వింత ప్రదేశాలు


ఈ గురుత్వాకర్షణ సిద్దాంతానికి  వ్యతిరేకంగా మన దేశంలో కొన్ని ఆశ్చర్యకరమైన వింత ప్రదేశాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్ధాం.
1.మహాబలిపురం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మహాబలిపురంలో ఒక రాయి చాలా వింతగా గురుత్వాకర్షణ శక్తికి విరుద్ధంగా ఉంటుంది.ఈ రాయిని 1908లో మద్రాస్‌ గవర్నర్‌ ఆ రాయిని 7 ఏనుగుల సాయంతో తీసేయాలని ట్రై చేసారట. కానీ ఆరాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు. శ్రీ కృష్ణుడి వెన్నని దొంగలిస్తాడనే భయంతో కొందరు తమ వెన్నను ఈ రాయిలో దాచుకున్నారట. అప్పటి నుండి ఈ రాయి కదల లేదని అలాగే నిలిచిపోయిందని అక్కడివారు చెప్తుంటారు.
2.రామసేతు వద్ధ సముద్రంపై రాళ్ళను వేస్తే అవి వింతగా నీటిలో తేలుతాయట. అయితే ఒకప్పుడు రాళ్ళు మునిగిపోయేవట. కానీ లంకకు వెళ్ళడానికి రాముడు వానర సైన్యంతో సముద్రంపై రామసేతు నిర్మాణం చేపట్టాడు. ఆ సమయంలో వానర సైన్యం అంతా ఆ రాళ్ళపై శ్రీరామ అని రాశారట. అందుకే ఆ రాళ్ళు మునిగిపోవడం లేదని కొంతమంది అంటుంటారు.
3.పూణెలోని హజ్రత్‌ కమర్‌ అలీదర్వేష్‌ దర్గాలో ఈ రాయిని చూడవచ్చు. ఈ రాయికి 800 ఏళ్ళ క్రితం కమర్‌ అలీ అనే సన్యాసి శాపం పెట్టాడట. అతని పేరు చెప్తేగానీ ఆ రాయిని ఎత్తలేరట. కచ్చితంగా అతని పేరు చెప్పాల్సిందే అని అక్కడి భక్తులు చెప్తున్నారు.70 కిలోల బరువున్న రాయిని ఎవరూ లేపలేరు. కానీ 11 మంది భక్తులు ఆరాయి చుట్టూరు నిలబడి వారి చూపుడు వేళ్ళను ఆ రాయిపై పెట్టి ఋషి పేరు చెబితే ఆ రాయి అమాంతం గాలిలోకి లేస్తుందట.
5.మణిపూర్‌లో ఉండే లోక్‌టక్‌ సరస్సులో ఇలాంటి అద్భుతాన్ని చూడొచ్చు. ఈ సరస్సులోని ద్వీపాలు నీటిపై తేలుతాయి ఒక్కో ద్వీపం ఒక్కో ఆకారంలో కనువిందు చేస్తుంది.

0 comments:

Post a Comment