Showing posts with label Interesting Facts. Show all posts
Showing posts with label Interesting Facts. Show all posts
ప్రపంచలో మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని గురిచేస్తాయి. అలాంటి కొన్ని మనకు తెలియని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఇవి మీకు తెలుసా ?

  • ప్రెట్టి బాయ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి  అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ అంట . 1920 సంత్సరంలో ఎన్నో బ్యాంకులో దొంగతనం చేసి దొంగతనం చేసిన ప్రతి బ్యాంకు లో ఎంతో మంది పేదలకి సంబంధించిన రుణ పత్రాలని కాల్చేసేవాడు. అలా  ఒక దొంగ ఐనా ఆరోజుల్లోనే ఎంతోమందికి రుణ మాఫీ చేసాడు. అందుకే ఇతని అంతక్రియలలో కొన్ని వేళ మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారంట. నిజంగా మంచి దొంగ కదా !
  • ప్రపంచంలోనే ఎక్కువుగా అమ్ముడు అయ్యే బిస్కట్ ఏంటో తెలుసా పార్లే జి . ప్రతి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమరుగుగా 48,00,00,000 కోట్ల పార్లే జి బిస్కట్ ప్యాకెట్లు అమ్ముడు అవుతున్నాయట.
  • ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ పేరు మిల్ ఎండ్స్ పార్క్. ఇది అమెరికాల లోని పోర్ట్ ల్యాండ్ అనే ప్రాంతం లో ఉంది.ఇది కేవలం రెండు అడుగులు మాత్రమే ఉంటుందట. ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ గా ఇది గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కింది.
  • ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ పాయిజన్ సైనైడ్ ఇది మనం తినే ఆపిల్ గింజలో కూడా ఉంటుందట. కానీ ఇది చాలా తక్కువ మొత్తంలో ఉండడం వల్ల  మన శరీరం దాని ప్రభావాన్ని తట్టుకుంటుంది. ఒక మనిషి చనిపోవాలి అంటే బాడీలో ఒక కేజీ బరువుకి ఒక మిల్లి గ్రామ్ సైనైడ్ అవసరం ఉంటుంది.ఒక ఆపిల్ గింజలో 0.49 mg సైనైడ్ ఉంటుంది.అంటే 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఒకేసారి 120 ఆపిల్ గింజలు తింటే చనిపోయే అవకాశం ఉంది. పొరపాటున ఒకటి రెండు గింజలు తిన్నాకూడా మనకి ఏమి కాదు.
  • ఆడ కంగారూలు ఒకేసారి రెండు పిల్లలకు రెండు స్తనాల నుంచి రెండు రకాల పాలివ్వగలవట. పుట్టి నెలల వయసున్న కంగారూకు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండే పాలిస్తుందంట. అదే సమయం లో మరో కంగారూ పుడితే దానికి కొవ్వు పదార్ధాలు ఎక్కువ గా ఉండే పాలిస్తుంది. అంటే…ఒకేసారి రెండు పిల్లలకు రెండు రకాల పాలన్నమాట.
  • ప్రపంచంలో అత్యధిక వేగంతో గాలులు వీచే ప్రదేశం అంటార్కిటికాలోని కామన్వెల్త్‌బే. అక్కడ గాలి గంటకు 150 మైళ్ళ వేగంతో వీస్తుంది
  • స్వీడన్ లో ఐస్ తో నిర్మించబడిన హోటల్ ఉంటుంది. సీజన్ మారుతున్నప్పుడు ఈ హోటల్ కరిగిపోతుంది,అందుకే ఈ హోటల్ ను ప్రతి ఏటా నిర్మిస్తూనే ఉంటారు.
  • స్ట్రాబెరీలలోకన్నా నిమ్మకాయల్లో చక్కెర శాతం ఎక్కువ.
  • ఊసరవెల్లి నాలుక దాని శరీరం కంటే రెండు రెట్లు పొడవుగా ఉంటుంది.
  •  ఒకే పరిమాణం లో ఉన్న ఇనుప గొట్టం, మనిషి ఎముకలను పరీక్షిస్తే మనిషి ఎముకే బలమైనదని తేలింది.
  •  ఏ రెండు జీబ్రాల వంటి మీది గీతలు….ఒకేలా ఉండవు.
  • చీమలకు సుద్దపొడి గిట్టదు. అందుకే సుద్దముక్కతో గీసిన గీతాలను అవి దాటలేవు.
  • మనకు మాట్లాడేటప్పుడు ఒక్కోసారి ఒక్కోమాట ఎంత ఆలోచించిన తట్టదు…ఈ స్థితిని lethologica అని అంటారట.
రామనామ జపంతో తరిచి చిరంజీవి అయిన  శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. ఎక్కడైనా రామనామ జపం , కీర్తనలు జరుగుతుంటే అక్కడ ఆంజనేయుడు ఉంటాడని చెబుతుంటుంటారు. అంతేకాదు, నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. చాలాచోట్ల హనుమాన్ మందిరాలున్నాయి. ఇక  ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన ఆలయం ఒకటి వుంది. అదే  హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ లోని ఆంజనేయ స్వామి టెంపుల్.  వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయని అంటారు. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయం వెనుక చాలా చరిత్ర మహిమ వున్నాయి.


  • క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే  రాజు రెండో ప్రతాపరుద్రుడు. అతడు వేటాడుతూ అలసిపోయి  ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. 
  • కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు చేరుకుంటాడు . 
  • అక్కడ ఎటు చూసినా ఏమి కనిపించకపోవడంతో తిరిగి రాయి వద్దకు బయలు దేరి వస్తాడు . 
  • మళ్లీ పులి గాండ్రింపు వినిపిస్తుంది దాంతో చుట్టుపక్కల అంతా శోధిస్తాడు అయినా  కూడా ఎలాంటి జంతువు  ప్రతాపరుద్రుడుకు కనిపించదు. 
  • అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు ప్రతాపరుద్రుడు. 
  • ధ్యానం చేస్తే దర్శనమిస్తానని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దీంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేయడం మొదలు పెడతాడు . 
  • కొద్దిసేపటికి ఇక లే నాయనా అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్లు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యానాంజనేయస్వామి విగ్రహం అతనికి కనపడుతుంది . 
  •  దీంతో పరమానందభరితుడైన రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి అనంతరం  తిరిగి కోటకు చేరుకుంటాడు . ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు.
  •  స్వామి ఆదేశం ప్రకారం ఆలయాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని  కాకతీయ రాజులందరూ ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు.
  • అయితే 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొగల్‌ పాలకుడు ఔరంగజేబ్‌ స్వాధీనం చేసుకున్నాడు. 
  • అతని సైన్యంలోని కొందరు ధ్యానాంజనేయస్వామి ఆలయం వద్దకు చేరుకొని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు దాంతో ఆ స్వామి  దివ్యశక్తితో వారు విజయం సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఔరంగజేబ్‌ స్వయంగా దాడికి దిగాడు. 
  • ఔరంగజేబ్‌  ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో ‘మందిర్‌ తోడ్‌నా హైతో పహలె తుమ్‌ కరో మన్‌ఘట్‌’(ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనస్సును గట్టిగా చేసుకో) అని పలికింది. దీంతో ఔరంగజేబ్‌ తనకు కనపడమని కోరగా తాటిచెట్టు కంటే ఎత్తైన రూపం అతడికి  కనిపించడంతో అతను భీతిల్లి వెనుదిరిగాడు. అప్పటినుంచి  కరో మన్‌ఘట్‌ అన్న పేరే కర్మన్‌ఘాట్‌గా మారింది.
  • కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి వారి ఆలయంలో నిత్యపూజలు జరుగుతూనే ఉంటాయి .రోజూ వందలాది మంది భక్తులు స్వామి వారి దర్శనం కోసం వస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పలు ఉపాలయాలను ఉంటాయి . 
  • ప్రశాంతమైన వాతావరణంలో వుండే ఆలయంలో స్వామివారి మూలవిరాట్‌ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసిన మోటార్‌ వాహనాలకు ఇక్కడ పూజచేయించడం సంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు శకట పూజ జరుగుతుంది.
  • హైదరాబాద్‌ నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఈ  ఆలయం వుంది.  దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌ల నుంచి చేరుకోవచ్చు. హైదరాబాద్ వెళ్తే, మహిమ గల కర్మన్ ఘాట్ ఆంజనేయుని దర్శనం చేసుకోండి .
 జీవితం లో  కొన్ని సంకేతాలు మన జీవితాన్ని మార్చేస్తాయి. ఉన్నట్టుండి అదృష్టం  వరించి ధనవంతుల్ని చేసేస్తాయి.. లేదా కష్టాల్లోకి నెట్టేస్తాయి. అయితే అన్ని సంకేతాలు అదృష్టం తెచ్చిపెట్టవు. సాధారణంగా కొంతమందికే అదృష్టం పైన నమ్మకం ఉంటుంది. మరి కొంతమంది కి వాళ్ళ కష్టం పైన ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రమే ఆశిస్తారు..

ఆవు...
మీ వాకిట్లో  లో ఆవు గడ్డి తింటూ ఉంటే అది మీ అదృష్టానికి  సంకేతంగా భావించాలట.

కలలో గోల్డెన్ స్నేక్...
తెలుపు - గోల్డ్ కలర్ పాముని కలలో చూశారంటే ఇక మీ దశ తిరిగినట్టే. ఇలా కనిపిస్తే, త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని, ధనం మీ దగ్గరకు వస్తోందని సంకేతం గా భావించాలట.

గ్రీనరీ...
మీరు మీ కలలో గ్రీనరీతో పాటు నీటిని చూశారంటే.. త్వరలోనే ఊహించని విధంగా డబ్బు మీ సొంతమవుతుందని అర్థమట.

శంఖం శబ్ధం, గుడి గంటలు...
శంఖం శబ్ధం, గుడి గంటలు, ఇంకా  వినసొంపైన భజనల శబ్ధంతో నిద్రలేచారంటే .. అదృష్టంతో పాటు, ధనం మిమ్మల్ని వరిస్తుందని సంకేతంగా భావించాలట.

