మొహం మీద ముడతలు తగ్గించుకోండిలా!!

ప్రస్తుత కాలం లో చిన్న పెద్దా అనే తేడాలు లేకుండా ప్రతిఒక్కరూ ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. వాతావరణ కాలుష్యం వల్ల చర్మం దెబ్బతిని చిన్న వయస్సు లోనే అనేక సమస్యలకు గురి అవుతున్నారు. ఇవి తగ్గించుకునే ప్రయత్నం లో మార్కెట్ లో లభించే  వివిధ రకాల కాస్‌మోటిక్స్ ని వాడి ఉన్న అందాన్ని కూడా పాడుచేసుకుంటున్నారు. ఈ ముడతలకి ముఖ్య కారణం పొడి చర్మం ఇంకా పోషకాహార లోపం. వీటి వల్ల ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ లో లబించే కాస్‌మోటిక్స్ వాడే ముందు మీది ఎటువంటి చర్మం తెలుసుకొని దానికి సంబందించిన వాటిని మాత్రమే వాడాలి తొందరగా తగ్గిపోవాలి అని ఏవి పడితే అవి వాడకూడదు. దాని వల్ల చర్మం దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఇంకో పద్దతి కూడా ఉంది ఇంట్లో ఉన్న వాటిని ఉపయోగించి  తగ్గించుకోవడం. చర్మాన్ని ఎప్పుడు ఎండిపోకుండా చూసుకోవాలి దాని కోసం ఆయిల్ రాసుకోవడం మంచిది, దీని వల్ల చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. చాలా ఎసెన్షియల్ ఆయిల్స్ ఆంటీ-బ్యాక్టీరియ, ఆంటిసెప్‌టిక్ గుణాలనీ కలిగి ఉంటాయి వాటిని వాడడం వలన చర్మం ఇన్ఫెక్షన్ కి గురి కాకుండా ఉంటుంది. ఆయిల్ రెమెడీస్ వలన ముడతలు, చిన్న గీతలు, పొడిబారిపోవడం ఇలాంటి సమస్యలకు పరిష్కారం లబిస్తుంది. ఆయిల్ రెమెడీస్ లో ముఖ్యమైనవి.




1.బాదమ్ ఆయిల్, ఆలొవీరా, కోకో బటర్ క్రీమ్:
ఆలొవీరా లో ఎన్నో  ఔషధ గుణాలు ఉన్నాయి. కంటి కింద వలయాలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. దేనిని సేవించడం కూడా మంచిదే. ప్రస్తుతం కొంత మంది డాక్టర్స్ కూడా సిఫార్స్ చేస్తున్నారు.
తయారు చేయడానికి  కావాల్సినవి: 
  • పాత్ర-1
  • ఆలొవీరా జెల్ -4 టేబుల్ స్పూన్
  • కోకొ బటర్ -3  టేబుల్ స్పూన్
  • లేవేండెర్ ఆయిల్-3 నుండి 4 చుక్కలు
  • బాదం ఆయిల్-6  టేబుల్ స్పూన్
తయారు చేయువిదానము:
  • పాత్రని తీసుకొని అందులో ఒకదాని తరువాత మరొకటి తీసుకొని వేడి చేయాలి.
  • గోరువేచ్ఛగా వేడి చేయాలి మరి ఎక్కువ వేడి చేయకూడదు.
  • అన్ని ఒక్కసారిగా కలిపి వేడి చేయరాదు.
  • వేడి చేసిన అన్నిటినీ ఒక జార్ లోకి తీసుకొని 1 నుండి 2 నిమిషాల వరకు బాగా కలపాలి.
  • తర్వాత ఈ క్రీమ్ ని శుబ్రమైన దాంట్లో స్టోర్ చేయాలి.
  • శుబ్రపరిచిన ముఖానికి రోజుకి రెండు సార్లు రాసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ వయస్సు తగ్గిస్తుంది ఈ క్రీమ్. ముఖం మీద ముడతలు, కళ్ల కింద వలయాలు క్రమం గా తగ్గుముఖం  పడతాయి.
 2.ఆలివ్ ఆయిల్ అప్లికేషన్ 
 నుదుటి మీద ముడతలు పోవడానికి అలివ్ ఆయిల్ మంచి రెమెడీ అని చెప్పవచ్చు. దీంట్లో ఆక్సిడెంట్, ముఖ్యమైన విటమిన్స్ ఉండడం వల్ల చర్మం వయస్సు మళ్లినట్లు కనపడకుండా చేస్తుంది.

