. కత్తెర
4. కుట్టుమిషన్
  • ముందుగా కాటన్ మెటీరియల్ ని  కత్తిరించుకోవాలి..
  • పెద్దవారికైతే : 9 X 7 ఇంచులు
  • చిన్నవారికైతే : 7 X 5 ఇంచులు
  • ఇప్పుడు 4 స్ట్రిప్స్ ని  క్లాత్కి కట్టేందు, అదే విధంగా పైపింగ్లా చేసేందుకు కొంచం క్లోత్ కట్ చేసుకోవాలి.
  • కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని పైన, కింద ఇలా  చివరలు (పైపింగ్నీటి గా కుట్టుకోండి.
  • ఇప్పుడు క్లాత్ని కిందకి ప్లీట్స్ (మడత) పెడుతుూ కుట్టుకోవాలి. ఒక్కో ప్లీట్ 1.5 ఇంచ్ వచ్చేలా కుట్టుకోవాలి.పెట్టుకున్న తర్వాత రెండు పక్కలా పైపింగ్ చేయాలి.
  • ఇలా తయారైన మాస్క్కి కట్టుకునేందుకు నాలుగువైపులా స్ట్రిప్స్ క్లాత్ని కుట్టాలి.
  • ఇప్పుడు మీకు మాస్క్ రెడీ అయినట్లే, ఇది తయారు చేయడం మాత్రమే కాదు.. తయారైన మాస్క్ని ఎలా వాడాలన్నది కూడా ముఖ్యమే. మాస్క్ని మొత్తం నోరు, ముక్కు కవర్ అయ్యేటట్టు ముఖానికి, మాస్క్కి గ్యాప్ లేకుండా కట్టుకోవాలి. అదే విధంగా.. ప్లీట్స్ కిందికి ఉండేలా కట్టు కోవాలి.
  • మీరు రెండు మాస్క్ ని వాడడం మంచిది. ఒకటి ఉతికినప్పుడు ఇంకొకటి వాడొచ్చు.

మాస్క్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మాస్క్ని వాడే ముందు కచ్చితంగా  శుభ్రం చేయాలి అదే విధం గా చేతులను  కూడా శుభ్రం చేసుకోవాలి.
  • మాస్క్ త్వరగా మెత్తగా అయినట్లు అనిపిస్తే వేరే మాస్క్ వాడడం మంచిది.
  • ఒకసారి వాడిన మాస్క్ని క్లీన్ చేయకుండా మరోసారి అసలు వాడరాదు  .

మాస్క్ తీసేటప్పుడు..

మాస్క్ని ముందుభాగంలో ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. కేవలం పక్కభాగంలో ఉన్న స్ట్రింగ్స్ ద్వారే తీసేయాలితీసిన వెంటనే మీ చేతులని70 శాతం ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా సబ్బు నీటితో 40 సెకన్ల పాటు బాగా రుద్దుతూ కడగాలిమాస్క్ని ఉప్పు కలిపిన మరుగుతున్న నీటిలో లేదా సబ్బు నీటిలో నేరుగా వేయండి.

వాడిన మాస్క్ని ప్రతి రోజూ ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి ?

  • రెండోసారి వాడలేని మాస్క్లని వాష్ చేయొద్దు. ఎందుకంటే అవి ఉతకాల్సిన మెటిరీయల్ కాదని గుర్తుపెట్టుకోవాలి.
  • వాడిన మాస్క్లని సబ్బు, వేడి నీటితో ఉతికిన తర్వాత దానిని ఎండలో కనీసం 5 గంటలపాటైనా ఆరవేయాలి.

ఎండ లేకపోతే ?

వాడిన మాస్క్ని ప్రెజర్ కుక్కర్లో వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆరేయాలి. నీటిలో ఉప్పు వేస్తే మంచిది. కుక్కర్ లేకపోయినట్లైతే దానిని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడకబెట్టొచ్చు.

కుక్కర్, వేడి నీటిని వాడే వీలు లేకపోతే ?

మాస్క్ని సబ్బుతో శుభ్రం చేసి దానిని 5 నిమిషాల పాటు మీడియం వేడితో ఐరన్ చేయొచ్చు.

మాస్క్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ?

ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే తీసుకోవాలి. దీనిని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని రెండు వైపులా ఆరవేయాలి. ఇప్పుడు అందులో రెండో మాస్క్ని పెట్టి దాచొచ్చు.
అయితే, కవర్ని ఎప్పుడు కూడా సీల్ చేయడం చాలా ముఖ్యం. 