చెరకు గడలు..
మార్నింగ్ వాక్ సమయంలో -  ఏదైనా ముఖ్యమైన పనికోసం బయలుదేరినప్పుడు చెరకు గడలు కనిపిస్తే, త్వరలోనే.. మీరు ధనం పొందుతారని సంకేతంగా భావించాలట.

గబ్బిలాలు...
సాధారణంగా.. ఇండియన్స్ గబ్బిలాలకు దూరంగా ఉంటారు. కానీ.. చైనీస్ మాత్రం గబ్బిలాలను శ్రేయస్సుగా భావిస్తారు. అవి ఇంట్లోకి అనుకోకుండా వచ్చాయంటే.. దురదృష్టంగా భావిస్తారు.అయితే .. అవి ఇంట్లో గూడు ఏర్పాటు చేశాయంటే.. త్వరలోనే సంపద వస్తుందని  సంకేతమట.

బర్డ్...
మనం బయటకు వెళ్లినప్పుడు సడెన్ గా పక్షి రెట్ట వేస్తే.. చాలా అసహ్యించుకుంటాం. కానీ.. అది అదృష్టానికి సంకేతంగా భావించాలట. ఎందుకంటే.. అందరిపైనా పక్షి రెట్ట వేయదు.. ఎవరైతే.. చాలా అదృష్టవంతులయి ఉంటారో.. వాళ్లపైనే వేస్తాదట

ఉల్క..
ఉల్కని మీరు ఎప్పుడైనా చూశారా ? ఒకవేళ ఈసారి ఎప్పుడైనా చూస్తే.. వెంటనే.. ఏదైనా కోరుకోండి. ఖచ్చితంగా 30 రోజుల్లో మీ కోరిక నెరవేరుతుందట..

బట్టలు రివర్స్ లో వేసుకోవడం...
కొన్ని సందర్భాల్లో హడావుడిగా బట్టలు వేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు కొన్ని సార్లు.. రివర్స్ లో లోపలిది పైకి, పైది లోపలికి వేసుకుంటాం. అలా జరిగినప్పుడు చాలా గిల్టీగా ఫీలవుతాం. కానీ.. ఇలా జరిగితే.. అది చాలా అదృష్టం, సంపదకు సంకేతమట.

కుక్కలు:
కుక్కలు మీ ఇంటి దగ్గరకు వచ్చి.. స్తావరం కోసం వెతుకుతున్నాయి అంటే.. సంతోషం, అదృష్టానికి సంకేతం. కుక్కలు మీ జీవితంలో ఆనందానికి సూచన.

కప్పలు...
వర్షం పడిన తర్వాత కప్పలు ఇంట్లోకి వస్తున్నాయంటే.. వాటిని బయటకు తరిమేయకండి. ఇవి.. ఏదో మంచి, అదృష్టం జరగబోతుందని సూచనగా భావించాలట.

 ఇలాంటివి నమ్మడానికి చాలా వింతగా ఉన్నా.... కొంతమంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు..
బారత దేశంలో ఏమూల చూసినా ఏదో గుడి కచ్చితంగా ఉంటుంది. కొన్ని విగ్రహాలు అయితే వింతగా కూడా వుంటాయి. విగ్రహం ఎవరిదా అని ఎన్నో సందేహాలు రేకెత్తుతాయి. అయితే మన దేశం లో ఇలాంటి వింతదేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా...? మరింకెందుకు ఆలస్యం ...

విస్కీదేవి

ఇది ఒక కల్‌ భైరవుని దేవాలయం ఉజ్జయినీ లో ఈ దేవాలయం విచిత్రమైన ఆనావాయితీలతో ఉండడం చేత వింత వార్తలోకి చేరింది. మద్యం సీసాలను మోసుకు వెళుతున్న భక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది?చూసారా మీరు కళ్ళెర్ర చేసారు. నిజానికి ఈ కల్‌భైరవుని ఆలయానికి భక్తులు తండోపతండాలుగా మందు సీసాలను తీసుకువచ్చి వారి కోరికలను నెరవేర్చమని ఆ దేవతని కోరుకుంటారట.ఈ దేవత ప్రధాన సమర్పణ మద్యం అంట.ఇదే
భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. పురాణాల ప్రకారం మన హిందూ సంప్రదాయాలలో దేవుడికి నైవేద్యం పెట్టి కోరుకలు కోరుకుంటారు. ఇది ఆచారం అదే విదంగా ఇక్కడ మద్యం నైవేద్యంగా పెడతారట. ఉజ్జయిని లో దేవాలయం బయట పూజ బుట్టలను ఒకటి 40 రూ.లకి అమ్ముతూ ..వెళ్ళే భక్తులను ఆపుతూ కొనమని అడుగుతూ వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఆ పూజ బుట్టలో కొబ్బరి కాయలు,పువ్వులు,140 మిల్లీలీటర్లు లిక్కర్‌ సీసాలు కలిగి వుంటాయి.

బుల్లెట్‌ బాబా ఆలయం 

రాజస్థాన్‌లోని జోద్ఫూర్‌ సమీపంలో బుల్లెట్‌బాబా అనే ఆలయం ఉంది.ఈ ఆలయం ఓం బన్నా అనే వ్యక్తికి అంకితం చేసారు. అతను 20 సంవత్సరాల క్రితం బుల్లెట్‌ నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. దాంతో ఆ ఆలయానికి బుల్లెట్‌ బాబా అని పేరువచ్చింది. ఆ బైక్‌ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వాళ్ళు స్వాదీనం
పరుచుకున్నారు. కాని విచిత్రంగా ఆ బైక్‌ పోలీసు స్టేషన్‌ నుండి అదృశ్యమయి వేరొక స్థలంలో ప్రత్యక్షమయ్యింది. మళ్ళీ అదుపు లోకి తీసుకున్నా అదే పరిస్థితి ఎదురయ్యింది పోలీసులకి .దాంతో ఈ వార్త ఆనోట ఆనోట చేరింది. ఇది వింత కావడంతో అక్కడ బుల్లెట్‌బాబా ఆలయాన్ని నిర్మించారు. పాలీ-జోద్ఫూర్‌ రహదారి మీదుగ ప్రయాణించే వారు ఆ బుల్లెట్‌ బాబా ఆలయం దగ్గర ఆగకుండా వెళితే తమ గమ్యాన్ని శరీరం ముక్కలు ముక్కలై చేరుకుంటారని అక్కడి భక్తుల అభిప్రాయం.

ఎలుకల దేవాలయం 

ఇది రాజస్థాన్‌ లో కర్నిమాత దేవాలయం. ఈ దేవాలయంలో ఎలుకలు పొంచి ఉంటాయి. కాని అవి ఏమి చెయ్యవు ఎందుకంటే అది కర్నిమాత దేవాలయం కావడం చేత అంటున్నారు అక్కడి భక్తులు. ఈ ఎలుకలు భక్తులకు ఇబ్బంది కలిగించవని వారి అభిప్రాయం. ఒక వేళ మీరు అక్కడి ఎలుకని చంపితే దాన్నిమీరు ఒక
బంగారు ఎలుకని ఇచ్చి భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలుపు, నలుపు మరియు గోదుమరంగు ఎలుకలు ఆ గుడిలో ఎప్పుడు కనిపిస్తుంటాయి. కాని తెలుపు రంగు ఎలుక కనిపిస్తే మంచిదని భక్తుల నమ్మకం.

సోనియా గాంధీ ఆలయం

కాంగ్రెస్‌ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షురాలైన సోనియా గాంధీ దేవాలయాన్ని నిర్మించారట .ఈ దేవాలయం తెలంగాణాలో సోనియా తెల్లని పాలరాతి విగ్రహం మరియు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ చిత్రాలు బయట గోడలమీద ఉంటాయట.

వీసాబాబా

వీసా రాలేదని బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బాబా గురించి తెలుసుకోవాల్సిందే జలందర్‌ సమీపంలో షాషిద్‌ బాబా నిహాల్‌ సింగ్‌ అని ఒక బాబా ఉన్నారు. ఎవరైతే వీసా రాలేదని బాధపడుతుంటారో వారు ఈయనను కలిసి ఈ యనకు ఒక బొమ్మ విమానం ఇస్తేచాలు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అని భక్తుల నమ్మకం.

మోడీ ఆలయం

ప్రధాని నరేంద్రమోడీ ఆలయం గుజరాత్‌ లో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇక్కడి ప్రజలు ఉదయం,సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.
నవ గ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు అని అందరికీ తెలుసు. అయితే మనం పుస్తకాలలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు 9 అని దానిలో ప్లూటో అనే గ్రహం తొలగించబడింది అని చదువుకున్నాం. అయితే భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో జీవితాలపైనా, ప్రభావం చూపే గ్రహాలకు, ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంచెం తేడా ఉంది. సూర్య చంద్రులను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పిలవబడతారు. ఇంకా యురేనస్‌ నెప్ట్యూన్‌లు ఈ లెక్కలోకి రావు. కాని రాహు, కేతువులు రెండు గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే హిందూ సంప్రదాలలో నవగ్రహాలను పూజించడం వలన అదృష్టం వరిస్తుందని చాలా మంది నమ్ముతారు. నవగ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు చేయడం వల్ల మంచి జరిగి అదృష్టం వరిస్తుందని హిందువుల గట్టి నమ్మకం. నవగ్రహాలను వారు ఇష్టపడే ఆహారంతో పూజిస్తే వారి ఆశీస్సులు పొందుతారు. అయితే కొంత మంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రీతికరమైన ఆహారం కూడా ఉంది అని వారు అంటున్నారు. మరి మీరు కూడా నవగ్రహాలకు ఇష్టమైన ఆహారాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుని వాటితో పూజించి ఆశీస్సులు పొందండి.