తయారు చేయడానికి కావలసినవి:
  • అలివ్ ఆయిల్-1 టేబుల్ స్పూన్
  • వేడి నీళ్ళు-1/2 కప్
  • పలచటి వస్త్రం ఒకటి
పద్దతి:
  • 1 టేబల్ స్పూన్ అలివ్ ఆయిల్ తీసుకోవాలి.
  • ఆలివ్ ఆయిల్ ని ముఖానికి మెడ భాగాలకి రాసుకోవాలి. ఇలా 1 నుండి 2 నిమిషాల పాటు వేళ్లతో గుండ్రం గా మసాజ్ చేసుకోవాలి.
  • తర్వాత పలుచటి వస్త్రాన్ని వేడి నీటిలో ముంచి పైకి తీసి మిగిలిన నీటిని పిండి ఆ వస్త్రం తో ముఖాన్ని తుడుచుకోవాలి. ఇలా ప్రతి రోజు నిద్రాపోయే ముందు  చేయడం వలన నుదుటి మీద ముడతలను పోగొట్టవచ్చు.
3. అలివ్  ఆయిల్, గ్లీజరిన్ ఇంకా తేనె ప్యాక్ 
కళ్ల కింద ముడతలను ఎంత మేక్అప్ వేసినా దాయడం చాలా కష్టం. వాటిని కాకి అడుగులు అని పిలుస్తారు. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా వీటిని క్రమేపీ తగ్గించుకునే అవకాశం ఉంది. ఆలీవ్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్ గా పని చేస్తూ కంటి కింద సున్నితమైన భాగాలని సంరక్షిస్తుంది.
తేనె సామాన్యం గా అందరి ఇంట్లోనూ ఉంటుంది. ఇది తాగడానికే కాదు సౌందర్య సాదనాలలో కూడా వాడుతారు దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పాడైన  చర్మాన్ని మళ్లీ మామూలు స్టితి  కి మార్చగలదు. ముఖ్యముగా కంటి క్రింద వలయాలను ముడతలను పోగొట్టే సామర్ద్యం వీటికి ఉంది.