ఎందుకు కాటన్ మాస్క్ని ఉపయోగించాలి ?

కాటన్ మాస్క్ల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఇంట్లో తయారు చేయడం వలన ఇవి కాస్తా పెద్దవిగా ఉంటాయి దాని  వల్ల వైరస్లు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న వైరస్లని కూడా మనదరికి చేరనివ్వవు. వీటిని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం.

ఒక్క ఎలుక తో మొదలై  ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది వాటి సంఖ్య. ఇంటిలో  పుస్తకాలు మరియు బట్టలను పాడుచేస్తాయి  అంతే కాదు వీటి వలన అనేక వ్యాధులు కూడా వస్తాయి. ఎలుకలతో విసుగు చెందినప్పుడు వాటిని ఎలా వదిలించుకోవాలో అని ఆలోచిస్తుంటాం. అయితే ఇక్కడ తెలిపిన  సులువైన మార్గాల ద్వారా ఎలుకలను ఈజీ గా వదిలించుకోవచ్చు.



టిప్ నెంబర్ 1 : పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్

పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్  ఘాటైన  వాసన  కలిగి ఉంటుంది . ఈ వాసన ఎలుకలకు పడదు. అందువల్ల పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి
 అవి పారిపోతాయి. కాబట్టి ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి
సహాయపడుతుంది.

కావలసినవి
పిప్పరమింట్ నూనె
కాటన్ బాల్స్

పద్దతి
* పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి.
* సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
* అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.

టిప్ నెంబర్ 2 : లవంగం ఎసెన్షియల్ ఆయిల్
ఎలుకలు బలమైన లవంగం ఎసెన్షియల్ ఆయిల్ వాసనను భరించలేవు. లవంగం వాసన ఉన్న
చోటు నుండి ఎలుకలు పారిపోతాయి. దీని కోసం లవంగాలు లేదా లవంగాల నూనెను
ఉపయోగించవచ్చు.

కావలసినవి
లవంగం ఎసెన్షియల్ ఆయిల్
కాటన్ బాల్స్

పద్దతి
* లవంగం ఎసెన్షియల్ ఆయిల్ లో కాటన్ బాల్ ని ముంచాలి.
* ఈ కాటన్ బాల్స్ ని తలుపుల దగ్గర మరియు ఎలుకలు ఎక్కువగా తిరిగే
ప్రాంతంలో పెట్టాలి.
* అలాగే ఒక కాటన్ క్లాత్ లో కొన్ని లవంగాలను వేసి ర్యాప్ చేసి ఎలుకలు
తిరిగే ప్రదేశంలో పెట్టవచ్చు.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

టిప్ నెంబర్ 3 : కలరా ఉండలు
కలరా ఉండల బలమైన వాసన ఎలుకలను తరిమి కొడుతుంది.

కావలసినవి
మూత ఉన్న చిన్న కంటైనర్
కలరా ఉండలు

పద్దతి
* చిన్న కంటైనర్లను తీసుకోని వాటికీ రంద్రాలు చేయాలి.
* ఈ చిన్న కంటైనర్లలో రెండు లేదా మూడు కలరా ఉండలను ఉంచాలి.
* ఈ చిన్న కంటైనర్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంచాలి.
* ఈ విధంగా చేయుట వలన ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

టిప్ నెంబర్ 4 : అమ్మోనియా
అమ్మోనియా బలమైన వాసనను ఎలుకలు భరించలేక పారిపోతాయి. అమ్మోనియా వాసన
ఎలుకలు ఆ ప్రదేశం వదిలి వెళ్ళేలా వెంటాడుతుంది.

కావలసినవి
మూత ఉన్న చిన్న కంటైనర్
అమ్మోనియా

పద్దతి
* ఎలుకలు వదిలించుకోవటం కొరకు కలరా ఉండలతో  ఉపయోగించిన అదే ప్రక్రియను అనుసరించాలి.
* ఎలుకలు తరచుగా తిరిగే ప్రదేశాలను అమ్మోనియాతో శుభ్రం చేయాలి.
* అంతేకాకుండా ఎలుకల రెట్టను శుభ్రం చేయటానికి కూడా అమ్మోనియా సహాయపడుతుంది.