రవి (సూర్యుడు)

ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అగ్నికి గుర్తు. సూర్యభగవానుడు ఎరుపు రంగుని ఇష్టపడతాడట. అందుకే బెల్లం, ఎరుపు పప్పులు, కేసరి, కుంకుమ పువ్వు, గోధుమలు, ఎరుపు పండ్లుతో పూజించి  సూర్య భగవానుడిని శాంతింపజేస్తే దీర్ఘాయువును ప్రసాదిస్తాడట.

మూన్‌ (చంద్రుడు)

సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు. చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి అతనికి బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, ఉప్పు, చక్కెర, జీడిపప్పు మరియు ముల్లంగి వంటి పదార్ధాలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం .

మార్స్‌ (అంగారకుడు)

మార్స్‌ గ్రహానికి అధిపతి హనుమంతుడు. ఇతడికి ఇష్టమైన రోజు మంగళవారం. హనుమాన్‌కి ఇష్టమైన ఆహారాలు ఎర్రని పప్పుదినుసులు, పళ్ళు, బెల్లం, దానిమ్మపండ్లు. ఇలా ఎర్రని పళ్ళుతో పూజించడం వల్ల తలనొప్పి, రక్తసంబంధిత సమస్యలు నయమవుతాయట.

మెర్క్యురీ (బుధుడు)

బుధుడుకి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమట. ఇతడికి ప్రీతికరమైన రోజు బుధవారం. పెసరపప్పు, గుమ్మడికాయ, ఆకుపచ్చ పండ్లు, ఇటువంటి ఆహార పదార్ధాలతో పూజించడం వలన మానసిక రుగ్మతలు నయం అవుతాయని హిందువుల నమ్మకం.

బృహస్పతి (గురుడు)

గురువారం నాడు పసుసు రంగు కలిగిన వాటితో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. లడ్డు, శనగపప్పు, బెల్లం వంటి వాటితో పూజిస్తే మూత్రపిండ వ్యాదులు దూరం అవుతాయట. అలాగే వ్యాధి రహిత జీవితం లభిస్తుందని అంటుంటారు.

వీనస్‌ (శుక్రుడు)

శుక్రాచార్యుడు బియ్యం, చక్కెర, సెమోలినా వంటి తెల్లని రంగు కలిగిన వాటిని ఇష్టపడతాడట. ఇలా శుక్రాచార్యుడికి ఇష్టమైన వాటితో పూజించడం వలన భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడట.

సాటర్న్‌ (శని)

శని భగవానుడికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల పువ్వులు, నలుపు పండ్లు మొదలగు వాటితో పూజించడం వల్ల మీ శత్రువులు నాశనం అవుతారు. అలాగే మానసిక రుగ్మతలు  తొలగిపోతాయి.

రాహు - కేతు

రాహు - కేతువులు చాయాగ్రహాలు, వీరికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, నల్లని స్వీట్లు మొదలగు వాటితో వీరిని పూజించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు.
కొంతమంది ఎప్పుడూ చురుకుగా చలాకీ గా ఉంటారు. మరికొంతమంది మోడీ గా ఉంటారు. అయితే ఇలాంటి మనస్తత్వం రావడానికి గల కారణం మనం పుట్టిన తేదీ, సమయం, నెల అని కొంతమంది సర్వేలో తేల్చి చెప్పారు. అయితే ఇది 100 శాతం కరెక్ట్‌ అని చెప్పలేం, కానీ 90 శాతం ఇలానే ప్రవర్తిస్తారని సర్వేలో తేలింది. ఒకసారి మీరు పుట్టిన నెల బట్టి మీ మనస్తత్వం ఇదేనో కాదో సరదాగా చూసుకోండి.



జనవరి

జనవరి  నెలలో పుట్టిన వారికి సాధించాలన్న పట్టుదల ఎక్కువ. కలల్ని సాకారం చేసుకుంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ నెగ్గగలరు, తగ్గగలరు. ఒక్కోసారి వీరు చాలా మొండిగా ప్రవర్తిస్తారు.

ఫిబ్రవరి 

ఫిబ్రవరి లో పుట్టిన వారికి కోపం చాలా ఎక్కువట . ఆ కోపాన్ని ఎదుటి వారి పై రుద్దుతారు. ప్రతీ చిన్న విషయానికి త్వరగా బాధ పడతారు.

మార్చి 

మార్చి లో పుట్టిన వారు ఎక్కువగా భావోద్వేగాలకి గురౌతారు. ఆ ఆలోచనలే ఎదుటివారి ఆలోచనలకు దారి తీస్తాయి.

ఏప్రిల్

ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ఎదుటి వ్యక్తులని నమ్ముతారు. బాగా సున్నితమైన మనసు కలిగిన వారు. ఎదుటివారితో కలిసి పని చెయ్యడానికి ఇష్ట పడతారు.

మే

మే నెలలో పుట్టిన వారు అందరి పై ఒకే రకం ప్రేమని కురిపిస్తారు. త్వరగా ఆకర్షితులౌతారు. అందరిని నమ్మేస్తారు.

జూన్

జూన్  నెలలో పుట్టిన వారు ఆకర్షణీయమైన మనుషులకి ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతారు. స్నేహితులతో ఎక్కువగా ఆకతాయిగా గడుపుతారు. కొత్త వ్యక్తులతో స్నేహం చెయ్యడానికి ఇష్ట పడతారు.

జులై

ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా కీర్తిని కోరుకుంటారు. అహంకారంతో ఉండడం, తొందరగా బాధ పడడం వీరి మనస్తత్వం. కానీ నచ్చితే దాని కోసం ఎంత దూరం ఐన వెళ్తారు.

ఆగష్టు


ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా సరదాగా ఉండటానికి ఇష్ట పడతారు. ఎదుట వారి రహస్యాలు తెలుసుకోవడం, పగటి కలలు కనడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక అనుమానంతో ఉంటారు, తొందరగా బాధ పడతారు.

సెప్టెంబర్‌

సెప్టెంబర్‌ నెలలో పుట్టిన వారు చాలా తెలివిగా ఉంటారు. భయమంటే వీరికి తెలీదు. వీరు ప్రేమించిన వారిని చాలా జాగ్రత్తగా మరియు ప్రేమగా చూసుకుంటారు. చాలా సౌమ్యం గా మాట్లాడుతారు.

అక్టోబర్‌

ఈ నెలలో పుట్టిన వారు ఎక్కువగా మాట్లాడానికి ఇష్టపడతారట. వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. ఎక్కువగా అబద్ధాలు చెపుతారట  కానీ నటించరు. స్నేహితులతో గొడవ పడినా మళ్లీ కలిసిపోతారట.

నవంబర్

ఈ నెలలో పుట్టిన వారు ఇతరులతో ఇట్టే కలిసిపోతారు. అయితే వీరి రహస్యాలు వేరే వాళ్లతో పంచుకోరు. అయితే వీరు బాగా నమ్మకంగా ఉంటారు. ఏదైనా చెయ్యాలి అని ఒకసారి అనుకుంటే దాని గురించే ఆలోచిస్తారు.

డిసెంబర్

డిసెంబర్ లో పుట్టిన వారు చూడటానికి అందంగా ఉంటారు. ఆత్మ విశ్వాసం ఎక్కువ. మంచి మనసు కలవారు. ఏ విషయంలోనైనా పోటీ పడటానికి ఇష్ట పడతారు. వీరిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ చిన్నచిన్న వాటికి మనస్తాపం చెందుతారు.
 మనిషికి ఎన్నో కోర్కెలు... అన్ని నెరవేరితే బాగుండు అనే అందరూ కోరుకుంటారు. కానీ అదృష్టం కొందరినే వరిస్తుంది. కేవలం కొందరికి మాత్రమే అనుకున్నవి నెరవేరుతాయి. కొందరికి ఏది అనుకున్న నిరాశే ఎదురవుతుంది.. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే అంత పాజిటివ్ గా జరగాలి అనుకుంటే `పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా ఉండాలి. ముఖ్యంగా మీ ఇంట్లో, ఇంటి పరిసరాల్లో పాజిటివ్ ఎనర్జీ లేకపోతే ఏ వ్యక్తి అయినా ఏం చేసినా కలసి రాదట. మరి ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఎం చేయాలి అనే కదా మీ ప్రశ్న ??  అందుకే మీ కోసం....

  • పగిలిపోయిన.దేవుళ్లు, దేవతల విగ్రహాలు ఇంట్లో ఉండకూడదట. అలా ఉంటే మనకు మంచి జరగదట. కనుక వాటిని వెంటనే తీసేయడం మంచిదని అంటున్నారు.
  • విరిగిన ఇంటి తలుపులు, పెయింట్ ఊడిపోయిన తలుపులు, గోడలు వంటివి ఉండడం మంచిది కాదట. అలా ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహించదట. అందుకే వెంటనే ఆయా రిపేర్లు చేయించుకోవాలట.
  • మీ ఇంట్లో పనిచేయని పాత గడియాలు ..గోడకు పెట్టేవి, చేతికి పెట్టుకునేవి ఏవైనా సరే ఉన్నాయా..? పగిలిపోయిన వాచ్లు కూడా ఉన్నాయా..? అయితే వెంటనే వాటిని తీసేయండి ఎందుకంటే అవి ఇంట్లో ఉంటే వాస్తు దోషం కలుగుతుందట. అంతా నెగెటివ్ ఎనర్జీయే నిండిపోతుందట. కనుక వెంటనే వాటిని తీసేస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.
  • ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా డ్యామేజ్ అయి ఉండకూడదట. ఫర్నిచర్ అంతా మంచిగా ఉంటేనే అలాంటి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో ఉండే వారి మధ్య బంధం మరింత బలపడుతుందట.
  • పగిలిపోయిన పింగాణీ, గాజు వస్తువులు కూడా ఇంట్లో ఉండకూడదట. దాంతో నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. అది మనకు అస్సలు మంచిది కాదట.పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉంచకూడదట. వాటితో ప్రతికూల శక్తులు ఇండ్లలోకి వస్తాయట. కనుక అలాంటి అద్దాలను కూడా ఇండ్లలో అస్సలు ఉంచుకోకూడదు.
  • పనిచేయని ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువులను కూడా ఇండ్లలో పెట్టుకోకూడదట. వాటితో నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తిస్తుందట.
  • ఇంక్ అయిపోయిన పెన్నులు, వాటి రీఫిల్స్, రాసి అరిగిపోయిన పెన్సిల్స్, షార్పెనర్స్, ఎరేజర్స్ వంటివి ఇంట్లో ఉంచుకోకూడదట. వాటివల్ల కూడా మనకు అస్సలు మంచి జరగదట. వాటిని వెంటనే తీసేయాలట.
  •  గోడలకు పెట్టే ఫొటో ఫ్రేంలు కూడా పగిలినవి ఉంచకూడదట. వాటివల్ల ఇంట్లో అంతా నెగెటివ్ ఎనర్జీయే ఉంటుందట.
ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన తీరు, సమాజంలో మన నడక… వంటి అనేక అంశాలలో చాణక్యుడు మనకు అనేక నీతి బోధలు తెలియజేసారు. అయితే చాణక్యుడు అవే కాకుండా, స్త్రీల గురించి కూడా పలు విషయాలు మనకు తెలియజేశారు . అవేమిటో ఇప్పుడు చూద్దాం...


1. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి రెండు రెట్లు అధికం, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరు రెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉంటుందట.

2. ఏ విషయంలోనైనా స్త్రీ భర్త అనుమతి తీసుకోవాలట. అలా తీసుకోకపోతే ఆ భర్త ఆయుష్షు తగ్గుతుందట. అంతే కాదు, అలాంటి భర్త కన్నా భార్యే ముందు చనిపోయి నరకంలో బాధలు అనుభవిస్తుందట.

3. అబద్దాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం వంటి అంశాలు స్త్రీలలో ప్రధానంగా ఉంటాయట. వీటి వల్ల చాలా మంది స్త్రీలు జీవితంలో ముందు రాకుండా అలాగే ఉండిపోతారట. అందుకే వారికి ఇవే బద్ద శత్రువులట.

4. పురుషుడి శరీరంలో ఉన్న బలాన్ని, శక్తిని స్త్రీ ఒక్క దెబ్బకే లాగేయగలదట. మళ్లీ ఆ బలం, శక్తి పాలు తాగితేనే వస్తాయట.

5. అగ్ని, నీరు, స్త్రీ, మూర్ఖుడు, పాము, బడాబాబులు వీరి నుంచి చాలా దూరంగా ఉండాలట. లేదంటే ప్రమాదని చాణక్యుడు చెప్పాడు.

6. యువతి ఎంత అంద విహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చట. కానీ ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కాకపోతే అలాంటి యువతిని పెళ్లాడకూడదట.

7. ఆచరణలో పెట్టకపోవడం వల్ల వ్యక్తి జ్ఞానం నశిస్తుందట. పురుషుడు తన నిర్లక్ష్యం కారణంగా అన్నీ కోల్పోతాడట. ఓ కమాండర్ లేని కారణంగా సైనికులు పరాజయం పాలవుతారట. అదేవిధంగా భర్త లేని కారణంగా స్త్రీ నాశనమవుతుందట.

8. రాజు, మత గురువు, స్త్రీ వీరితో అస్సలు చనువుగా ఉండరాదట. అలా ఉంటే ఎప్పటికైనా ప్రమాదమేనట.

9. మర్యాద ఇచ్చిపుచ్చుకోవడం అనేది రాజకుటుంబీకుల నుంచి, సంభాషణ ఎలా చేయాలనే దాన్ని పండితుల నుంచి, అబద్దాలు ఎలా ఆడాలనే విషయం జూదగాళ్ల నుంచి నేర్చుకోవాలట. అదేవిధంగా స్త్రీల నుంచి కపటం, వంచన ఎలా చేయాలో నేర్చుకోవాలట.

10. . స్త్రీ మనస్సును అస్సలు అర్థం చేసుకోలేమట. వారిలో కొందరు ఒక మగాడితో మాట్లాడుతూ, మనస్సులో మరొకరిని ఊహించుకుంటూ, వేరొకరు వెళ్తుంటే వారి వైపు చూస్తారట. అలాగే ఎవరైతే పురుషులు తమను ఫలానా స్త్రీ బాగా ప్రేమిస్తుంది అని అనుకుంటారో వారు ఆ స్త్రీలకు బానిసలవుతారట.

11. ఇత్తడి పాత్రలను బూడిదతో, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలతో ఎలా శుభ్రం చేయవచ్చో అలాగే రుతుక్రమం అనేది స్త్రీలను శుభ్రం చేస్తుందట.
ప్రతి వ్యక్తి కలలు కనడం సహజం. అయితే కొన్ని కలలు భయంకరం గా వచ్చి ఆందోళనకు గురిచేస్తాయి. వాస్తవానికి ఈ భూమి మీద ప్రతి వ్యక్తి తొంభై నిముషాల నుండి రెండు గంటల వరకు ప్రతి రాత్రి కలలో జీవిస్తుంటా ఉంటాడట.. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితుడు తిరిగి కలుసుకున్నట్లుగా, ఒక పార్క్ లోనో బీచ్ లోనో ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా, లాటరీలో జాక్ పాట్ కొట్టినట్లుగా, ధనవంతులు అయిపోయినట్లు, విదేశాలకు ప్రయాణం చేసినట్లు, ఎక్సమ్ హాల్ కి లేట్  గా వెళ్లినట్లు, బస్సు మిస్ అయినట్లు ... ఇలా కలలు వివిధ రకాలుగా వస్తుంటాయి. అలా అని రాత్రుల్లో వచ్చే ప్రతీ కల ఉదయం నిద్రలేచే సరికి గుర్తుండదు . కొందరికి మాత్రమే ఎంతో కొంత గుర్తున్నట్లు చెబుతుంటారు. అయితే మనకు వచ్చే కలలు కొన్ని మంచిని సూచిస్తే... మరికొన్ని చెడును సూచిస్తాయి.  ప్రతీ కలకు ఒక మీనింగ్ ఉంటుందట. కొంతమంది కి జంతువులు కలలో కనపడుతుంటాయి. కలలో కనిపించే జంతవులు ఏం సూచిస్తాయో  తెలుసుకుందాం..



జింక
ఇది కలలో కనిపిస్తే, ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం. అనుకోకుండా ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుందట. కలలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉందట.

పిల్లి
కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు. అయితే, పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది సృజనాత్మకతకు, శక్తికి చిహ్నమని భావిస్తారు. మీ కలలో తెల్లపిల్లిని చూస్తే కష్టాలు రాబోతున్నాయని, నల్లపిల్లిని చూస్తే మీరు మీ మానసికసామర్ధ్యాలు ఉపయోగించటానికి భయపడుతున్నారని అర్ధం. పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే మీరు ఎప్పుడూ ఎదుటివారినుండి తీసుకునేవారుగానే ఉంటున్నారు కానీ ఇవ్వటానికి ఇష్టపడరని అర్ధం. అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరగనప్పుడు భయం - నిరాశలకు గురి అవ్వటానికి ఇది సూచన అంటున్నారు. అయితే, మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే, మీ అడ్డంకులను అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నానికి సూచనగా భావించాలట.

ఆవు
మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియా స్వభావాన్ని సూచిస్తుంది. బక్కచిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజజీవితంలో మీఅమ్మ మీఅవసరాలకు సరిగా స్పందించడం లేదని, ఆమె ప్రేమని మీరు కోరుకుంటున్నారని అర్ధం వస్తుందట.

ఎద్దు
మీకలలో ఎద్దును చూస్తే, విస్తారమైన సంపద రాబోతోందని అర్ధం. ఆబోతును చూస్తే మీ కోరికలు మీ నియంత్రణలో లేవని అర్ధం అని చెబుతారు.

పశువులు
పశువులు కలలో కనిపిస్తే మీరు ప్రస్తుతమున్న పరిస్థితితో లేదా బంధాలతో జాగ్రత్తగా ఉండాలని అర్ధం. కలలో పశువులమందలను చూడటం వ్యక్తిత్వం లేకపోవడానికి సూచన.

కుక్క
కలలో ఒక కుక్కను చూస్తే పట్టుదలతో మీప్రత్యర్థి మీద విజయాన్ని సాధిస్తారని అర్ధం. ఈ కల మీరు ద్వంద్వార్ధాలతో ఇతరులను తీవ్రంగా వేధించడానికి సూచన కావచ్చు. కుక్క కోపంగా కేకలు వేయటం మీలోపల ఉన్న అంతర్గత సంఘర్షణను సూచిస్తుంది. మరణించిన కుక్క ఒక మంచి స్నేహితుని మరణానికి సూచన. కుక్క మరణిస్తూ ఉంటే, మీలోని మంచి ప్రవృత్తులు క్షీణించిపోవటాన్ని సూచిస్తుంది. కాలు మీద కుక్క కరవటం మీ జీవితాన్ని సమతుల్యం చేసుకునే సామర్థ్యం కోల్పోవటాన్ని, ఒక కొత్తపరిస్థితిని సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవటాన్ని సూచిస్తుంది. సంతోషంగా మొరిగే కుక్క ఇతరులతో కలిగి ఉన్న చక్కటి సామాజిక సంబంధాలకు, భయంకరంగా మొరిగే కుక్క మీ చుట్టూ ఉన్నవాళ్ళతో సరి అయిన సంబంధాలు లేకపోవటానికి గుర్తు అని చెబుతారు. కుక్కను కొంటున్నట్లు కల వస్తే తోడు కోరుకుంటున్నారని, కుక్కకు కట్టు కడుతున్నట్లు కల వస్తే మీలోని లోపాలు, అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అర్ధం. చూసారా ఒక కుక్క చేసే పనుల వలన మనకు వచ్చే శుభాలు, అశుభాలు.

