ప్రాచీన కాలం నుంచి హిందువులు తులసి మొక్కకి చాల ప్రాధాన్యత ఇచ్చేవారు ఇంకా చాలా పవిత్రంగా పూజిస్తారు. రోజూ తులసిని పూజించడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శాస్త్రీయంగా కూడా తులసి ఇంట్లో ఉంటే మంచిదని మనఅందరికీ తెలుసు. అంతేకాకుండా తులసి ఇంట్లో ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తులసి రోజంతా ప్రాణవాయువును విడుదల చేస్తుంది అంట. తులసి శాస్త్రీయ నామము వచ్చేసి ఓసిమమ్ టెన్యూయి ఫ్లోరం. ఇప్పుడు తులసి యొక్క ఔషధ గుణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
తులసిని పూజించడానికి కారణమేంటి?
పురాణాల్లో తులసి మొక్కను కొలిచేందుకు రకరకాల కథనాలు ఉన్నాయి.
తులసి మొక్కను సనాతన ధర్మంలో వివిధ రకాల దేవతలు, పవిత్ర గ్రంథాలకు ప్రతిరూపంగా భావిస్తారు. అలాగే లక్ష్మీ దేవికి
భౌతిక రూపమని అందుకే తులసి మొక్కను ప్రతి రోజూ ఎంతో భక్తితో కొలిస్తే లక్ష్మీదేవి
అనుగ్రహం లభిస్తుంది అని హిందువుల నమ్మకం. తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు.
అంతేకాకుండా తులసి కోట ఇంట్లో ఉంటే ఏమైనా వాస్తు దోషాలు ఉన్న తొలగిపోతాయట.
ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం తులసి. మహాభారత కాలంలో ఘటోత్కచుడు కూడా మోయలేని ఆ భగవత్ స్వరూపమైన శ్రీ మహావిష్ణువుని ఒక్క తులసీ దళం తూయగలిగింది. అంత గొప్పది ఈ తులసి.
- కొన్ని తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటితో పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
- ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ తులసి ఆకుల రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
- తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే కూడా ఫలితం ఉంటుంది.
- కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడం లాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి)ఫలితం ఉంటుంది.
- తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంటుంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
- తులసి ఆకులను మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారట. తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారించే గుణం ఉంది.
- తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
- తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా మారుతుంది.
- తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుందంట .
- జీర్ణ శక్తికి తులసి చాలా మంచి ఔషధం. తులసి ఆకులు నాలుగు, మిరియాలు రెండు వేసి మెత్తగా నూరి చిన్న మాత్రగా చేసుకుని భోజనానికి అరగంట ముందుగా వేసుకుంటే బాగా ఆకలి వేస్తుంది అంట. తిన్నది కూడా జీర్ణమవుతుంది.
- కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉందంట. తులసిని వాడితే క్రిములు తొలగడమే కాక రక్తహీనత కూడా నివారించబడుతుంది.
- 8 ఏళ్ల పైబడిన చిన్న పిల్లలు అన్నం తినకుండా మారాం చేస్తుంటే అలాంటివారికి రోజూ ఉదయం నాలుగు తులసి ఆకులు తినిపిస్తే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి బాగా వేస్తుంది.
0 comments:
Post a Comment