Showing posts with label Kitchen Tips. Show all posts
Showing posts with label Kitchen Tips. Show all posts

 
  1. సాంబారు, రసం పొడులని డీప్ ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచితే ఎక్కువ రోజులు వాసన పోకుండా తాజాగా ఉంటాయి.
  2. పచ్చళ్ళు, ఉరగాయల్లో స్టీల్ స్పూన్స్ వాడకూడదు.
  3. కోడి గుడ్డు పొరటు మెత్తగా రావాలంటే మూడు స్పూన్ల పాలు కలపాలి.
  4. ఉల్లిపాయలు గ్రైండ్ చేసిన వెంటనే వాడేయాలి. ఆలస్యమైతే చేదు గా అవుతుంది. అలాగే గ్రైండ్ చేసే ముందు ఉల్లిపాయలను నూనె లో వేయిస్తే ఎక్కువ సేపు తాజా గా ఉంటాయి.
  5. క్యారెట్  వండేటప్పుడు నాలుగైదు  చుక్కల నిమ్మరసం వేస్తే రంగు ఆకర్షనీయం గా ఉంటుంది. 
  6. వంకాయలను  కోసిన వెంటనే ఒక స్పూన్ పాలు కలిపిన నీళ్లలో వేస్తే ముక్కలు నల్లబడవు.
  7. బంగాళదుంపలను వారం పాటు  నిలవ  చేస్తే  మొగ్గలు వస్తాయి. ఇలా రాకుండా ఉండాలంటే బంగాళాదుంపలతో  పాటు  ఒక ఆపిల్ ని ఉంచాలి. 
  8. క్యారెట్ పై భాగాన్ని కోసేసి గాలి దూరని కవర్ లో పెట్టి ఫ్రిజ్  లో పెడితే ఎక్కువ రోజులు తాజా గా ఉంటాయి .
  9. టమాటోలను తొడిమ కింది వైపుకు వచ్చేటట్లు గా ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
  10. బెండకాయలు జిగురు పోవాలంటే వండేటప్పుడు రెండు చుక్కల నిమ్మరసం కాని ఒక స్పూన్ పెరుగు కాని కలపాలి. 
  11. కాఫీ కప్పులకు పట్టిన మరకలు పోవాలంటే సోడా నింపి మూడు గంటల తరువాత కడగాలి.