జుట్టు రాలడం ఎక్కువైందా?


జుట్టు అందంగా పొడువుగా, బలంగా ఉండాలనే అందరూ కోరుకుంటారు. కాకపోతే ఆధునిక కాలం లో అందరిని  జుట్టు సమస్య వేధిస్తుంది.  ఈ సమస్య లేని వారు చాలా తక్కువ సంఖ్య లో ఉంటారు. జుట్టు రాలడానికి అనేక సమస్యలు కారణం కావొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల జుట్టు రాలె సమస్యనుండి బయటపడొచ్చు. అయితే వీటి కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగనవసరం లేదు . మన ఇంటిలోనె  అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయెగించి, చుండ్రు  సమస్య అరికట్టవచ్చు. అదేవిధం గా బలమైన,   దృఢమైన   జుట్టును మీ సొంతం చేసుకోవచ్చు.  మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కాలు  ఏమిటో తెలుసుకొని నల్లని నిగనిగ లాడే జుట్టు మీ సొంతం చేసుకోండి ..

వారానికి ఒకసారి :

కోడిగుడ్డులోని  తెల్లని సొనను జుట్టుకు బాగా  పట్టించి 20 నిమిషములు తర్వాత షాంపూతో శుభ్రపరచాలి. వారంలో కనీసం ఒకసారి అయినా ఇలా చేయడం వల్ల  నిగ నిగ లడే  జుట్టు మీ సొంతం అవుతుంది. .

పొడవాటి జుట్టుకోసం:

అరటిపండు-1
కోడి గుడ్డు-1
పాలు-3  స్పూన్స్
తేనె-3 స్పూన్స్

అరటిపండు గుజ్జులో గుడ్డు తెల్లసొనను మూడు స్పూన్ ల పాలు  మరియు మూడు స్పూన్ ల తేనె ను వేసి బాగా కలపాలి,  కలిపిన మిశ్రమాన్ని జుట్టు కి బాగా పట్టించండి. అరగంట  తర్వాత  షాంపూతో తలకి స్నానం చేయాలి. ఇలా వారానికి  కనీసం రెండు సార్లు చేస్తే  పొడవాటి జుట్టుని  మీ సొంతం చేసుకోవచ్చు.( లేదా ) రెండు  కోడి గుడ్లు  మరియు ఐదు స్పూన్ ల ఆలీవ్ అయిల్ ఒక గిన్నె లో బాగా కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు కి పట్టించి అరగంట తర్వాత షాంపూతో కడిగేయాలి.

చుండ్రు వదిలించుకోడానికి:

కోడి గుడ్డు-1
నిమ్మకాయ -1

కోడి గుడ్డు  మరియు నిమ్మకాయ రసంను బాగా కలపండి. తరువాత ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి 20 నిమిషాల  తరువాత  షాంపూతో శుభ్రం గా కడిగేయాలి. ఇలా ఈ చిట్కా పాటించడం వల్ల చుండ్రు నివారణ తో పాటు మేరిసె జుట్టు మీ సొంతం అవుతుంది.

జుట్టు రాలకుండా ఉండేందుకు:

ఉసిరి రసం
నిమ్మరసం

ఉసిరి రసం లో మూడు స్పూన్ల  నిమ్మ రసం కలిపి జుట్టు కుదుళ్ల భాగంలో బాగా  పట్టించి 30 నిమిషాల పాటు ఉంచుకొని ఆ  తర్వాత  నీటితో శుభ్రం  చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు పాటించడం వల్ల మీ జుట్టు రాలకుండా ఉంటుంది.

0 comments:

Post a Comment