దూడ 
కలలో దూడ కనిపిస్తే అనుభవలేమికి సూచన. అంటే మీరు కొన్ని లక్షణాలు పెంపొందించుకుంటే కానీ జీవితంలో ఎదగలేరని అర్ధంగా భావించాలి.

ఒంటె 
మీ కలలో ఒంటెను చూశారంటే, మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని, మీ ఉద్వేగాలను వ్యక్తం చేసి, మీ బరువులు వదిలించుకోకుండా, వాటిని పట్టుకొని వేళ్ళాడతున్నారని అర్ధం. ఒక రకంగా మీరు ఎంత పెద్ద భారాన్ని అయినా మోయగలరని అర్ధం.

గాడిద
మీ కలలో ఒక గాడిదను చూస్తే అవగాహన లోపాన్ని సూచిస్తుంది. అంతే కాక, మీకు రాబోయే అనేక చికాకులకు ఇది గుర్తు. మీ కలలో భారం మోస్తున్న గాడిదను చూస్తే, చాలా సహనంతో కష్టపడిన తర్వాత, మీరు వ్యాపారంలో, ఇంకా ప్రేమలో విజయవంతమవుతారని అర్ధం. గాడిద మొండితనానికి, ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తు. గాడిద మీద నుండి పడిపోతే ప్రేమలో వైఫల్యాన్ని, గాడిద తన్నినట్లు కల వస్తే అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని, గాడిద మీద ఊరేగుతూ,వెనుక చాలామంది అనుసరిస్తుంటే, అందర్నీ ఒప్పింపచేయగల నాయకత్వ లక్షణాన్ని సూచిస్తుంది.

గబ్బిలం
కలలో గబ్బిలం కనిపించటం ఒక రకంగా దుశ్శకునమే. అది తెల్లగబ్బిలం అయితే కుటుంబసభ్యులలో ఒకరి మరణాన్ని, నల్లగబ్బిలం అయితే వ్యక్తిగత విపత్తుని సూచిస్తుంది. అదే పిశాచిలాంటి గబ్బిలం అయితే, మీ ఆత్మవిశ్వాసం - మీ వనరులన్నీ కోల్పోవటాన్ని సూచిస్తుంది. ఇంకో రకంగా చూస్తే, గబ్బిలాలు మీ పాత అలవాట్లను మానకపోతే మీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి ఉండదని సూచిస్తాయి.

మొసలి
మొసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతోందని అర్ధం. మీ దగ్గర వాళ్ళలో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు పురిగొల్పుతున్నారని అర్ధం. మొసలి మిమ్మల్ని వెంటాడి కరిస్తే, ప్రేమ, వ్యాపారాలలో పరాజయం పొందబోతున్నారని అర్ధం.

ఏనుగు
కలలో ఏనుగు కనిపిస్తే, మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో, సహనంతో ఉండాలని అర్ధం. ఏనుగు శక్తి, బలం, మరియు తెలివికి చిహ్నం. అంతేకాక, ఇది మీలోని అంతర్ముఖ వ్యక్తిత్వానికి సూచన కావచ్చు. ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కల వస్తే, మీరు ఒకప్పుడు భయపడిన, మీలోని దాగబడిన అంశాలు మీ నియంత్రణలో ఉన్నాయని అర్ధం.

మేక

మేక పరిస్థితులను సరిగా అంచనా వేయలేకపోవటాన్ని, అవివేకాన్ని సూచిస్తుంది. మేకపోతు కనిపిస్తే, మీ పోటీదారులు మీవ్యాపారాలను దెబ్బతీయాలని చూస్తున్నారని అర్ధం.

గుర్రం
గుర్రం బలమైన భౌతిక శక్తికి సూచన. నల్ల గుర్రం హింస - క్షుద్ర శక్తులకు, తెల్ల గుర్రం స్వచ్ఛత, శ్రేయస్సు, అదృష్టానికి సూచన. చనిపోయిన గుర్రం ఒకప్పుడు మీకు బలం కలిగించింది ఏదో మీ జీవితంలోనుండి పోయిందని, ఇప్పుడు లేదనే దానికి సూచన. అడవి గుర్రాలమంద బాధ్యతా రాహిత్యానికి గుర్తు. గుర్రం మీద స్వారీ చేస్తూ అది మీనియంత్రణలో ఉంటే, అక్రమ మార్గాల ద్వారా విజయం సాధించడానికి ప్రయత్నిస్తారని, నియంత్రణలోలేని గుర్రం మీద స్వారీ చేస్తూ ఉంటే, మీ కోరికలు మిమ్మల్ని స్థిమితంగా ఉండనీయవని అర్ధం.

పాము
ఎక్కువమందికి కలలో కనిపించే జంతువులలో పాము కూడా ఒకటి. కలలో పాము కాటు వేస్తే మీలో దాగబడ్డ భయాలు, ఆందోళనలు ఉన్నాయని, అవి మిమ్మల్ని బాగా భయపెడుతున్నాయని అర్ధం. ఇది మీరు నిజజీవితంలో ఎదుర్కోబోయే ప్రమాదానికి సూచన కావచ్చు. కలలో పాము తరుముతుంటే, మీరు వద్దనుకుంటున్న పరిస్థితిలోనే మీరు చిక్కుకోవాల్సి వస్తుందని అర్ధం.

పంది
పంది మురికి, అత్యాశ, స్వార్ధానికి గుర్తు. మీలో ఉన్న స్వార్ధాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ విజయావకాశాలు దరి చేరవని అర్ధం.

సింహం
సింహం బలానికి, దూకుడుకి, శక్తికి ప్రతీక. మీరు ఇతరులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నారని, ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించాలంటే దీనిని నియంత్రించవలసిన అవసరం ఉందని అర్ధం. సింహం మీపై దాడి చేసినట్లు కల వస్తే, మీరు ఎన్నో అడ్డంకులను అధిగమించవలసిన అవసరం ఉందని సూచిస్తుంది.

పులి
పులి శక్తికి, వివిధ పరిస్థితులను ఎదుర్కోవటానికి కావలసిన మీ సామర్థ్యానికి, నాయకత్వ లక్షణానికి సూచన. బోనులో ఉంచబడిన పులి అణచివేయ్యబడిన భావోద్వేగాలకు, దాడి చేస్తున్న పులి, ఆ భావోద్వేగాల వల్ల కలిగే భయానికి గుర్తు.

తాబేలు
తాబేలు మీరు జీవితంలో ముందుకు పోవడానికి అవకాశాలు వెతుక్కోవలసిన అవసరాన్ని సూచిస్తుంది. మీరు ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి, కానీ దాని కోసం సరైన అడుగు వేయాలని అర్ధం.

కుందేలు
కుందేలు అదృష్టానికి గుర్తు. మీ భవిష్యత్తు ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్ధం. తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచన. పచ్చిక బయళ్ళలో దూకుతూ, ఆడుకుంటున్న కుందేళ్ళు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని సూచిస్తాయి.
జ్యోతిషశాస్త్ర ప్రకారం, దవడ లేదా గడ్డంపై ఉండే పుట్టు మచ్చలు అందాన్ని పెంచటమే కాకుండా మన భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయట. పుట్టు మచ్చలు శరీరంపై ఏ భాగంలో అయిన కలగవచ్చు మరియు ప్రతి పుట్టుమచ్చ ఒక రహస్యాన్ని కలిగి ఉంటుందట.. ఇవి మన లక్ష్యం మరియు మన భవిష్యత్తు గురించి ఆధారాలను తెలుపుతాయట.. మీ జీవితం గురించి ఇవేం చెప్తాయో ఇపుడు తెలుసుకుందాం.




నుదుటి భాగం

నుదుటి కుడి భాగంలో పుట్టు మచ్చ ఉందా? అయితే మీరు సంపన్న వ్యక్తి అవుతారని సూచిస్తుంది. ఒకవేళ నుదుటి ఎడమ భాగంలో పుట్టుమచ్చ ఉంటే మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తాయి. ఒకవేళ నుదుటి మధ్య భాగంలో పుట్టు మచ్చ ఉంటే, సంపద ఉండదు కానీ కీర్తివంతులు అవుతారని సూచిక.

గడ్డంపై పుట్టుమచ్చ

జ్యోతిషశాస్త్ర ప్రకారం గడ్డంపై పుట్టుమచ్చ ప్రమాదానికి సూచిక. అనగా వివాహం అనంతరం మీ భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదురోవాల్సి వస్తుందని దీనికి అర్థం.

కంటిపై పుట్టుమచ్చ

కుడికన్నుపై పుట్టు మచ్చ ఉంటే, మీ తుది శ్వాస వరకు జీవిత భాగస్వామితో ప్రేమలో ఉంటారని అర్థం మరియు ఎడమ కన్ను పై భాగంలో ఉంటే లక్ష్య సాధన కోసం మీరు చాలా కష్టపడాలని అర్థం.

చెంపలపై పుట్టుమచ్చ

కుడి చెంపపై పుట్టుమచ్చ ఉంటే మీరు ఆరోగ్యవంతులని అర్థం, ఎడమ వైపు ఉంటే ధన నష్టం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అర్థం.

పెదాలపై పుట్టు పచ్చ

మీ పెదాలపై పుట్టుమచ్చ ఉంటే మీకు లైంగిక కోరికలు అధికమని అర్థం.

మెడపై పుట్టుమచ్చ

మెడ భాగంలో మచ్చ ఉంటే- సంపదతో కూడిన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అర్థం. అంతేకాకుండా, మీ జీవిత కాలం కూడా అధికంగా ఉంటుందని అర్ధమట.

ఒక్కొక్కరికి ఒక్కోరంగు నచ్చుతుంది. అయితే ఏ రోజు ఎలాంటి రంగు దుస్తులు ధరిస్తే మంచిదో, ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం.

