మొటిమలు,మచ్చలకు టీ ట్రీ ఆయిల్‌

ప్రస్తుత కాలంలో యువతీ యువకులకు ఎదురయ్యే పెద్ద సమస్య మొటిమలు. అందంగా ఉన్న ముఖం రావడం వలన మచ్చలు ఏర్పడి చూడడానికి చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. అసలు సహజం గా మొటిమలు అనేవి హార్మోను అసమల్యత వలన, కాలుష్యంవలన, శుభ్రత లోపించినప్పుడు.యవ్వనంలో ఉన్నప్పుడు ఇవి రావవడం జరుగుతుంది. వీటిని తగ్గించుకోనే మార్గంలో మార్కెట్‌ లో లభించే ప్రొడక్ట్స్  వాడి ఇంకొన్ని సమస్యలను తెచ్చుకుంటున్నారు. మార్కెట్‌ లో లభించే ప్రొడక్ట్స్ కొంత మందికి పనిచేస్తాయి. కొంతమందికి ఎన్నివాడిన ఫలితం ఉండదు.కాని టిట్రీ ఆయిల్‌ మంచి ఫలితాన్ని ఇస్తుందట. టిట్రీ ఆయిల్‌ ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకుండా చర్మాన్ని కాపాడుతుందని నిపుణులు తెలియజేసారు.



టీ ట్రీ ఆయిల్‌ ఎలా పనిచేస్తుందంటే...
పరిశోదనల ఆధారంగా టిట్రీ ఆయిల్‌ ఎటువంటి దుష్ప్రభావాలకు చోటునివ్వదు.ఇది ఒక మంచి అద్బుతమైన ఫలితాన్ని ఇస్తుంది.అని నిపుణులు తెలిపారు.ఇందులో యాంటీబ్యాక్టీరియల్‌,యాంటీ ఫంగల్‌ ,ఇంకా చర్మం లోపలికి చొచ్చుకొని పోయి చర్మాన్ని బాగుచేసే గుణం దీనికి ఉంది. టిట్రీ ఆయిల్‌ లో బ్యాక్టరియాలను ఎదుర్కొన గల సామర్ధ్యం కలదు.ఇది మెటిమమలను కలుగజేసే బ్యాక్టరియాను చంపుతుంది.అలాగే
చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచేందుకు సహాయం చేస్తుంది.ఇది చర్మంలోపలి నుండి పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఇంకా మెరిసేలా చేస్తుంది. ఇది చర్మం లోపలి పొరల్లోకి వెళ్ళి ముడతలను ఇంకా మెటిమలను పోగొడుతుంది. దీంట్లో యాంటీ ఫంగల్‌ లక్షణాలు ఉన్నాయి.ఇది బ్యాక్టరియాని చంపి తర్వాత ఇంకా ఎక్కువగా పెరగకుండా చూసుకుంటుంది..

టీ ట్రీ ఆయిల్‌ ఉపయోగించే విధానం:

దీన్ని డైరెక్ట్‌ గా లేకపోతే ఏమైనా పదార్ధాలను ఉపయోగించి వాడవచ్చు.అలోవీరా,తేనే,పెరుగు,గుడ్డులోపలి తెల్లనిసొన ఇంకా ఇలాంటి వాటితో కలిపి టీట్రీ ఆయిల్‌ ని ఉపయోగించవచ్చు.

డైరెక్ట్‌ అప్లికేషన్‌: 

టీట్రీ ఆయిల్‌ని డైరెక్ట్‌గా అప్లై చేయడం-దీంట్లో హానికరమైన   కెమికల్స్‌ ఉండవు.

