గులాబీ రంగు పెదవుల కోసం...


చక్కని గులాబీ రంగుతో కూడిన మృదువైన పెదవులు ఉండాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ కాలుష్యం, మన దైనందన దినచర్య, కఠినమైన పరిస్థితులు సరియైన జాగ్రత్తలు తీసుకోలేనంతగా మనల్ని ప్రభావితం చేస్తాయి.

పెదవులు గులాబీ రంగులో ఉండేందుకు కొన్ని లిప్ బాల్మ్ లు, లిప్ స్టిక్స్ ఉన్నాయి కానీ అవి మీ పెదవులకు హాని కలిగిచవచ్చు. కానీ కొన్ని గృహ సంబంధమైన స్క్రబ్స్ వలన మీ పెదవులు చక్కగా గులాబీ రంగులో ఆరోగ్యంగా ఉంటాయి.


గులాబీ రంగు పెదవుల కోసం కొన్ని చిట్కాలు

పాల క్రీం మరియు కుంకుమ

1 టేబుల్ స్పూన్ పాలు, 1 టేబుల్ స్పూన్ పాల క్రీం, కొంచెం కుంకుమను కలిపి ఫ్రిజ్ లో పెట్టుకుని మీ పెదవులకు రాసుకోవాలి. తర్వాత ఒక కాటన్ బాల్ తో తుడుచుకోవాలి.

పాలు మరియు గులాబీ రేకులు

1 టేబుల్ స్పూన్ పాలు అలాగే కొన్ని గులాబీ రేకుల్ని తీసుకుని పాలల్లో బాగా గులాబీ రేకుల్ని క్రష్ చేయాలి. తర్వాత దీనిని ఫ్రిజ్ లో చల్లగా అయ్యేంత వరుకూ ఉంచాలి. తర్వాత దానిని తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్ పవ్డర్ వేసి పేస్ట్ గా చేసుకుని ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవాలి. 10- 15 నిముషాలు అలాగే ఉంచుకుని పొడి దూదితో తుడుచుకోవాలి. దీనివల్ల మీ పెదవులు గులాబీ రంగుతో, మృదువుగా, ప్రకాశవంతంగా మారతాయి.
అలాగే పాలల్లో గులాబీ రేకుల్ని బాగా మిక్స్ చేసి తర్వాత కొంతసేపు ఉంచి తర్వాత ఆ పేస్ట్ ని పెదవులకు వేసుకోవచ్చు. అలాగే పాలకు బదులు మీరు గ్లిసరిన్ కూడా వాడవచ్చు.

బీట్రూట్ తో పాల క్రీం

బీట్రూట్ తో పాల క్రీం ను కలిపి మిశ్రమం గా చేసుకోవాలి. లేద దానిమ్మను కూడా క్రీం తో కలిపి మిశ్రమం గా చేసి పెదవులకు వేసుకుంటే అది చక్కటి మృదువైన పెదవుల్ని ఇస్తుంది. పగిలిన పెదవులు సైతం మారి చక్కటి గులాబీ రంగు పెదవులుగా మారతాయి.

తేనె మరియు నిమ్మ

తేనె చక్కటి అన్ని రకాల చర్మాలకూ పడే పదార్ధం. దీనిని మీ పెదవుల సమ్రక్షణకు కూడా వాడవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ తేనె అలాగే దీనిలో 1/2 టేబుల్ స్పూన్ నిమ్మ రసాన్ని కలుపుకోవాలి. తర్వాత మీ పెదవులకు వేసుకోవాలి. కొంత సమయం అయ్యక చల్లటి నీటితో కడుగుకోవాలి. తర్వాత మీ జీవం లేని పాలిన పెదాలు గులాబీ రంగులోనికి మారటం గుర్తించవచ్చు.

టొమాటో మరియు పాల క్రీం

మిల్క్ క్రీం లో టొమాటో పేస్ట్ ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు రాసుకోవాలి. గులాబీ రంగు పెదవుల పొందాలంటే నెయ్యి లేదా వెన్న లేదా కుంకుమలు సహజ సిధ్ధమైన చికిత్సా మార్గాలు.