సోమవారం అంటే చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున తెల్లని దుస్తులు వేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చట. అలాగే మిల్కీ వైట్ ఇంకా లేవెండర్ కలర్ దుస్తులు కూడా ధరించవచ్చు.

మంగళవారం అంటే హనుమంతునికి ప్రీతికరమయిన రోజు. అందువల్ల హనుమాన్ కి ఇష్టమైన రంగు కాషాయం. అందుకే కాషాయం రంగు ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారట. అదేవిధం గా ఎరుపు రంగు, ఇంకా నలుపు రంగు కూడా ధరించవచ్చు.

బుధవారం వినాయకుడుకి సంబంధించిన రోజు. ఆయనకు ఇష్టమైన రంగు ఆకుపచ్చరంగు బుధవారం విఘ్నేశ్వరునికి ఇష్టమైన పచ్చ రంగుని ధరించడం వల్ల ఎలాంటి విజ్ఞాలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగుతాయట. అలాగే పియర్ గ్రీన్ ఇంకా నీలం రంగు కూడా వేసుకోవచ్చు.


గురువారం పసుపు రంగుని ఇష్టపడే బృహస్పతికి సంబంధించిన వారం. కాబట్టి గురువారం నాడు పసుపు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే గోల్డ్ కలర్, ఆఫ్ వైట్  దుస్తులు ధరించవచ్చు.

శుక్రవారం అంటే అమ్మవారికి ఇష్టమైన రోజు. అమ్మవారి సర్యంతర్యామి. అందుకని శుక్రవారం నాడు అన్నిరంగులు కలిసి ఉన్న వస్త్రాన్ని ధరించడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. వైట్, లైట్ బ్లూ రంగులు ధరించవచ్చు

శనివారం అనగానే గుర్తొచ్చేది సనిదేవుడు. ఆయన ఆశీస్సులు మనకు లభించాలంటే నీలిరంగు కలిసిన వస్త్రాలను ధరించాలి. అలాగే మిడ్ నైట్  బ్లూ , డార్క్ బ్లూ దుస్తులు ధరించాలి. శనివారం నాడు ముదురు రంగుల దుస్తులు ధరించడం మంచిది.

ఆదివారం నాడు గులాబి రంగు దుస్తులు ధరించాలట. మెరూన్, బ్రౌన్ రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు.

జీవితంలో ప్రతిఒక్కరూ చూడవలసిన కొన్ని అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


1. క్రిమ్చి: క్రిమ్చి అనేది జమ్మూ కాశ్మీర్లో ఉధంపూర్ జిల్లాలో  చిన్న గ్రామం. ఇక్కడ బాగా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. ముఖ్యముగా పాండవ రాజులు కట్టించిన ఆలయాలు బాగా ప్రసిద్ధం. ఇంకా ఇక్కడ పంచెరి, హిల్ రిసార్ట్ కూడా మీరు చూడవచ్చు.

ఎలా వెళ్ళాలి: జమ్మూ తావి అనే ఊరు జమ్మూకి బాగా దగ్గరగా ఉంటుంది. అక్కడకి రైలులో వెల్లవచ్చు. జమ్మూ తావిలో దిగి అక్కడ నుండి ట్యాక్సీలో క్రిమ్చి చేరుకోవచ్చు.
వసతి స
దుపాయాలు: మీ అవసరాలు బట్టి మీ బడ్జెట్కి సరిపోయే వసతి గృహాలు, లగ్జరీ, ఐదు నక్షత్రాల వసతి గృహాలు అక్కడ ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలంలో ఇక్కడకి వెళ్ళవచ్చు. ఆ మాసంలో ఇక్కడ మంచు కురవడం కూడా మీరు చూడొచ్చు.

 2. కంగ్రా: హిమాచల్ ప్రదేశ్లో అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఈ కంగ్రా లోయ కూడా ఒకటి. పిరమిడ్ - మశ్రూర్ రాక్ కట్ ఆలయానికి కంగ్రా  నిలయం. వీటితో పాటు మీరు సందర్శించవల్సిన ప్రదేశాలు, కంగ్రా ఫోర్ట్, తరాగర్ః ప్యాలేస్, ఇంద్రహర్ పాస్ మరియు కారెరీ లేక్.

 ఎలా వెళ్ళాలి:
చండిగర్, జమ్మూ , అమృత్సర్ అనేవి కంగ్రా దగ్గరగా ఉన్న విమానాశ్రయాలు. వీటితో పాటు బస్ సదుపాయం కూడా ఉంది.

వసతి స
దుపాయాలు: ఇక్కడ అందమైన ప్రదేశాల్లో వసతి గృహాలు మరియు అతిధి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: మార్చ్ నుండి జూన్లో వెళ్ళడం ఈ సందర్శనకు సరైన సమయం.

 3. కజురాహో సమూహ కట్టడాలు: ఈ సమూహ కట్టడాలు మధ్యప్రదేశ్లో   ఛాతర్పూర్ జిల్లాలో ఉన్నాయి. ఈ సుందర సమూహ కట్టడాలు హిందూ మరియు జైన్ మతస్తులకు సంబంధించినవి. వీటిలో ప్రసిధ్ధమైన కామకేళి శిల్పాలు నగర తరహా నిర్మాణంలో చెక్కారు.

ఎలా వెళ్ళాలి: ఇక్కడకి వెళ్ళడానికి సరైన మార్గం విమానం మరియు బస్. కజురహో విమానాశ్రయమ్ కజురహో కట్టడాలకి సమీప మార్గం.

వసతి సదుపాయాలు: ఇక్కడ లగ్జరీ వసతి గృహాలు ఉంటాయి.  మధ్య ప్రదేశ్ పర్యాటక సంస్థ సామాన్యులకి అందుబాటు ధరల్లోనే ఇక్కడ హొటల్స్ నడుపుతోంది.
సందర్శనకు సరైన సమయం: ఇక్కడకి వెళ్లాల్సిన సరైన సమయం శీతాకాలం.

 4.  జగేశ్వర్: ఉత్తరాఖండ్లో అల్మోర్ జిల్లాలో ఈ జగేశ్వర్ అనే అందమైన యాత్రికా ప్రదేశం ఉంది. ఈ ప్రదేశంలో మొత్తం 124 చిన్న ఆలయాలు ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి:  ఇక్కడకి రోడ్, ట్యాక్సీ, మీ సొంత వాహనాల్లో వెళ్ళవచ్చు. జాగేశ్వర్ కి  సమీప రైల్వే స్టేషన్ అల్మోర్.
వసతి సధుపాయాలు: చాలా తక్కువ సదుపాయాలు ఉంటాయి. కాని మంచి సదుపాయాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం:  సంవత్సరంలో ఏ మాసంలోనైనా వెళ్ళవచ్చు.
 

5. అయోధ్య: అయోధ్య, దేవుడైన శ్రీరామచంద్రుని జన్మ స్థలము. ఇది ఉత్తర ప్రదేశ్ లో  ఉన్న ఫైజాబాద్ పక్క పట్టణంలో ఉంది. అయోధ్యకి చాలా గొప్ప చరిత్ర ఉంది, ఈ పట్టణంలో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్ళాలి: రైలు మరియు బస్ దీనికి ఉత్తమ మార్గం. దీనికి సమీప రైల్వే స్టేషన్ లక్నోలో ఉంది.
వసతి సధుపాయాలు: ఇక్కడ ఉండడానికి ధర్మశాలలు, వసతి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం:  ఇక్కడకి వెళ్ళడానికి సరైన సమయం శీతాకాలం.

 6. వారణాసి: వారణాసి పవిత్ర నది అయిన గంగా నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ లో  ఉంది. దీనిని బాగా పురాతన పట్టణము అని కూడా పిలుస్తారు. ఇది కనుమలుకు మాత్రమే ప్రసిద్ధము కాదు.  ఇక్కడ నివసించే రంగుల మరియు ప్రకాశవంతమైన జీవితాలు గడిపే మనుషులు కోసం కూడా.

ఎలా వెళ్ళాలి: రైలు, విమానము, రోడ్డు మీకు సదుపాయము బట్టి వెళ్ళవచ్చును.
వసతి సదుపాయాలు: అక్కడ కనుమలు చుట్టూ ఆశ్రమాలు నెలకొల్పినవి, మరియు లగ్జరీ వసతి గృహాలు, బస నివాసాలు అందుబాటులో ఉన్నవి.
సందర్శనకు సరైన సమయం: ఇది చూచుటకు శీతాకాలమే సరైన సమయం.


7. భీమేత్క రాతి ఆశ్రయాలు:
మానవ చరిత్రలో మరో పురావస్తు చోటైన భీమేత్క రాతి ఆశ్రయాలు మధ్య ప్రదేశ్ లో  రైసెన్ జిల్లాలో ఉంది. ఈ చోటు పూర్వ శిలాయుగం లో జీవించిన  వారిది.

ఎలా వెళ్ళాలి: అక్కడ రాజ భోజ్ అనే విమానాశ్రయము ఉంది అక్కడకి వెళ్లుటకు అదే సమీప విమానాశ్రయము. అక్కడ నుండి ట్యాక్సీలో చేరుకోవచ్చు. అక్కడకి వెళ్లుటకు సమీప రైల్వే స్టేషన్ భోపాల్లో ఉన్నది.
వసతి సదుపాయాలు: మీ ఖర్చుకి సరిపోయేటటువంటి స్నేహపూర్వక వసతి గృహాలు అక్కడ ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: ఇక్కడకి వెళ్లుటకు శీతాకాలమే సరైన సమయం.
 

8. కురుక్షేత్ర: ఇది హర్యానా రాష్ట్రంలో ఉన్నది. ఇది గొప్ప మత మరియు చారిత్రక ప్రదేశం . గీతలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి  గీత భోధించిన గొప్ప భూమి. ఇక్కడ చారిత్రక ప్రదేశాలైన బ్రహ్మ సరోవర్, శ్రీ కృష్ణ మ్యూజియం, భీష్మ ఖున్ద్ కూడా ఉన్నవి.