టిప్ నెంబర్ 5 :సబ్బు డిటర్జెంట్ మరియు టబాస్కో సాస్
ఇది ఇంటిలో ఎలుకలను బయటకు తరమటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కావలసినవి
సోప్ డిటర్జెంట్ - ¼ కప్పు
టబాస్కో సాస్ - 1 టేబుల్ స్పూన్
ఒక స్ప్రే బాటిల్
నీరు - 1 గాలన్

పద్దతి

* నీరు, సాస్ మరియ డిటర్జెంట్ ఈ మూడింటిని బాగా కలపాలి.
* ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఎలుకలు తరచుగా వచ్చే ప్రదేశంలో
స్ప్రే చేయాలి.
* ఈ మిశ్రమం ఎలుకలు ఇంటిలో నుండి బయటకు పోవటానికి సహాయపడుతుంది.
ప్రస్తుత కాలంలో అందరూ బిజీ బిజీ గా ఒక్కనిమిషం కూడా ఖాళీ లేకుండా కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో తినడానికి, ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా మందికి టైం ఉండదు.  ఈ క్రమం లో టైం కి భోజనం చేయకపోవడం వలన గ్యాస్ ట్రబుల్  అనే సమస్య తలెత్తుతుంది. చక్కగా  సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య అంతగా కనిపిచందని వైద్యనిపుణులు తెలియజేసారు.

ప్రస్తుత కాలంలో అందరూ బిజీ బిజీ గా ఒక్కనిమిషం కూడా ఖాళీ లేకుండా కాలాన్ని గడుపుతున్నారు. అయితే ఈ బిజీ లైఫ్ లో తినడానికి, ఇంకా రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా మందికి టైం ఉండదు.  ఈ క్రమం లో టైం కి భోజనం చేయకపోవడం వలన గ్యాస్ ట్రబుల్  అనే సమస్య తలెత్తుతుంది. చక్కగా  సమయానికి సరిగ్గా ఆహారం తీసుకునే వారిలో ఈ సమస్య అంతగా కనిపిచందని వైద్యనిపుణులు తెలియజేసారు.   కొంతమంది కి ఇంట్లో వంట చేసుకునే టైం లేకపోవడం వల్లనో లేదా ఇతర కారణాలవల్ల బయట ఫుడ్ కి అలవాటు పడతారు.మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అలాగే  జంక్‌ ఫుడ్‌ అధికంగా తినేవారిలోనూ ఈ  గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఎక్కువ ఉంటుంది. మనకు ఇవ్వన్ని తెలిసినా కూడా  కొన్ని తప్పనిసరి కారణాల వల్ల ఈ సమస్యల్ని  ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే ఈ  గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య తో బాధ పడే వారికీ ఇక్కడ  చక్కని చిట్కా చెప్పడం జరిగింది. అదేమితో చూద్దమా..  టిప్ నెంబర్ 1 కావలసినవి  పదార్ధాలు  తమలపాకులు-20ml  రసం   ఇంగువ- చిటికెడు  సైంధవ లవణం(రాళ్ళ ఉప్పు)- చిటికెడు  అల్లం- 20ml  రసం  తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం 20ml  తమలపాకు రసం తీసుకోవాలి . ఈ రసానికి 20 మిల్లీ లీటర్ల అల్లం రసం కలుపుకోవాలి. ఈ రెండు రసాలను బాగా కలుపుకోవాలి. తర్వాత  చిటికెడు ఇంగువ, ఉప్పు వేసి బాగా  కలుపుకోవాలి. ఈ రసాన్ని మంచి నీటితో కలుపుకొని  గ్యాస్‌ట్రబుల్‌  ఉన్నవారు రోజూ రెండు గ్లాసుల నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుందట.   టిప్ నెంబర్ - 2 కావాల్సిన పదార్ధాలు మెంతులు - అరచెంచాడు  జీలకర్ర - 1 చెంచా  సైంధవ లవణం- సరిపడినంత   మజ్జిగ- 200ml   నెయ్యి   తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం నెయ్యిలో వేయించిన అరచెంచాడు మెంతులు తీసుకుని పొడిగా చేసుకుని  వాటిని 200 మిల్లీలీటర్ల మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం లో ఒక చెంచా జీలకర్ర, సరిపడినంత  సైంధవ లవణాన్ని కలపుకోవాలి. ప్రతి రోజు రోజుకు రెండు సార్లు ఈ మజ్జిగను తాగితే  గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందినట్లే.  సాధ్యమైనంతవరకు వంటల్లో మెంతులను వినియోగిస్తే చాలా మంచిది ఎందుకంటే మెంతుల్లో పీచు పదార్థం ఎక్కువ గా ఉండడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్‌, హైబీపీ, స్థూలకాయం వంటి సమస్యలను దగ్గరకు రానివ్వదట..అంతే కాదు నెయ్యిలో కొద్దిగా  మెంతులు వేసుకొని వాటిని బాగా వేపి వాటిని పొడి చేసుకుని నీరు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనం మధ్యలో తాగితే  చాలా మంచిదంట . ఇది ఆహారం నుంచి విడుదలయ్యే షుగర్‌ ప్రమాణాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యం వంతులుగా ఉంచుతుంది.


