స్కిన్ ట్యాగ్ తొలగించుకోవటానికి చిట్కాలు

శరీరంలో ఏదైనా బాగంలో చర్మం అధికంగా పెరిగితే చర్మ టాగ్లు అని పిలుస్తారు. స్కిన్ టాగ్లు అపాయకరం కాని కణితులు మరియు ఇవి తరచుగా మెడ చర్మం మడతలు, బాహుమూలము మరియు తొడలలో పెరుగుతాయి. అంతేకాక ఇవి కనురెప్ప, ముఖం లేదా చేతుల సమీపంలో ఆకస్మికంగా పెరిగి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వీటి పెరుగుదలకు ఎటువంటి  ఖచ్చితమైన కారణం లేదు. అయితే జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు, అలెర్జీలు మరియు స్థూలకాయం వంటివి కారణాలుగా చెప్పవచ్చు. వీటిని కొన్ని ఇంటి నివారణల ద్వారా తొలగించవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఆపిల్ సైడర్ వెనిగర్


ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మ టాగ్లు తొలగించుకోవటానికి ఒక మంచి పరిష్కారం. మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బుతో శుభ్రం చేసి పొడిగా తుడవాలి. ఒక కాటన్ బాల్ ని ఆపిల్ సైడర్ వెనిగర్ లో ముంచి ప్రభావిత ప్రాంతంలో వృత్తాకార మోషన్ లో రాయాలి. ఈ విధంగా ప్రతి రోజు అనేక సార్లు రాస్తే మంచి పలితం కనపడుతుంది.

టీ ట్రీ ఆయిల్


పురాతన కాలం నుండి టీ ట్రీ ఆయిల్ ని చర్మ  టాగ్లు మరియు అనేక చర్మ సమస్యల చికిత్సలో వాడుతున్నారు. మొదట ప్రభావిత ప్రాంతాన్ని సబ్బు నీటితో శుభ్రపరచి పొడిగా తుడవాలి. ఒక గ్లాస్ నీటిలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో  వృత్తాకార మోషన్ లో రాయాలి. ఈ విధంగా ఒక వారం పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

నిమ్మరసం


నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం ఉండుట వలన క్రమం తప్పకుండా ఒక వారం పాటు ఉపయోగిస్తే మంచి పలితం కనపడుతుంది. తాజా నిమ్మరసాన్ని పిండి కాటన్ బాల్ సాయంతో ప్రభావిత ప్రాంతంలో రాయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ విధంగా చేస్తే మంచి పలితం కనపడుతుంది.

అరటి తొక్క


అరటి తొక్క చర్మ టాగ్లు ని తొలగించటానికి మరొక సమర్థవంతమైన మార్గం. ప్రభావిత ప్రాంతం మీద నిదానంగా తొక్క లోపలి వైపు నుండి రుద్దాలి. మరింత సమర్ధవంతమైన పలితం రావాలంటే రాత్రి పడుకొనే సమయంలో రాతి తొక్కను ప్రభావిత ప్రాంతంలో పెట్టి బెండెజ్ సాయంతో కట్టు కట్టాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

దారం సాయంతో లాగుట


ఇది ఏదైనా శరీర బాగం నుండి చర్మ ట్యాగ్ తొలగించటానికి ఒక ప్రసిద్ధ పరిహారంగా ఉంది. సాధ్యమైనంత శరీరానికి దగ్గరగా చర్మ ట్యాగ్ యొక్క ఆధారం మీద దారం చుట్టి గట్టిగా ముడి వేయాలి. క్రమంగా చర్మ ట్యాగ్ పరిమాణంలో చిన్నదిగా అయి చివరికి ఊడిపోతుంది.

బేకింగ్ సోడా మరియు ఆముదము


బేకింగ్ సోడా మరియు ఆముదము మిశ్రమం చర్మ ట్యాగ్ తొలగించటానికి మరొక సమర్ధవంతమైన పరిహారం అని చెప్పవచ్చు. బేకింగ్ సోడా మరియు ఆముదమును పేస్ట్ గా చేసి రాత్రి సమయంలో ప్రభావిత ప్రాంతంలో రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మ ట్యాగ్ వదిలించుకోవటానికి ప్రతి రోజు ఈ  విధానాన్ని చేయాలి.

కలబంద


ఉల్లిపాయ రసం, పైనాపిల్ రసం, కలబంద  జెల్ మరియు వెల్లుల్లి రసం రాస్తే చర్మ టాగ్లు తొలగించడానికి బాగా సహాయపడతాయి.

0 comments:

Post a Comment