అనుసరించు విధానం:

  • శుభ్రముగా ముఖము కడిగి,పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.
  • దూదిని ఆయిల్‌లో ముంచి మొటిమలు ఉన్నచోట దాంతో రాసుకోవాలి.
  • అలా కొన్ని గంటలు ముఖం మీద ఆ ఆయిల్‌ని వదిలేయాలి.
  • ఇలా రోజుకు రెండు సార్లు ఉదయం,సాయంత్రం చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి.
హెచ్చరిక:

టీట్రీ ఆయిల్‌ వాడేముందు చర్మంపై కొంచెం రాసుకొని పరీక్షించిన తర్వాతే దీన్ని వాడాలి.ఒకవేళ ఎర్రగా అయిపోయి,మాట ఇరిటేషన్‌ వస్తే దీన్ని వాడడం మంచిది కాదు.అలాఏమి లేకుండా మాములుగా ఉంటే దీన్ని తప్పకుండా వాడొచ్చు.

టీట్రీ ఆయిల్‌ మరియు మంచి నీళ్ళు :

టీట్రీ ఆయిల్‌ వగరు వల్ల మొటిమలు మాడిపోతాయి.ఇది బ్యాటరియాని చంపి మొటిమలు లేని
చర్మాన్ని ఇస్తుంది.

కావలసినవి:
  • టీ ట్రీ ఆయిల్‌-4 చుక్కలు
  • నీళ్ళు- 1 కప్పు.
అనుసరించు విధానం:
  • ఒక కప్పు నిండా నీరు తీసుకోవాలి దాంట్లో 4 చుక్కలు టీట్రీ ఆయిల్‌ ను కలపాలి.
  •  ఆ మిశ్రమాన్ని చక్కగా కలిపి తర్వాత ఆ మిశ్రమంతో మొటిమలు కలిగిన ప్రదేశాన్ని
  • కడగాలి.
  •  ఇలా రోజుకి ఒక్కసారి చెయ్యాలి.
టిట్రీ ఆయిల్‌ మరియు అలోవీరా జెల్‌:

అలోవీరాని చాలా చర్మ సమస్యలకు వాడుతారు.దీంట్లో ఆంటి బ్యాక్టిరియల్‌ లక్షణం ఉండడం వలన దీన్ని కాలిన గాయాలకు,తెగిపోయిన,ఇరిటేషన్‌ కి ఇలా చాలా రకాల సమస్యలకు వాడుతారు. అలోవీరా చర్మాన్ని మృదువుగా చేస్తుంది.

కావలసినవి:
  • అలోవీరా జెల్‌ - 2 నుండి 3 టేబుల్‌ స్పూన్‌.
  • టిట్రీ ఆయిల్‌ -2 చుక్కలు.
  • ఒక చిన్న గిన్ని.
అనుసరించు విధానం:
  • ఒక చిన్న గిన్నె లో 2 నుండి 3 టేబుల్‌ స్పూన్‌ల అలోవీరా జెల్‌ను తీసుకోవాలి.
  • అందులో అయ2 చుక్కలు టిట్రీ ఆయిల్‌ను వేసి బాగా కలపాలి.
  • ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి అలా రాత్రి మొత్తం వదిలేయాలి.
  • నిద్రపోయో ముందు ముఖాన్ని బాగా శుభ్రపరిచి తర్వాత ఈ విధానాన్ని పాటించాలి.
  • దీన్ని రోజు పాటించడం వలన మీరు కోరుకున్న ఫలితాన్ని పొందుతారు.
 టిట్రీ ఆయిల్‌,పెరుగు మరియు తేనె:

పెరుగులో ఆల్ఫా హైడ్రాక్సైల్‌ యాసిడ్‌ ఉంటుంది.లాక్టిక్‌ యాసిడ్‌ అంటారు.ఇది చర్మాన్ని శుభ్రపరిచి మృతకణాలను పోగొడుతుంది.ఇది ముఖ్యంగా మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోటీడపి వాటిని నాశనం చేస్తుంది.