ఎండు ద్రాక్షా

చక్కని పెదవులకోసం ఆయుర్వేదంలో టిప్స్ ఉన్నాయి. దానిలో ప్రధానమైనది ఎండు ద్రాక్షాలని రాత్రి అంతా నాన పెట్టి ఉదయాన్నే పరగడుపుతో తింటే పెదవులు ఎంతో చక్కగా మారతాయి.

క్యారెట్ జ్యూస్

బీట్రూట్ జ్యూస్ లాగే క్యారెట్ జ్యూస్ కూడా మీ పెదవులను చక్కగా మారుస్తుంది. ఒక క్యారెట్ ను తీసుకుని దానిని గుజ్జుగా చేసి ఆ రసాన్ని పెదవులకు రాసుకుంటే మంచిది. మీ పెదవులు పొడిబారినప్పుడల్లా ఈ జ్యూస్ ను రాసుకుంటే చక్కటి మృదువైన, గులాబీ పెదవులు మీ సొంతం అవుతాయి.

దోస ముక్కలు

దోస ముక్కల్ని మీ పెదవులకు రాసుకుంటే ఎంతో బాగా పని చేస్తాయి. ఇవి చర్మం పైనే కాదు చక్కటి పింక్ పెదవుల్ని మీ సొంతం చేస్తాయి. కొన్ని నిముషాలపాటు పెదవులపై రాస్తే ఎంతో మంచిది. దోస ముక్కల్ని ఇలా ఎక్కువ సార్లు రాస్తూ ఉంటే త్వరగా మీకు ఫలితం కనిపిస్తుంది.

ఆరెంజ్ తొక్కలు

ఆరెంజ్ తొక్కలు తీసి పారేస్తున్నారా? అయితే ఆగండి ఇకపై అలా చేయకండి ఎందుకంటే ఇవి మీ పెదవుల మృదుత్వాన్ని పెంచుతాయి. అంతేకాక మీ డార్క్ పెదవుల్ని మార్చి ప్రకాశవంతంగా చేస్తాయి. మీ పెదవులపై వాటిని రెండు నిముషాల పాటు మస్సాజ్ చేసుకోండి..తర్వాత ఫలితాల్ని మీరే చూడండి.

ఆలివ్ ఆయిల్

ఆయిల్స్ మంచి గులాబీ రంగు పెదవుల్ని పొందేలా చేస్తాయి. మంచి గులాబీ రంగు పెదవుల కోసం ఆలివ్ ఆయిల్, తేనె, నిమ్మ ను కలిపి వాడితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాక ఇది ఒక బాల్మ్ లా రోజూ మీరు రాసుకోవచ్చు.

మింట్ జ్యూస్

మింట్ జ్యూస్ తో పాటు రోస్ వాటర్ ను కలిపి రాసుకుంటే మీ పెదవులు కొత్త రూపు పొందుతాయి. మింట్ జ్యూస్ ఎక్కువ మోతాదు కాకుండా చూసుకోవాలి..ఎందుకంటే అది వేడి చేసే ప్రమాదముంది.

సుగర్ స్క్రబ్

మీ పెదవులకు సుగర్ మరియు వెన్న కలిపి రాసుకుంటే ఎంతో మంచి ఫలితాలొస్తాయి. సుగర్ మీ చర్మం పై ఉన్న మృత కణాల్ని తీసి వేయగా.. వెన్న మీ పెదవులకు కొత్త జీవాన్ని ఇచ్చి మృదువుగా చేస్తుంది.

పసుపు స్క్రబ్

ముందుగా పసుపు తీసుకుని దానితో పాటు పాలు కలిపి మిశ్రమం గా చేసుకుని తర్వాత దానిని ఒక మెత్తటి బ్రష్ తో మస్సాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకుని పొడి టవల్ తో తుడుచుకోవాలి. తర్వాత సహజసిధమైన లిప్ బాల్మ్ రాయాలి.

నిమ్మ

నిమ్మలో చాలా రకాలైన సహజసిధ్ధ రసాయనాలు ఉన్నాయి. ఇది సహజ సిధ్ధమైన బ్లీచ్. ఇది పెదవులపై ఎంతో చక్కగా పనిచేస్తుంది. రోజూ తాజా నిమ్మకాయను తీసుకుని రాత్రి నిద్రపోయే ముందు మస్సాజ్ చేసుకోవాలి.

0 comments:

Post a Comment