మనిషి తినే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర బాగాలకు పోషణ అందిస్తుంది. అందువల్ల మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి మీ మనస్సు, ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.చాలామంది బోజనం చేసిన తరువాత ఏదో ఒకటి తింటూ ఉంటారు. కొంత మంది నడుస్తారు, టీ తాగుతారు, ఏదోఒక స్నాక్స్ తింటూ ఉంటారు, అలా చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యమే మహాబాగ్యం. మనం తినేది సంతోషంగా జీవితాంతం జీవించడం కోసం. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే మంచి ఆహారం తీసుకోవాలి.
ఆహారాన్ని తీసుకున్న తరువాత చేయకూడని పనులు ఏంటో చూద్దాం.
1.బోజనం చేసిన తరువాత పొగతాగ కూడదు. బోజనం చేసిన తరువాత తాగడం వలన ఒక సిగరెట్ పది సిగరెట్స్ తో సమానం. కాని అదే అలవాటు గా మార్చుకుంటే మాత్రం క్యాన్సర్ బారిన పడకతప్పదు అంటున్నారు నిపుణులు.
2.బోజనం తిన్నవెంటనే పళ్ళు తినాలని చాలా మంది చెప్తుంటారు. నిజానికి అది మంచి ఆలోచన కాదు అంటున్నారు నిపుణులు. అన్నీ పళ్ళు బోజనం తరువాత తినరాదు. కొన్ని జీర్ణక్రియకు సహాయపడే పండ్లు ఉంటాయి వాటిని తినడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. కాని కొన్ని పళ్ళు తినడడం వలన పొట్టలోకి గాలి చేరుకుంటుంది.
3.బోజనం చేసిన తరువాత టీ మరియు కాఫీలను తాగకూడదు. కాఫీలో కెఫిన్ వల్ల జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. టీ, కాఫీలను తాగాలి అనుకునేవారు బోజనం చేసిన ఒక గంట తరువాత తాగడం మంచిది.
4.బోజనం తరువాత స్నానం చేయాలి అనుకునేవారు కచ్చితంగా 30 నిమిషాలు వేచి ఉండాల్సిందే జీర్ణక్రియ జరగాలంటే రక్త ప్రసరణ చాలా అవసరం. తిన్న వెంటనే స్నానం చేయడం వలన చేతులకు, కాళ్ళకు రక్త ప్రసరణ బాగా జరిగి పొట్ట ప్రాంతంలో తగ్గుతుంది. దానివల్ల జీర్ణక్రియ అవడానికి కష్టం అవుతుంది.
5.మనం బోజనం చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంటే బెల్ట్ లూజ్ చేసుకోవచ్చుకదా.. అని సలహాలు వింటుంటాం. కాని అది సరైన పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. అలా బెల్ట్ ని లూజ్ చేసుకోకూడదట. లూజ్ చేయడం వల్ల పొట్టలో లేదా పేగులో ఇరుక్కుపొయిన ఆహారం సరిగా జీర్ణం కాదు అంటున్నారు నిపుణులు.
0 comments:
Post a Comment