వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం ఎలా?

ఈ వేసవి కాలం లో చర్మాన్ని సూర్యకిరణాల నుండి కాపాడుకొని అందంగా కనపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారా?. మీ చర్మాన్ని కాపాడుకోవడానికి ఉన్న ఒక మంచి మార్గం సహజ ఉత్పత్తులు.. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకోగల ఉత్పత్తుల ని ఉపయోగించి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మండే వేసవిలో ఈ సహజ పద్దతులను ఉపయోగించి మెరిసే చర్మాన్ని సులభంగా పొందవచ్చు.



గంధం, ముల్తాన్ మట్టి పేస్ ప్యాక్

గంధం మరియు ముల్తాని  మట్టితో చేసిన ప్యాక్ ను వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ ప్యాక్ మీ చర్మ పై ఉండే అధిక నూనెలను గ్రహిస్తుంది అలాగే  గంధం చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మారుస్తుంది. ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ ను కలిపి వాడటం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇది సహజ సిద్ద ఆస్ట్రిజెంట్ (రక్తస్రావ నివారిణి) గా పని చేస్తుంది అలాగే చర్మంపై ఉండే ఎరుపుదనాన్ని తగ్గేలా చేస్తుంది.

రోజ్ వాటర్

వేసవి కాలంలో రోజ్ వాటర్ ని రోజూ రెండు సార్లు వాడటం వలన జిడ్డు చర్మం నుండి ఉపశమనం పొందవచ్చు. చర్మ రంధ్రాలలో చేరిన దుమ్ము వలన బాక్టీరియా ఇన్ఫెక్షన్ లకు గురై, మొటిమలు ఇతర చర్మ వ్యాధులు రాకుండా ఈ  రోజ్ వాటర్ కాపాడుతుంది.

పెసరపప్పు తో స్క్రబ్

ఇంట్లోనే తయారు చేసిన పెసరపప్పు స్క్రబ్ ను రెండు రోజులకు ఒకసారి ముఖానికి వాడటం వలన మొటిమలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా, ముఖ చర్మంపై ఉన్న అధిక నూనెలను గ్రహించి, సహజ సిద్ద ఎక్సోఫోలేట్ గా పని చేస్తుంది.

చెమటను ఎప్పటికపుడు తుడవండి

చర్మంపై ఇన్ఫెక్షన్ లు కలగకుండా ఉండాలంటే ఎప్పటికపుడు శుభ్రంగా ఉండాలి. అంటే  ముఖంపై చెమట ఉత్పత్తి చెందిన వెంటనే టవల్ లేదా జేబులో ఉండే రూమాల్ లేదా ఫేస్ క్లీనింగ్ ప్యాడ్ లతో ఎప్పటికపుడు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో వాడే టాల్కమ్ పౌడర్ కూడా చెమటను గ్రహించుటకు సహాయపడుతుంది.

0 comments:

Post a Comment