Showing posts with label Why do we yawn. Show all posts
Showing posts with label Why do we yawn. Show all posts
మనిషికి తుమ్ములు, ఆవలింతలు రావడం సహజం. ఒకరు ఆవులించగానే ఖచ్చితంగా ఆవలింత మరొకరికి వస్తుంది.. ఇదే ఆవలింతలో ఉన్న మ్యాజిక్, అయితే దీని వెనకున్న లాజిక్ ను మాత్రం మన సైంటిస్టులు ఇంకా కనుక్కోలేకపోయారు. ఈ  ఆవలింత పై ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వైద్యులు చెబుతున్న దాని ప్రకారం శరీరం అలసటకు లోనైనప్పుడు ఈ ఆవలింతలు వస్తాయట . ఆవలింతలు అంటు వ్యాధి రకానికి చెందినవి కాకపోయినా, ప్రతిస్పందనల రకానికి చెందిన ఆరోగ్యకరమైన చర్య అని చెప్తారు. అసలు ఆవలింతలు ఎప్పుడెప్పుడు వస్తాయి,అసలు ఆవలింత మంచిదా చెడ్డదా వంటి విషయాలు తెలుసుకుందాం ...


తల్లి గర్భంలో ఆవలింత...
తల్లి గర్భంలో ఉండగానే ఆవలింతలు  మొదలవుతాయట . 11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే భూమి మీదకు రాక ముందే ఆవలింత మనకి దగ్గరవుతుందన్న మాట.

శరీరాన్ని రీప్రెష్ చేసేందుకు..
నిద్ర ముంచుకు వస్తుందని తెలపడమే కాదు.. నిద్రలో ఉన్న శరీరాన్ని రీప్రెష్ చేసేందుకు కూడా ఆవలింత వస్తుందట. ఈ ఆవలింతతో శరీరానికి ఉండే లేజీ నెస్ వెళ్లిపోతుంది.

మెదడు మరింత షార్ప్ గా పనిచేస్తుంది..
మనకి బోర్ కొట్టినప్పుడు, నిద్ర ముంచుకు వచ్చినప్పుడు ఆవలింత వస్తుంది. బుక్స్ చదివేటప్పుడు చాలా మంది ఆవలించడాన్ని గమనించే ఉంటారు. అయితే ఆవలించడం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి మెదడు మరింత షార్ప్ గా పనిచేస్తుంది. మనకు ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయంటే దానర్ధం, మెదడు తనని తాను యాక్టివ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అర్థం.

ఆవలింత ఎంత సేపు ఉంటుంది...
మనకొచ్చే ఒక్కో ఆవలింత సగటున 6 సెకన్ల వరకూ ఉంటుంది.

ఎన్ని సార్లు ఆవలిస్తామంటే...
మనిషి సగటు జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి పోతాయి. అది కూడా పుట్టక ముందు నుండి లెక్కెస్తారంట. అంటే జీవితకాలంలో 16 నుండి 17 రోజులు ఆవలింతలకే పోతాయన్నమాట.

More

Recent Posts