టీ ఎక్కువ గా తాగితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మీకు తెలుసా ?


టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? కొంత మందికి అయితే ప్రాణం అని చెప్పాలి. ఎందుకంటే ఉదయం, సాయంత్రం గొంతులోకి టీ పడితే తప్ప వారికి  ఆరోజు పూర్తవ్వదు. మరైతే ఇంతగా అలవాటు అయినా టీ ని తాగడం మంచిదా? చెడ్డదా? అనే విషయం చాలా మంది ని వేధిస్తుంది. టీ ప్రియులకు ఈ విషయం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ  టీని తాగడం వల్ల సైడ్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం.

మితంగా తీసుకునే వరకూ ఏ ఆహార పానియాలైనా అమృతంతో సమానమే. అమితంగా తీసుకుంటే మాత్రం విషమే..అటువంటి ఆహారపానియాల్లో 'టీ'  ఒకటి. అయితే టీని ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు కన్నా హానే ఎక్కువ జరుగుతుంది అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. కాబట్టి, మీరు టీ ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉంటే  వెంటనే తగ్గించుకోవడం మంచిది. అసలు టీ తాగడం వల్ల  ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలుసుకుందాం.. టీని తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని తెలుసుకోవాలని ఉందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఆర్టికల్ లోకి ఎంటర్ అయిపోదామా ...

నిద్రలేమి

ఎక్కువగా టీ తాగడం వల్ల  అందులో ఉండే కెఫిన్ కొంత వరకూ శరీరానికి మేలు చేసినా, కొంత మందిలో మాత్రం చాలా డిఫికల్ట్ గా పనిచేస్తుంది. ఎక్కువ టీ, లేదా ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల రెస్ట్ లెస్ నెస్ గా ఫీలవుతారు. వీరిలో ఆందోళన, హార్ట్ రేట్ పెరుగుతుంది, అలాగే నిద్రలేమి సమస్యలతో బాధపడుతారు.

తలనొప్పి, అలసట

టీ తాగే  అలవాటు కొంతమంది లో కొన్ని సంత్సరాల నుండి ఉండడం వల్ల మానసిక సమస్యలు ఎదురవుతాయి. అందులో ముఖ్యంగా టీ తాగకపోతే తలనొప్పి, అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనబడుతాయి.

స్కెలిటల్ ఫ్లోరోసిస్

ఎక్కువగా టీ తాగడం వల్ల అత్యంత ప్రమాధకరమైన ఆరోగ్య సమస్య స్కెలిటల్ ఫ్లోరోసిస్. ఇది ఒక బోన్ డిసీజ్. టీలో ఫ్లోరైడ్ అధికంగా ఉండటం వల్ల, టీని ఎక్కువ సార్లు తాగడం వల్ల శరీరంలో ఫ్లోరైడ్ టాక్సిసిటి ఎక్కువ అవుతుంది. టీని ఎక్కువ సార్లు తాగడం వల్ల బాధాకరమైన బోన్ డిసీజ్ కు కారణమవుతుంది.
అందువల్ల సాధ్యమైనంత వరకు టీ ని మితం గా తాగాలి

ప్రొస్టేట్ క్యాన్సర్

ఎక్కువగా టీ తాగడం వల్ల ఎదురయ్యే సమస్య ప్రొస్టేట్ క్యాన్సర్. ఒక రోజులో 4నుండి 5,6 కప్పుల టీ తాగే వారిలో 50శాతం ప్రొస్టేట్ క్యాన్సర్ పెరుగుతున్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనల్లో తెలిసింది. అదే విధంగా ఈ సమస్య డైట్ ఇంకా  మొదలగు కారణాల వల్ల సంభవిస్తుంది.

గర్భ స్రావం జరిగే అవకాశం ఉంది

గర్భిణీలు బ్లాక్ టీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు, టీలో ఉండే కెఫిన్ కంటెంట్ పొట్టలో పెరిగే ఫీటస్ మీద ప్రభావం చూపుతుంది. గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. గర్భం కోసం ప్లాన్ చేసుకునే వారు కాఫీ, టీలను పూర్తిగా మానేయడం చాలా మంచిది.

కిడ్నీ సమస్యలు

టీ ఎక్కువగా తాగే చాలా మంది లో  కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. సాధరణ టీ అయినా, ఐస్ టీ అయినా ఏదైనా సరే కిడ్నీఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందట . ఇటీవల అమెరికాలో 56ఏళ్ళ వయస్సున్న వారి మీద జరిపిన పరిశోధనల్లో ఈ విషయం నిరూపించబడింది.

జీర్ణ సమస్యలు

చాల మంది బ్లాక్ టీ తాగుతుంటారు. బ్లాక్ టీలో ఉండే కెఫిన్ వల్ల పొట్టలో అసిడిక్ ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుంది. వీటిని శరీరం సరిగా గ్రహించకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట సమస్యలు, అల్సర్ తో బాధపడే వారు బ్లాక్ టీ తాగకపోవడం ఆరోగ్యానికి మంచిది.

గుండె సమస్యలు ఉన్నవారు

హార్ట్ సమస్యలున్నవారు , కార్డియోవాస్కులర్ డిజార్డర్ ను చికిత్స తీసుకుంటున్న వారు బ్లాక్ టీని తీసుకోకపోవడమే ఉత్తమం. టీలో ఉండే కెఫిన్ కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ కు సెట్ కాకపోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. అందుకే  బ్లాక్ టీ కి దూరం గా ఉండడం మంచిది.

చూసారుగా టీ తాగడం వల్ల ఎన్ని సమస్యలు తలెత్తుతాయో.. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. కాబట్టి  మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. టీ తాగే అలవాటు ఉంటే మితం గా తాగండి. లేదా పూర్తిగా మానేస్తే మరీ మంచిది.

0 comments:

Post a Comment