కావలసినవి:
  • అలివ్ ఆయిల్ -1/2 టేబుల్ స్పూన్
  • గ్లీజరిన్ -1/4  టేబుల్ స్పూన్
  • తేనె-1 నుండి 2 చుక్కలు
తయారు చేసే పద్దతి:
  • ముందుగా అలివ్ ఆయిల్ ని గోరువేచ్ఛగా వేడి చేయాలి.
  • తర్వాత గ్లీజరిన్ ని ఇంకా తేనె ని ఆ వేడి చేసిన అలివ్ ఆయిల్ లో కలపాలి.
  • ఈ కలిపిన మిశ్రమాన్ని కామ్టి కింద వలయాలకి లేదా ముడతల కి  ఉంగరం వేలుతో రాయాలి .
  • ఒక పద్దతి లో వేళ్ళ తో  గుండ్రం గా తిప్పుతూ కంటి చుట్టూ మసాజ్ చేసుకోవాలి. ఈ లోషన్ ని 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి.
  • అనంతరం గోరు వెచ్చని నీటి తో కడుక్కోవాలి. రోజు నిద్రాపోయే ముందు తప్పకుండా ఈ పద్దతి పాటించడం ద్వారా కంటి కింద వలయాలని సాద్యమైనంత  త్వరగా తగ్గించ్చుకోవచ్చు.
4. విటమిన్ ఇ ఆయిల్, పెరుగు, నిమ్మరసం మరియు తేనె ఫేస్ మాస్క్: 
నుదిటి మీద ముడతలతో బాధపడే వారికి ఇది ఒక అధ్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. పెరుగు ముఖం మెడ ఉండే చిన్న చిన్న గీతలని సైతం మాయం చేయగలదు. పెరుగు లో ల్యాక్‌టిక్ ఆసిడ్ ఉంటుంది, ఇది సహజాసిద్దమైన ఆల్ఫా హిడ్రాక్సీ ఆసిడ్. అలాగే నిమ్మకాయ లో సిట్‌రిక్ ఆసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం గా చేస్తుంది. తేనె చర్మ గ్రంధులని సంరక్షిస్తుంది. విటమిన్ ఇ పాడైనా గ్రంధూలని బాగుచేసే సామర్ద్యం దేనికి ఉంది.
కావలసినవి:
  • పెరుగు-2 టేబుల్ స్పూన్
  • నిమ్మరసం-1/2 టేబుల్ స్పూన్
  • తేనె-1/2 టేబుల్ స్పూన్
  • విటమిన్ ఇ ఆయిల్-3 కప్సూల్స్
తయారుచేయు పద్దతి:
  • ముందుగా విటమిన్ ఇ ఆయిల్ 3 కప్సూల్స్ ని ఒక పాత్ర లో తీసుకొవాలి.
  • తర్వాత పెరుగు, నిమ్మరసం ఇంకా తేనె ని విటమిన్ ఇ ఆయిల్ తో పాటు కలపాలి.
  • బాగా కలిపిన తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి ఇంకా మెడకు రాసుకోవాలి. అలా 15 నుండి 20 నిమిషాలపాటు వదిలేయాలి.
  • తర్వాత గోరువేచ్చని నీటి తో శుబ్రపరుచుకోవాలి.
  • ఇలా వారానికి మూడు సార్లు చేయాలి. ముఖం, నుదుటి మీద ముడతలు పోతాయి.
5. ఆముదము 
పొడిబారిన చర్మానికి ఇది ఒక అధ్భుదమైన ఔషధం. ఇది చర్మాన్ని పొడిబారకుండా చూసుకుంటుంది. దీనివల్ల వయస్సు పై బడిన వారు మలే కనపడరు. చర్మం కాంతివంతం గా మరి బిగితుగా ఉంటుంది. ఇది ఒక గొప్ప రెమెడీ, ముడతలు, కంటికింది వలయాలను మాయం చేయడం లో బాగా పనిచేస్తుంది.
కావలాసినవి:
  • ఆముదాము-1/4
  • పలుచటి వస్త్రం-1
  • గోరువేచ్చని నీరు-1/2 కప్
ఉపయోగించే పద్దతి:
  • ముందుగా 1/4 ఆముదాన్ని చూపుడు వేలికి తీసుకోవాలి.
  • దానిని కంటి క్రింద భాగం లో ఇంకా ఎక్కడ ఎక్కువ చర్మం డ్యామేజ్ అయిందో అక్కడ రాసుకోవాలి.
  • వేళ్ళతో బాగా గుండ్రం గా కంటి చుట్టూ తిప్పుతూ మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
  • తర్వాత పలుచటి వస్త్రాన్ని నీటి లో ముంచి గట్టిగా పిండి ముఖాన్ని సుబ్రపరుచుకోవాలి. రోజు కి  1 సారి ఇలా చేయాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
పైన చెప్పిన వాటితో పాటు కొన్ని జాగ్రతలు  తీసుకోవాలి అలాచేయడం వల్ల మీ చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇంకా చిన్న వయస్సు లోనే కొంతమంది పెద్ద వారి మాదిరిగా కనపడుతుంటారు. ఇవీ పాటించడం ద్వారా ఆలాంటి సమస్యలు ఎదురవవు.
  • సూర్యుని కాంతి డైరెక్ట్ గా పడనివ్వకూడదు.
  • ఎండ లో బయటకు వెళ్ళినప్పుడు తగుజాగ్రతలు తీసుకొని బయటకు వెళ్ళాలి. సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ రాసుకోవాలి.
  • ఏవిధమైన ఒత్తిడి కి గురి కాకుండా  చూసుకోవాలి.
  • కచ్చితం గా రోజు కి 8 గంటలు పడుకోవాలి.
  • నాణ్యమైన క్రీమ్ లనే వాడాలి. తక్కువ ధరే అని  తక్కువ రకం క్రీమ్ లని వాడి అనవసరంగా చర్మాన్ని పాడుచేసుకోవద్దు.
  • టైమ్ కి భోజనం చేయడం, పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయాలి.
  • ఎక్కువ కెమికల్స్ వాడే క్రీమ్ లను వాడకుండా ఉండడం మంచిది.
  • ద్యానమ్ చేయడం వలన శరీరానికి మనస్సు కి కూడా ప్రశాంతత  చేకూరుతుంది.
  •  పొగ తాగడం పూర్తిగా మానుకోవడం మంచిది.
  •  జంక్ ఫుడ్ కి దూరం గా ఉండాలి. రోజుకు తగినన్ని నీరు తాగాలి
  • ఆహారము లో ఎక్కువగా విటమిన్ సి ఇంకా ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండేలా చూసుకోవాలి.
  • పైన తెలిపిన అన్ని విధానాలు సాగిన ఇంకా పొడిబారిన చర్మానికి చిట్కాలు. ఇందులో ఏది అయిన మీకు పడకుండా రియాక్షన్ ఇచ్చిన చొ  చర్మ నిపుణులను అనుసరించి వాడవలెను.

0 comments:

Post a Comment