యవ్వనంగా ఉండాలంటే తులసి టీ తాగాల్సిందే!

తులసి చెట్టును పవిత్రంగా భావించి చాలా మంది పూజలు చేసే విషయం తెలిసిందే .. అటువంటి తులసి లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి.. ఎన్నో రకాల ప్రయోజనాల కోసం తులసిని ఆయుర్వేద ఔషదాల తయారీలో విరివిగా వాడుతున్నారు.  అయితే తులసి ఆకుల తో తయారు చేసిన టీ ని తాగడం వలన ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
యవ్వనంగా ఉండాలంటే తులసి టీ తాగాల్సిందే!

తులసి

ఔషద గుణాలను ఉండడం చేత తులసి ని పురాతన కాలం నుండే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటి వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు అధికమే అని చెప్పాలి... మరి అలాంటి తులసి టీ తాగటం వలన మనకు కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు చూద్దామా ..

యవ్వన చర్మం

కొద్ది కాలం పాటూ రోజు తులసి టీ తాగటం వలన  తులసి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు చర్మంలో ఉండే నిర్జీవ కణాలను తొలగించి, నూతన కణాలను పునరుత్పత్తికి తోడ్పడతాయి. కాబట్టి యవ్వన చర్మం  పొందాలంటే రోజూ తులసి టీ తప్పనిసరి.

మధుమేహ వ్యాధి

మధుమేహ వ్యాధి గ్రస్తుల కు తులసి టీ చాలా అద్భుతం గా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఉండే అన్-సాచురేటేడ్ ఫాటీ ఆసిడ్ లు రక్తంలో ఉండే అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి  బ్లడ్ షుగర్ లెవల్స్ అధికంగా ఉన్న  వారు రోజుకు ఒకసారి ఈ టీ తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది.

జీర్ణ సమస్య

అజీర్ణం, మలబద్దకం లాంటి  జీర్ణ సమస్యలు వేధిస్తున్నాయా? అయితే తులసి టీ వీటిని తగ్గించే అద్భుత ఔషదంగా చెప్పవచ్చు . యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే తులసి టీ దాదపు అన్ని రకాల  జీర్ణక్రియ సమస్యలను తగ్గించడం లో బహు చక్కగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం తులసి టీ అలవాటు చేసుకోండి ఇక .

మూత్రపిండాలలో రాళ్లు

రోజు తులసి టీ తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు త్వరగా కరిగిపోయే అవకాశం ఉందట.

మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న తులసి టీ ని తాగడం అలవాటు చేసుకొని ఆరోగ్యం గా జీవించండి ..

0 comments:

Post a Comment