కావలసినవి:
  • టీ ఆయిల్ 2 నుండి 3 చుక్కలు
  • పెరుగు 1 టేబుల్ స్పూన్
  • తేనె 1 టేబుల్ స్పూన్
  • వేడి నీళ్ళు కావలసినవన్ని
  • మాయిశ్చరైజర్
  • చిన్న గిన్నె
తయారు చేయువిదానం:
  • చిన్న గిన్నె లో 2 నుండి 3 చుక్కలు వరకు టీ ట్రీ ఆయిల్ ని తీసుకోవాలి.
  • 1 టేబుల్ స్పూన్ పెరుగు మరియు తేనెని టీ ట్రీ ఆయిల్ లో  కలపాలి.
  • ఈ మిశ్రమాన్నిబాగా కలిపిన తరువాత మొటిమలు ఉన్నచోట రాసి 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేయాలి.
  • 20 నిమిషాల తరువాత గోరువేచ్చని నీటి తో ముఖాన్ని శుబ్రపరుచుకొని మెత్తటి వస్త్రంతో తుడుచుకోవాలి.
  • అనంతరం రోజు వారి మాయిశ్చరైజర్ క్రీమ్ లను రాసుకోవాలి. దీని వల్ల చర్మం పొడిబారకుండా చేస్తుంది.
  • ఈ పద్దతిని రోజూ చేయడం వలన మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.
టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్ లో కూడా ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది ఇరిటేషన్ ని పోగొట్టి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

కావలసినవి:
  • టీ ట్రీ ఆయిల్ 2 లేదా 3 చుక్కలు
  • నాణ్యమైన ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్
  • చిన్న పాత్ర
  • శుబ్రమైన వస్త్రం
అనుసరించు విదానం:
  • పాత్రని తీసుకొని దాంట్లో టీ ట్రీ ఆయిల్ మరియు ఆలివ్ ఆయిల్ని బాగా కలపాలి.
  • ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి 15 నుండి 20 నిమిషాల పాటు వదిలేయాలి.
  • తరువాత ముఖాన్ని గోరు వెచ్చని నీటి తో శుబ్రపరుచుకొని మెత్తటి వస్త్రం తో
  • తుడుచుకోవాలి.
  • ఇలా రోజూ చేయడం వలన మొటిమల నుండి విముక్తి లబిస్తుంది.
టీ ట్రీ ఆయిల్ మరియు ఎగ్ వైట్ :

గుడ్దులోని తెల్ళసోన చర్మాన్ని మృదువుగా చేస్తుంది. మొటిమల ను అరికడుతుంది. చర్మం లోని మృతకణాలను  తొలగించి చర్మాన్ని కాంతివంతం గా చేస్తుంది.

కావలసినవి:
  • గుడ్డు 1
  •  టీ ట్రీ ఆయిల్ 4 చుక్కలు
  • గోరు వెచ్చని నీరు కావలసినన్ని
  • చిన్న పాత్ర
అనుసరించు పద్దతి:
  • గుడ్డు నుండి తెల్లని సోనని వేరు పరచాలి. దాన్ని ఒక చిన్న పాత్రలోకి తీసుకోవాలి
  • 4 చుక్కలు టీ ట్రీ ఆయిల్ ని ఆ పాత్రలో వేయాలి. రెండితిని బాగా కలిసే వరకు
  • కలపాలి.
  • తయారయిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసుకొని ఒక 15 నిమిషాలపాటు వదిలేయాలి.
  • తరువాత గోరువేచ్చని నీటి తో ముఖాన్ని కడిగి మెత్తటి వస్త్రం తో తుడుచుకోవాలి.
  • ఈ పద్దతిని వారానికి ఒక సారి చేయడం వలన మొటిమలు తగ్గుముఖం పడతాయి.
 టీ ట్రీ ఆయిల్, అలివ్ ఆయిల్, తేనె మరియు పంచదార:

ముందు తెలిపిన ప్రక్రియల్లో టీ ట్రీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, తేనె ప్రయోజనాలని తెలుసుకున్నాం. పంచదార ఒక స్క్రబ్ లాగా అద్బుతమ్ గా పని చేస్తుంది.