 ఎలా వెళ్ళాలి: సమీప విమానాశ్రయము డిల్లీలో ఉన్నది. ఇక్కడకి బస్ మరియు ట్యాక్సీ ల లో  కూడా చేరుకోవచ్చు. కురుక్షేత్రకి రైలు మార్గంలో కూడా చేరుకోవచ్చును.
వసతి సదుపాయాలు: అందుబాటు ధరలకే వసతి గృహాలు మరియు ధర్మశాలలు ఇక్కడ ఉన్నవి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం.


9. పానీపట్:
పానీపట్ కి  ఒక పురాణ చరిత్ర ఉంది . ఇది హర్యానాలో ఉన్నది. మహాభారత కాలంలో పాండవ సోదరులు దీన్ని కనుగొన్నారు . ప్రసిద్ధ యుధ్ధాలు జరిగిన ప్రదేశం గా ఇది పేరు గాంచింది . ఇంకా ఇక్కడ చూడటానికి పానీపట్ మ్యూజీయమ్, గ్రేవ్ ఆఫ్ ఇబ్రహీం లోధి, కబులి బాగ్ మరియు కల అంబ్ కూడా ఉన్నవి.

ఎలా వెళ్ళాలి: అక్కడకి బస్, రైలు మరియు విమాన మార్గంలో వెళ్ళవచ్చును.
వసతి సదుపాయాలు:  బాగా సంరక్షించిన వసతి గృహాలు మీ అందుబాటులో లభిస్తాయి.
సందర్శనకు సరైన సమయం: నవంబర్, డిసెంబర్ మరియు జనవరి.


10. గ్వాలియర్:
ఈ చారిత్రక కట్టడం మధ్య ప్రదేశ్లో ఉన్నది. భారత చరిత్రలో ముఖ్య ప్రదేశాలలో  గ్వాలియర్ ప్రదేశం తనదైన ముద్ర వేసుకున్నది. ఇంకా చూడాల్సినవి గ్వాలియర్ ఫోర్ట్, రాజా మాన్ సింగ్ టోమర్స్ ప్యాలేస్, స్సీన్డియా మ్యూజీయమ్ మరియు గోపాచల్ పర్వట్.

 ఎలా వెళ్ళాలి:  బస్ మరియు రైలు మార్గాలు సరైనవి.
వసతి సదుపాయాలు: చాలా లగ్జరీ వసతి గృహాలు మరియు మీ బడ్జెట్ వసతులు అక్కడ దొరుకుతాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం.


11. వృందావన్: వృందావన్ ఉత్తర ప్రదేశ్లో మధుర నగరిలో ఉన్నది. దీనిని కృష్ణ భూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడ దేవుళ్లైన రాధాకృష్ణ  ఆలయాలు చాలా నిర్మించారు. ఇవి  హిందువులకి పవిత్ర స్థలాలు.

ఎలా వెళ్ళాలి: బస్ మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు. ఇక్కడ సమీప రైల్వే స్టేషన్ మధురలో ఉన్నది.
వసతి సదుపాయాలు: ఇస్కాన్ ఆలయం వద్ద అతిధి గృహాలు, చుట్టూ వసతి గృహాలు ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: శీతాకాలం.


 12. కర్నల్:
మీరు మహాభారతము చదివినట్లైతే హర్యానాలో మీరు చూడవల్సిన మరో ప్రదేశం కర్నల్. దీనిని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఇంకా అక్కడ చూడవల్సిన ప్రదేశాలు కర్నల్ ఫోర్ట్, కర్నల్ లేక్, క్యాంటోన్మెంట్ చర్చ్ టవర్ మరియు  పుక్కా పుల్.

ఎలా వెళ్ళాలి: బస్ మరియు రైలు మార్గంలో వెళ్ళవచ్చు.
వసతి సదుపాయాలు: మీ బడ్జెట్లో వసతి గృహాలు మంచి సదుపాయం.
సందర్శనకు సరైన సమయం: అక్టోబర్ నుంచి మార్చ్ లో  ఎప్పుడైనా వెళ్ళవచ్చు.

13. అల్వార్: ఇది రాజస్థాన్లో ఉన్నది. ఇక్కడ కోటలు, అందమైన ప్రదేశాలు ఉన్నవి. దీనిని గంభీర పట్టణము అని కూడా పిలుస్తారు. అల్వార్లో భంగర్ ఫోర్ట్ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది.

ఎలా వెళ్ళాలి:  జైపూర్లో ఉన్న సమీప విమానాశ్రయము సంగానేర్ విమానాశ్రయము. ట్యాక్సీస్, రైలు మరియు రోడ్డు ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది.
వసతి సదుపాయాలు: అందమైన రాజభవనాలు వసతి గృహాలుగా మార్చబడినవి. అందుబాటులో వసతి గృహాలు మరియు లగ్జరీ వసతి గృహాలు కూడా ఉంటాయి.
సందర్శనకు సరైన సమయం: అక్టోబర్ నుండి మార్చ్ వరకు ఎప్పుడైనా వెళ్ళవచ్చును.
మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ జగన్నాథస్వామి క్షేత్రాలలో అగ్రగణ్యమైనదిగా పేరుగాంచిన క్షేత్రం పూరి. సనాతన సంప్రదాయాలకు ప్రాచీన సంస్కృతులకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు జగన్నాధ, బలభద్ర, సుభద్ర స్వామివారు కొలువై ఉన్నారు. ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలో ఉన్న పూరి శ్రీ జగన్నాథస్వామి వారి ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.


గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుంది

దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచింది పూరిజగన్నాథుని ఆలయం. ఈ ఆలయంపై జెండా ఎప్పుడూ గాలికి ఆపోజిట్ గానే ఎగురుతుందట.

చరిత్ర

ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఈ ఆలయం ఎప్పుడూ నిర్మితమైందో ఆధారాలు లేకపోయినప్పటికీ గంగదేవుడనే రాజు ఈ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో నిర్మించాడని శాసనాల ద్వారా అవగతమవుతుంది.

మీవైపే చూస్తున్నట్లు

ఈ ఆలయంపై ఉన్న సుదర్శన చక్రం మీరు పూరి పట్టణంలో ఎక్కడినుండి చూసినా మీవైపే చూస్తున్నట్లు ఉంటుంది.

లోపల 120 ఆలయాలు

ఈ ఆలయ సమూహం నాలుగులక్షల చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూ ఎత్తైన ప్రాకారం కలిగి ఉంటుంది. లోపల 120 వరకు ఆలయాలు ఉన్నాయి.

మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి

భారతదేశంలో 7 మోక్షదాయక క్షేత్రాల్లో పూరి ఒకటి. మాములుగా అయితే సముద్రం నుంచి భూమికి గాలి వస్తుంది సాయంకాలం దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ పూరిలో మాత్రం పూర్తి విరుద్దంగా ఉంటుందట.

ఆలయం మీద వెళ్ళవు

పక్షులు, విమానాలు ఆలయం మీద వెళ్ళవు.

నీడ ఏ సమయంలోనైనా కన్పించదు

ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉంది. గుమ్మానికి ఉండే కప్పు నీడ ఏ సమయంలోనైనా సరే ఏ దిశలోనూ అస్సలు కన్పించదు.

20 లక్షల మందికి పెట్టవచ్చు

పూరి జగన్నాథుని ఆలయంలో వండిన ప్రసాదం మొత్తం సంవత్సరం అంతా అలానే ఉంటుంది. దానిని సుమారు 20 లక్షల మందికి పెట్టవచ్చు. అయినా సరే ఆ ప్రసాదం వృధా అవ్వదు, తక్కువకూడా అవ్వదు.

ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది

పూరి జగన్నాథుని ఆలయంలోని వంటశాలలో చక్కల నిప్పుమీద 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరి ఒకటి పెట్టి వంట చేస్తారు. అయితే సాదారణంగా కింద ఉండే పాత్ర వేడవుతుంది. కాని విచిత్రంగా ఇక్కడ మాత్రం ముందుగా పైన ఉండే పాత్ర వేడి అవుతుంది ఆ తరువాత కింద పాత్ర వేడెక్కుతుంది.

సముద్రం శబ్ధం వినపడదట

ఆలయంలోని సింహ ద్వారంలోకి ఒక అడుగు వేస్తే సముద్రం శబ్ధం వినపడదట. అదే ఒక అడుగు వెనక్కివేస్తే శబ్ధం వినిపిస్తుందట.

దీపావళి అంటే చిన్నపిల్లలనుండి  పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన పండుగ. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటో వివరాల్లోకి వెళ్తే.. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటంటే...

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అని ఇంద్రుడు అంటాడు. దీనికి ఆ మాత.. త్రిలోకాథిపతీ, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని సమాధానమిచ్చింది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
భారతదేశం లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే  అంతు చిక్కని  ఎన్నో రహస్యాలు కూడా కలిగిన దేశం భారతదేశం. ఎన్నో వింతలు, విచిత్రాలు, ఊహకి అందని ఎన్నో కథనాలు. కంటికి కనిపించని రహస్యాలు ఎన్నో.... రాజభవనాలు, కోటలు, రాజులు, రాకుమారి, సంపదలు, యుద్ధాలు అంటూ ఇలా ఎన్నో చిక్కువిడవని కధలు ఉన్నాయి. ఈలోకం లో  ఆత్మలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు వస్తే చాలామంది లేవు అంతా భ్రమ అంటారు. కొందరయితే కచ్చితంగా ఉన్నాయి మేము కళ్ళరా చూసాం అని అంటుంటారు. ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. ఇలా కొన్ని మనదేశానికి సంభందించి ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయాయి. మనదేశంలో కొన్ని ఊహకందని కధనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలని ఉందా??అయితే ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి !!




