ఏ ఆహారపదార్ధాలు మనకు ఏ విధం గా మేలు చేస్తాయి?


రోజు మనం రకరకాల కూరగాయలు పళ్ళు తింటూ ఉంటాం. అయితే ఏ ఆహారపదార్ధాలు మనకు ఏ విధం గా మేలు చేస్తాయో మనలో అందరికీ కాకపోయినా కొంతమంది కి తెలియదు. మనం తినే కొన్ని ఆహారపదార్థాలు మనకు ఏ రకంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామా...

కీరదోస:

కీర దోస లో ఉండే సిలికాన్, సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. అలాగే  కంటి  క్రింది నల్లని  వలయాలను  అరికట్టడం లో ఉపయోగ పడతాయి.

అల్లం:

అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికి తెలిసిందే. అయితే ఎక్కిళ్ళు తగ్గినప్పుడు అల్లం తినడం వల్ల తగ్గుతాయట. అలాగే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది. అంతే కాదు మలబద్దకం కూడా వదిలిస్తుంది.

ఉలవలు:

ఉలవలు ఊబకాయాన్ని తగ్గించడం లో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మామిడి పళ్ళు:

మామిడి పండు కి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉందట.

జామకాయ:

జామపళ్ళు ఎక్కువ గా తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వాము:

వాము తినడం వల్ల దంత వ్యాధులు తగ్గుతాయి.

నేరేడు పళ్ళు:

నేరేడు పళ్ళు తినడం వల్ల కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

టొమాటాలు:

ప్రోస్టేట్ కాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటాలకు ఉంది

0 comments:

Post a Comment