కావలసినవి:
  • టీ ట్రీ ఆయిల్ 10 లేదా 12 చుక్కలు
  • ఆలివ్ ఆయిల్ 1/4 కప్పు
  • పంచదార 1/2 కప్పు
  • తేనె 1 టేబుల్ స్పూన్
  • వేడి నీళ్ళు కావలసినన్ని
  • పాత్ర ఒకటి
అనుసరించు విదానం:
  • వీటన్నింటిని బాగా కలిసే విధంగా కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట వేళ్లతో మృదువుగా వలయాకారంలో 5 నిమిషాల పాటు
  • మసాజ్‌ చేయాలి.
  • ఇలా చేసిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచు కోవాలి.
  • ఈ పద్దతిని రోజు అనుసరించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుంది. కావాలంటే మీరు ఈ మిశ్రమాన్ని బద్రపరుచుకొని అవసరమైనపుడు వాడుకోవచ్చు.
టీట్రీ ఆయిల్‌ మరియు కొబ్బరి నూనె :

కొబ్బరి నూనెలో కాప్రిక్‌ మరియు లారిక్‌ యాసిడ్‌ ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనిలో విటమిన్‌ ఇ ఉండడం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సెబం గ్రందులను క్రమబద్దీకరణ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేగుణం కొబ్బరి నూనెలో కలదు.

కావలసినవి:
  • టీట్రీ ఆయిల్‌ 1 టేబుల్‌ స్పూన్‌
  • కొబ్బరి నూనె 9 టేబుల్‌ స్పూన్‌
  • వేడి నీళ్లు ఒక కావలసినన్ని
  • శుభ్రమైన వస్త్రం
అనుసరించు పద్దతి :
  • ముందుగా శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీటిలో కొంచెం సేపు నానబెట్టి దాన్ని బయటకు తీసి బాగా పిండాలి.తరువాత ఆ వస్త్రాన్ని ముఖం మీద వేసుకోవాలి.ఇలా చేయడం వలన ముఖం మీదే వుండే సూక్ష్మరంద్రాలు తెరచుకుంటాయి.
  • టీ ట్రీ ఆయిల్ మరియు కొబ్బరి నూనె ను బాగా కలపాలి. కలిసిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట రాయాలి.
  • రాసిన తరువాత వేళ్లతో వలయాకారం లో మృదువుగా 5 నుండి 10 నిమిషలవరకు  మసాజ్ చేసుకోవాలి.
  • కొద్ది సేపటి తరువాత ఆ ఆయిల్ అంతా చర్మం లో ఇంకిపోయింది అని నిర్దారణకు వచ్చిన తరువాత వెంటనే ముఖాన్ని కడగ కూడదు.
  • ఈ ప్రక్రియను రోజు కి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని చిట్కాలు
  • మొటిమలను దూరం చేయడానికి టీట్రీ జెల్‌ని కూడా ఉపయోగించవచ్చు.దీన్ని రోజుకి రెండు సార్లు వాడడం వలన మొటిమలు తగ్గుముఖం పడతాయి.
  • చాలా మందికి ముఖం మీదే కాకుండా శరీరం పై కూడా మొటిమలు ఉంటాయి.ఇలా వున్న వారు టీట్రీ ఆయిల్‌ను స్నానం చేసే ముందు కొన్ని చుక్కలు నీళ్ళలో వేసుకుని చెయ్యడం వలన శరీరంపై వుండే మొటిమలు తగ్గుతాయి.
  • ఈ టీట్రీ ఆయిల్‌ ని ఉపయోగించేటప్పుడు చర్మం పై దద్దుర్లు, మంట ఈ విధమైన భావన కలిగినచో వాడరాదు.
  • గర్బిణీ స్త్రీలు,చిన్న పిల్లలు వాడకూడదు.

0 comments:

Post a Comment