టన్నెల్‌ నెం 33 : సిమ్లా

హిమాచల్‌ ప్రదేశ్‌లో బాగా ప్రసిద్ధి చెందిన అందమైన పట్టణం సిమ్లా. ఇంత అందమైన ప్రదేశంలో కూడా కొన్ని భయంకరమైన నీడలు వెంటాడుతున్నాయి. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. సిమ్లాలో టన్నెల్‌ నెం.33 లో ఒక దెయ్యం తిరుగుతుందని దానిపేరు కల్నల్‌ బరోగ్‌. ఇతడు బ్రిటిష్‌ రైల్వే ఇంజనీర్‌. ఇతడి ఆత్మ టన్నెల్‌ నెం.33 లో నివాసం ఉంటుందట. కాని అక్కడి ప్రజలు ఆ దెయ్యం స్నేహపూర్వకంగా ఉంటుందని ఎటువంటి హాని కలిగించదని చెప్పుకొచ్చారు. ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా దెయ్యం అంటే బయపడకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఆ టన్నెల్‌ సమీపంలో ప్రయాణికులు తలుచుకోని దేవుడుండడు.

జిపి బ్లాక్‌ : మీరట్‌

ఉత్తరప్రదేశ్‌ లో మీరట్‌ జిపి బ్లాక్‌ కూడా భయంకర ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ చాలా భయంకర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వింతవింత శబ్ధాలు, నవ్వులు వినపడుతుంటాయి. ఈ జిపి బ్లాక్‌లో కొంతమంది అబ్బాయిలు,అమ్మాయిల ఆత్మలు నివాసం ఉంటున్నట్లు అక్కడి ప్రజలు చెప్తున్నారు. కొంతమంది అబ్బాయిలు కొవ్వొత్తి కాంతిలో మందు తాగుతున్నట్లు, చిందులేస్తున్నట్లు అక్కడ చూసిన వారు తెలియజేసారు. చాలామంది ఈ ఆత్మలను చూసినట్లు ఎంతో భయబ్రాంతులకు గురయినట్లు ఈ విషయాలు చెప్పడం ద్వారా దెయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది.

డుమాస్‌ బీచ్‌ : గుజరాత్‌

గుజరాత్‌ లో అరేబియన్‌ సముద్రం వెంబడి భయానక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడ బీచ్‌ లో నలుపు రంగు ఇసుక ఉంటుంది. గుజరాత్‌ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మార్నింగ్‌ వాక్‌ చేసేవారు, పర్యాటకులు చాలా భయబ్రాంతులకు గురయ్యేవారట.ఈ బీచ్‌లో వింతవింత ఏడుపులు, మూలుగులు వినిపించేవంట. ఈ అందమైన బీచ్‌ వెనుక ఉన్న రహస్యాలను చేదించాలి అనుకునే వారు చాలామంది మాయమైపోయినట్లు అక్కడిప్రజలు చెప్తున్నారు. ఎంతో నిశబ్ధంగా ఉంటూ, అప్పుడప్పుడు అరుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయని మార్నింగ్‌ వాక్‌ చేసేవారు తెలిపారు.

అగ్రసేన్‌కి బావోలి : న్యూఢిల్లీ

ఇటువంటి అద్భుతమైన నిర్మాణం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిని 14వ శతాబ్ధంలో బావోలి అగ్రసేన్‌ నిర్మించాడు. ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోయి ఉంది. ఒకప్పుడు ఇది పూర్తిగా నల్లని నీటితో నిండి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అక్కడి నీరు హిప్నోటైజ్‌ చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అది మరణం సంభవించే వరకు వదిలి పెట్టదని వారి వాదన.

రామోజీఫిల్మ్‌ సిటీ : హైదరాబాద్‌

చిత్రాలను, సీరియల్స్‌, ప్రోగ్రామ్స్‌ మొదలగు వాటిని అద్భుతంగా చిత్రీకరించేందుకు ఎంచుకునే అద్భుతమైన ప్రదేశం రామోజీఫిల్మ్‌ సిటీ. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా పేరు పొందింది. ఇక్కడ ఎన్నో హోటళ్లు ఉన్నాయి. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపించే ఈ ఫిల్మ్‌సిటీ వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఫిల్మ్‌సిటీ నిర్మించిన ప్రాంతం ఒకప్పుడు యుద్ధపోరాటం లో క్రూరంగా చనిపోయిన, భూభాగంలో నిర్మించినట్లు చాలామంది అభిప్రాయం. వేలాది మంది ఇక్కడ చనిపోయినట్లు నమ్ముతున్నారు. చాలామంది సాక్షులు తెలియజేసింది ఏమిటంటే ఇక్కడ లైట్లు ఆరిపోతుంటాయని వాటికవే వెలుగుతుంటాయని,కాంతి ముందుకు వెనుకకు కదులుతుందని, చాలామంది పై నుండి కిందకి పడిపోయి గాయాలపాలు కావడం, ఇలా చాలాసార్లు సంభవించాయని వారు వాపోయారు. ఇక్కడ ఎక్కువ ఆడ దెయ్యాలు ఉన్నాయని, అవి తులుపుకు గడియ పెట్టి అప్పుడప్పుడు బయపెట్టేవని, ఇంకా తలుపులు గట్టిగా బాదడం లాంటి పసులు చేసేవని తెలిపారు. కొంతమంది మాత్రం ఇవి కేవలం కల్పితాలు మాత్రమే అంటున్నారు.

మల్చా మహల్‌ : ఢిల్లీ

ఈ మహల్‌ ఢిల్లీలో ఉంది. బుద్ధ పార్కు వెనుక భాగాన గల అడవిలో ఈ ప్యాలెస్‌ కలదు. ఇది ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈ మహల్‌ కి మరోపేరు బిస్తారి మహల్‌ అనికూడా అంటారు. నవాబ్‌ యొక్క మనవరాలు బేగంకి వారి సంతానం అయిన ప్రిన్స్‌ రియాజ్‌ మరియు ప్రిన్సెస్‌ సాకిన కి ఈ స్థలాన్ని ఇచ్చారు. బేగం వజ్రాలను చూర్ణం చేసుకుని తాగి ఆ మహల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం 10 రోజులపాటు అలానే ఉండిపోయింది. ఆమె పిల్లలు ఆమె శరీరంతో పాటే పక్కన పడుకునే వారట. ఆమె తల్లి మరణించిన తరువాత ప్రిన్సెస్‌ సాకిన నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించేవారట.

ది శనివర్వాడ ఫోర్ట్‌ : పూనె

ఇది మహారాష్ట్రలో పూనె పట్టణంలో ఉంది. దీనిని 1746 లో నిర్మించారు. ఇది 1818 వరకు పేష్వా పరిపాలకులు, మరాఠా సామ్రాజ్య ఆస్థానంగా ఉండేది. తరువాత బ్రిటిష్‌ వారు పేష్వాలను ఓడించి స్వాదీనం చేసుకున్నారు. ఈ కోట నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ కోటలో వివిధ రకాల భయానక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ ఫోర్ట్‌ ని దెయ్యాలు వెంటాడుతున్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ కోటలో 13 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఒక యువరాజు దారుణంగా చంపబడ్డాడు. అతడు ఈ కోటలో దెయ్యమై తిరుగుతున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ దెయ్యం పౌర్ణమి రోజులలో పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ అరుస్తుందట.

ఫిరోజ్‌ షా కోట్ల : ఢిల్లీ

ఇది ఫిరోజ్‌ షా తుగ్లక్  యొక్క ప్రియమైన నగరం. ప్రస్తుతం ఇది ఒక భయానక ప్రదేశంగా మారింది. దీనిని సందర్శకులు చూడకూడని ప్రదేశంగా ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ ప్రాంతాన్ని కేవలం యక్షిణుల ద్వారా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక ఆత్మహత్యలు జరిగాయి. అధికారులు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడలేక పోయారు. ఇది చాలా రహస్యమైన, భయంకరమైన భవనంగా పేరుగాంచింది.

డౌ హిల్‌, కుర్సీయంగ్‌ : వెస్ట్‌ బెంగాల్‌

కుర్సీయంగ్‌ ఒక ఆహ్లాదకరమైన హిల్‌ స్టేషన్‌. ఇక్కడి వాతావరణం  చాలా ప్రశాంతంగా ఉంటుంది. డౌ హిల్‌ లో పాఠశాలలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. కాని ఖచ్చితంగా భారతదేశం యొక్క అత్యంత హాంటెడ్‌ ప్రదేశాలలో డౌ హిల్‌ ఒకటి అనే చెప్పాలి. ఈ కొండ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండి ఎన్నో మరణాలకు శరణాలయంగా నిలించింది. ఈ ప్రాంతాన్ని దాటే సమయంలో ప్రజల ఎముకలు భయంతో వణికి పోతుంటాయి. ఇక్కడ వింత పాటలు, నవ్వులు వినపడుతుంటాయి. దెయ్యం కనిపించడం హఠాత్తుగా అదృశ్యమవడం ఇక్కడ మాములే, అడవిని సందర్శించే పలువురు తలలేని బాలుడుని చూసినట్లు తెలిపారు.

బ్రిజ్‌  రాజ్‌ భవన్‌ ప్యాలెస్‌ : రాజస్థాన్‌

ఈ బ్రిజ్‌ రాజ్‌ భవన్‌ దాదాపు 178 సంవత్సరాల క్రితం ప్యాలెస్‌. ఇది రాజస్థాన్‌ లో చోటుచేసుకుంది. దీనిని 1980 లో హెరిటేజ్‌ హోటల్‌గా మార్చారు. దీనిలో దెయ్యం నివాసం ఉంటుందట. 1857 తిరుగుబాటు సమయంలో భారత సిపాయిల ద్వారా మేజర్‌ బర్డన్‌ మరియు అతని ఇద్దరు కుమారులు చంపబడ్డారు. తరువాత బర్డన్‌ దెయ్యంగా ఆ ప్యాలెస్‌ లో తిరుగుతున్నారట. కాని మేజర్‌ బర్డన్‌ ఇప్పటి వరకు ఎవరికీ ఏహానీ చేయలేదని అక్కడి ప్రజలు అంటున్నారు.

More

Recent Posts