Showing posts with label Lakshmi Pooja. Show all posts
Showing posts with label Lakshmi Pooja. Show all posts

దీపావళి అంటే చిన్నపిల్లలనుండి  పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన పండుగ. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటో వివరాల్లోకి వెళ్తే.. దీపావళి అనగానే అందరూ దీపాలు వెలిగిస్తారు. అందుకే దీన్ని దీపాలపండుగ అంటారు కూడా. అయితే ఈ దీపాల పండుగ రోజైన దీపావళి నాడు మహాలక్ష్మీ పూజను నిర్వహించుకోవడం చూస్తుంటాం. ముఖ్యంగా మార్వాడీలు మహాలక్ష్మి పూజ చేసి, జాగారం చేస్తారు. ఇలా జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉందని అంటారు. అదేమిటంటే...

పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతోషించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అను ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కేస్తుంది. అది చూసిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు.

ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అని ఇంద్రుడు అంటాడు. దీనికి ఆ మాత.. త్రిలోకాథిపతీ, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని సమాధానమిచ్చింది. అందుకే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.