వాసెలిన్‌ ని ఇన్ని రకాలుగా వాడొచ్చని మీకు తెలుసా?

అందంగా ఆకర్షణీయంగా కనబడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అలా కనిపించడం కోసం వేలకు వేలకు పోసి మార్కెట్లో అనేక రకాల క్రీములు కొంటుంటారు. ఇదిలా ఉంటే కొంత మంది మాత్రం తెలివిగా అంతడబ్బుఖర్చులేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో అందంగా ఆకర్షణీయంగా కన్పిస్తుంటారు. అదెలా అంటే... సరిగ్గా గమనిస్తే మనం రోజూ వాడే వాసెలిన్‌ ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. చాలా మంది చర్మం ఎప్పుడూ జీవం లేకుండా పొడిబారిపోయి ఉంటుంది. అలాంటి వారు రకరకాల జెల్స్‌ అని అవి ఇవి కొని డబ్బును వృదా చేస్తారు. అసలు వాసెలిన్‌ ని పొడిబారిన చర్మానికే కాకుండా చాలా రకాల సౌందర్యసాధనాలుగా వాడవచ్చు. వాసెలిన్‌ ని ఉపయోగించి అందమైన మృదువైన పెదాలను పొందవచ్చు అంతే కాదు ఇంకా మనకు తెలియని ఎన్నో రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అవేమిటో ఒక్కసారి చూసేద్ధామా... మరెందుకు ఆలస్యం ఆర్టికల్‌ లోకి ఎంటర్‌ అయిపోండి.


లిప్‌బామ్‌ 

సాదారణంగా వాసెలిన్‌ ని పెదాలకు లిప్‌బామ్‌గా ఉపయోగిస్తారు. పెదాలపైన వాసెలిన్‌ రాసుకొని మీకు నచ్చినట్లయితే లిప్‌స్టిక్‌ కూడా రాసుకోవచ్చు. మీ పెదాలపై డెడ్‌స్కిన్‌ ని కూడా తొలగించడంలో వాసెలిన్‌ ఉపయోగపడుతుంది. వాసెలిన్‌ ని పెదాలకు రాసుకుని కొంత సమయం గడిచిన తరువాత మృదువైన పాత టూత్‌ బ్రష్‌తో పెదాలను నెమ్మదిగా స్క్రబ్‌ చేసుకోవాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మృదువైన పెదాలు మీ సొంతం అవుతాయి.

మాయిశ్చరైజర్‌ 

పొడిబారిన చర్మానికి ఇది మంచి ఔషదమనే చెప్పాలి. మోచేతులు, మోకాళ్ళ వద్ధ చర్మం నల్లగా మారుతుంది. రోజూ వాసెలిన్‌ ని రాసుకుంటే మృదువైన చర్మం మళ్ళీ తిరిగి లభిస్తుంది. అంతేకాదు నైట్‌ పడుకునే ముందు శరీరానికి మాయిశ్చరైజర్‌ రాసుకుని పడుకోవడం వల్ల ఉదయం సూర్యకిరణాల వేడి నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

షేవింగ్‌ 

వాసెలిన్‌ ఉపయోగించి రేజర్‌ గ్లైడ్‌ సహాయంతో పల్చని గడ్డాన్ని సులభంగా షేవ్‌ చేసుకోవచ్చు.

గోర్లు

చాలా మంది మగువలకు గోర్లు పెంచడం వాటికి రకరకాల రంగులు వేయడం  అంటే చాలా ఇష్టం. అయితే ఇలా గోర్లకు నెయిల్‌ పాలిష్‌ వేయడం వల్ల గోర్ల మీద వాటి మచ్చలు ఉండిపోతాయి వాటిని తొలగించడంలో కూడా వాసెలిన్‌ జెల్లీ ఉపయోగపడుతుంది. నెయిల్‌ పాలిష్‌ని రిమాల్‌ చేసాక జెల్లీతో గోర్లను శుభ్రం చేస్తే అందంగా షైనింగ్‌ గా మారుతాయి.

క్లెన్సర్‌ 

రాత్రి పడుకునే సమయంలో మేక్‌ప్‌ని శుభ్రం చేసి పడుకోవడం చాలా మంచిది. కాటన్‌ బాల్‌ తో జెల్లీని తీసుకుని ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. అలాగే మెడ భాగాన్ని, చెవులను కూడా దూదితో శుభ్రంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా సున్నితంగా మారుతుంది. సన్‌బర్న్‌ నుండి చర్మాన్ని రక్షిస్తుంది.

ఐమేకప్‌ రిమూవర్‌

ఈ కాలంలో ఆడపిల్లలు కళ్ళకు మస్కారా అని ఐ లైనర్‌ అని రాసుకుంటున్నారు. వాటిని నిద్రపోయే ముందు శుభ్ర పరుచుకుని పడుకోవాలి. వాసెలిన్‌ ని దూదితో కొద్ధిగ తీసి నెమ్మదిగా కళ్ళపై ఉన్న మేకప్‌ని తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్ళపై పొడిబారకుండా మృదువుగా కాంతి వంతంగా ఉంటుంది.

బాడీ స్క్రబ్‌ 

ఈ స్క్రబ్‌ ని సులభంగా తయారుచేసుకోవచ్చు. కొద్ధిగ సముద్రపు ఉప్పు మరియు వాసెలిన్‌ ని కలపాలి. ఈ మిశ్రమాన్ని మృదువుగా శరీరం అంతా రాసి స్క్రబ్‌ చేయాలి.

 ఫేస్‌క్రీమ్‌

వాసెలిన్‌ ని రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసి పడుకోవడం వల్ల ముఖం చాలా కాంతివంతంగా మారుతుంది. మార్లిన్‌ మన్రో రోజు ఇలానే చేసేవారట. అలాగే కళ్ళ కింద ప్రదేశంలో వాసెలిన్‌ ని రాసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

కనుబొమ్మల ఎదుగుదలకు

చాలా మందికి కనుబొమ్మలు పల్చగా ఉంటాయి. అలాంటి వారు రోజూ పడుకునే ముందు కనుబొమ్మలకి వాసెలిన్‌ రాసుకుని పడుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల కనుబొమ్మలు వత్తుగా పెరుగుతాయి.

మెరిసే దంతాల కోసం

వాసెలిన్‌ జెల్లీ తో దంతాలను తుడవడం వల్ల దంతాలు మెరుస్తూ కాంతివంతంగా మారుతాయి.

డై మరకలు

చాలా మంది జుట్టుకు రంగు వేసుకుంటారు వాటి మరకలను సులభంగా తొలగించాలంటే వాసెలిన్‌ జెల్లీని ఉపయోగిస్తే సరి.

చెప్పులు కరవకుండా ఉండాలంటే

షూ, చెప్పులు కొత్తవిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది అలాంటి సమయంలో వాసెలిన్‌ ని కాలికి రాసుకుని ధరించడం వల్ల చెప్పులు కరవవు అలాగే ఎటువంటి మచ్చలు పడవు.

లాంగ్‌లాస్టింగ్‌ పరిమళం

ఎక్కువ సమయం పరిమళ భరితంగా ఉండాలంటే ఆ ప్రదేశంలో వాసెలిన్‌ రాసుకుని దానిపై పర్‌ప్యూమ్‌ కొట్టినట్లయితే చాలా సమయం పరిమళం వెదజల్లుతుంది.

0 comments:

Post a Comment