కొంతమంది కి ఇంట్లో వంట చేసుకునే టైం లేకపోవడం వల్లనో లేదా ఇతర కారణాలవల్ల బయట ఫుడ్ కి అలవాటు పడతారు.మసాలాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వలన అలాగే  జంక్‌ ఫుడ్‌ అధికంగా తినేవారిలోనూ ఈ  గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య ఎక్కువ ఉంటుంది. మనకు ఇవ్వన్ని తెలిసినా కూడా  కొన్ని తప్పనిసరి కారణాల వల్ల ఈ సమస్యల్ని  ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయితే ఈ  గ్యాస్‌ ట్రబుల్‌ సమస్య తో బాధ పడే వారికీ ఇక్కడ  చక్కని చిట్కా చెప్పడం జరిగింది. అదేమితో చూద్దమా..

టిప్ నెంబర్ 1

కావలసినవి  పదార్ధాలు 

తమలపాకులు-20ml  రసం
ఇంగువ- చిటికెడు
సైంధవ లవణం(రాళ్ళ ఉప్పు)- చిటికెడు
అల్లం- 20ml  రసం

తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం

20ml  తమలపాకు రసం తీసుకోవాలి . ఈ రసానికి 20 మిల్లీ లీటర్ల అల్లం రసం కలుపుకోవాలి. ఈ రెండు రసాలను బాగా కలుపుకోవాలి. తర్వాత  చిటికెడు ఇంగువ, ఉప్పు వేసి బాగా  కలుపుకోవాలి. ఈ రసాన్ని మంచి నీటితో కలుపుకొని  గ్యాస్‌ట్రబుల్‌  ఉన్నవారు రోజూ రెండు గ్లాసుల నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటే చక్కని ఫలితం ఉంటుందట.

టిప్ నెంబర్ - 2

కావాల్సిన పదార్ధాలు

మెంతులు - అరచెంచాడు
జీలకర్ర - 1 చెంచా
సైంధవ లవణం- సరిపడినంత
మజ్జిగ- 200ml
నెయ్యి

తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం

నెయ్యిలో వేయించిన అరచెంచాడు మెంతులు తీసుకుని పొడిగా చేసుకుని  వాటిని 200 మిల్లీలీటర్ల మజ్జిగలో కలుపుకోవాలి. ఈ మిశ్రమం లో ఒక చెంచా జీలకర్ర, సరిపడినంత  సైంధవ లవణాన్ని కలపుకోవాలి. ప్రతి రోజు రోజుకు రెండు సార్లు ఈ మజ్జిగను తాగితే  గ్యాస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందినట్లే.

సాధ్యమైనంతవరకు వంటల్లో మెంతులను వినియోగిస్తే చాలా మంచిది ఎందుకంటే మెంతుల్లో పీచు పదార్థం ఎక్కువ గా ఉండడం వల్ల మధుమేహం, కొలెస్ట్రాల్‌, హైబీపీ, స్థూలకాయం వంటి సమస్యలను దగ్గరకు రానివ్వదట..అంతే కాదు నెయ్యిలో కొద్దిగా  మెంతులు వేసుకొని వాటిని బాగా వేపి వాటిని పొడి చేసుకుని నీరు లేదా మజ్జిగలో కలుపుకుని భోజనం మధ్యలో తాగితే  చాలా మంచిదంట . ఇది ఆహారం నుంచి విడుదలయ్యే షుగర్‌ ప్రమాణాన్ని గణనీయంగా నియంత్రిస్తుంది మిమ్మల్ని ఆరోగ్యం వంతులుగా ఉంచుతుంది.