ఎక్కువ గా నిద్రపోతే సన్నబడతారా ??

ఎక్కువ గా నిద్రపోతే సన్నబడతారా ? లేక లావు అవుతారా అనే ప్రశ్న చాలామందిని వేధిస్తుంది. నిద్ర సరిగా పోయే వారితో పోల్చి చూస్తే నిద్ర పోని వారే బరువు పెరుగుతున్నట్లు ఇటీవల పరిశోదనలలో వెల్లడయింది. మీరు కడుపు నిండ తిని, చేతి నిండా పనిచేసి కూడా మీకు నిద్ర ఎందుకు పట్టడం లేదు... జిమ్‌లో వర్కవుట్‌ చేస్తూ కూడా ఎందుకు బరువు తగ్గడం లేదు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? నిద్ర వల్ల శరీరం లో జరిగేమార్పులు ఏమిటో ? వాటివల్లప్రభావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం....
నిద్ర వల్ల బరువు పై పడే ప్రభావం ఏమిటి ?

హంగ్రీ హార్మోన్లు :

బరువు మీద ప్రభావం చూపే హార్మోన్లు రెండు. 1. గ్రెలిన్‌  2. లెప్టిన్‌ ఇవి ఆకలి అనుభూతిని, సంపూర్ణ భావనని కలుగజేస్తాయి. పరిశోధన ద్వారా తెలిపింది ఏమనగా, రాత్రుళ్ళు నిద్ర పోకుండా ఉండడం వలన గ్రెలిన్‌ హర్మోన్లు ఎక్కువగా పెరుగుతాయి. లాక్లిన్‌ స్ధాయి తగ్గుతుంది. అందువల్ల తినాలనే కోరిక 45 శాతం సాధారణ స్ధాయికంటే పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం తగ్గుతుంది :

రాత్రిళ్ళు సరిగా నిద్ర పోని వారు సగటు న 9 శాతం ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని కాలీ సమయాల్లో తీసుకుంటారని పరిశోదనల ద్వారా తేలింది. సరిగా నిద్ర పోని వారిలో  ఆత్మ విశ్వాసం తగ్గుతుందని పరిశోదన ద్వారా తెలియజేసారు.

అలసట :

నిద్రలేమి వలన అలసట పెరుగుతుంది. దానివల్ల రోజు వారి పనులను కూడా సక్రమంగా చేయాలనిపంచదు. వ్యాయామాలకు దూరంగా ఉంటారు. వ్యాయామాలు చేమాలనే కోరిక నశించిపోతుంది. దానివల్ల బరువు పెరుగుతారు. నిద్ర నాణ్యతను బట్టి కండరాలు పెరుగుదల ఉంటుంది అని అంటున్నారు. నిద్ర లేని వలన కండారాల పెరుగుదలను ప్రోత్సహింస్తుంది.

శీఘ్ర పరిష్కారాలు:

పంచదారతో తయారు చేసిన స్నాక్స్ ఇంకా జంక్‌ ఫుండ్స్‌ తినడం సులభమే కాని దాని వలన పొందే ఫలితం తీవ్రంగా ఉంటుంది. బారా శరీరం పెరగడం, దాన్ని తగ్గించుకోలేక  అవస్ధలు పడడం అందువల్ల ఈ భాధలు పడకుండా వీలయినంత  వరకు వాటికి దూరంగా ఉంటూ వాటికి  బదులుగా ఆరోగ్యవంతమైన అల్పాహారం సేవించడం మంచిది. నెమ్మెదిగా శక్తిని విడుదలచేసే పెరుగు, గుడ్లు ఇటువంటి అల్పాహారం తినడంవలన మీ రక్తం లో చక్కర స్ధాయిని తగ్గించి మీరు చాక్లెట్‌ బార్‌ల వెంట వెళ్ళకుండా ఉండేందుకు సహాయ పడుతుంది. ఆరోగ్యకరమైన ఆపిల్‌ ముక్కలు, వేరుసెనగగింజలు మొదలగునవి స్నాక్స్‌ రూపంలో తీసుకోవాలి.

నిద్రని మెరుగుపరుచుకునే మార్గాలు:

ఆహార నియమాలు:


సాయంకాల భోజనం తక్కువ మోతాదులో తీసుకోవాలి. 7 లేదా 8 గంటలకే తినడం మంచిది. అలాగే తినడానికి, పడుకోవడానికి మధ్య సమయం 2 గంటలు ఉండే విధంగా చూసుకోవాలి. సాయంకాల సమయంలో ఎక్కువ తినడం వలన అది నిద్రని పాడు చేయడమే కాకుండా శరీరంలో కొవ్వును పెంచుతుంది. అందువల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం ఉత్తమం.

పగటి వేళలో నిద్ర:

చాలా మందికి మధ్యాహ్నవేళల్లో నిద్రించే అలవాటు ఉంటుంది. ఇది మంచి శక్తిని ఇస్తుంది. కాని 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు పడుకోకూడదు. ఇది సమర్ధవంతమైన సహజ శక్తిని అందిస్తుంది. ఇలా పడుకోవడం వలన 100శాతం చురుకుదల పెరుగుతుందని, ఇది రోజంతా తాజాగా చురుకుగా ఉండేలా చేస్తుందని దీని ఫలితం నాలుగు గంటల పాటు ఉంటుందని పరిశోదనల ద్వారా తేలింది.

7-8 గంటలు నిద్రించాలి:


7నుండి 8 గంటలు నిద్రించే వారితో పోల్చిచూస్తే  6 గంటలు నిద్రించే వారిలో 27 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అలాగే  రాత్రిళ్లు 5 గంటలు నిద్రించే వారు సగటున 73 శాతం మంది ఈ బరువు బారిన పడుతున్నారని తెలియజేసారు. అందువల్ల 7 లేదా 8 గంటలు నిద్ర తప్పని సరి అని నిపుణులు అంటున్నారు.

కాఫీ నియమాలు

కాఫీ ని అధిక మోతాదులో తీసుకోరాదు. మధ్యాహ్నం 2 గంటలు కంటే ముందు కాఫీ తాగే వారు పరిమితి మించి తాగకూడదు. అలాగే  కాఫీ రోజుకి 2 లేదా 3 కప్పుల ను మించి తాగకూడదు.

గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే రాత్రుళ్ళు తప్పని సరిగా 7 నుండి 8 గంటలు నిద్రించాలి.అలాగే పోషకవిలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. శరీరానికి కావలసినన్ని నీరు తాగాలి. ఇలా చేయడం వలన ఆరోగ్య వంతమైన జీవితాన్ని పొందుతారు.

0 comments:

Post a Comment