సాధారణం గా ఆడవారు ప్రవేశించని దేవాలయాలు ఉంటాయి కానీ మగవారు కూడా ప్రవేశించని ఆలయాలు ఉన్నాయని మీకు తెలుసా ?మగవాళ్ళను అనుమతించని ఆలయాలు మన భారతదేశంలో కొన్ని ఉన్నాయి. ఈ దేవాలయాలలో కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి ఉండగా, మగవాళ్లకు ఎంట్రీ ఉండదు. గుడి లోకి మగవాళ్ళు రాకుండా చూసుకునేందుకు అక్కడ కాపలాదారులు కూడా ఉంటారు. ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనేది తెలుసుకుందాం…
చెంగన్నూర్ భగవతీ ఆలయం కేరళలో కలదు. శివ పార్వతులు కొత్తగా పెళ్ళైన సమయంలో చెంగన్నూర్ ను సందర్శించారట. ఆ ఆలయంలో కేవలం ఆడవారిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఆడవారు రహస్యంగా విగ్రహానికి పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. ఆ తర్వాత మగ పూజారులు వచ్చి అభిషేకం నిర్వహిస్తారు.
కేరళ రాష్ట్రంలో అట్టుకల్ దేవాలయం గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ఒక్క మగాడూ కూడా వెళ్లారు కాదని వెళితే పాపాలు చుట్టుకుంటాయని వారి భావన. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు.
మాతా ఆలయం బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ పట్టణంలో కలదు. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారిని అనుమతించరు.
Showing posts with label Why Men Are Not Allowed In These Temples. Show all posts
Showing posts with label Why Men Are Not Allowed In These Temples. Show all posts
