చుండ్రును తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలు

చాలా మందిని చుండ్రు సమస్య వేదిస్తుంటుంది.చుండ్రు అంటే స్కాల్ప్ పై పొడిగా, జిగురుగా ఏర్పడే పొర. దీనికి కారణాలు బ్యాక్టీరియా, ఫంగస్ వీటి వల్ల స్కాల్ప్ పై పేరుకుపోయి చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ సమస్య నుంచి  బయటపడాలనుకుంటే చాలా రకాలైన సహజసిధ్ధగృహ చిట్కాలు ఉన్నాయి. వాటి వల్ల చుండ్రును ఏవిధమైన ఇబ్బంది లేకుండా తొలగించుకోవచ్చు. చుండ్రుని తొలగించుకునేందుకు కొన్ని చక్కని గృహ చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం...

చుండ్రును తొలగించుకునేందుకు కొన్ని చిట్కాలు:

బంతి, కొబ్బరి నూనె

ముందు 50 గ్రాములు బంతి ఆకుల్ని తీసుకుని వాటికి 250 మి.ల్లీ కొబ్బరి నూనె కలిపి స్టవ్ పై ఉడికించాలి. దీనిలో 2 చిటికెడుల కర్పూరం వేయాలి. అలా 15 నిముషాల పాటు ఉడికించాక ఒక బౌల్ లో దానిని తీసుకోవాలి. ఇక రోజూ ఈ ఆయిల్ ను రాసుకోవాలి. కర్పూరం లో ఔషధ గుణాలు ఫంగల్ కు వ్యతిరేకంగా పని చేసి ఇంఫెక్షన్స్ రాకుండా కాపాడుతాయి. 

మెంతులు

మెంతులు చుండ్రును తొలగిస్తాయి. 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని తీసుకుని రాత్రి అంతా నానపెట్టి పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకుని వాటికి 2 టేబుల్ స్పూన్స్ ఆపిల్ సైడర్ ను వెనిగర్ ను కలుపుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని తలకు పట్టించుకోవాలి. ఆపిల్ సైడర్ లేకపోతే మీరు నిమ్మ రసాన్ని వేసుకోవచ్చు.

పెసరపప్పు, ఆలివ్ ఆయిల్

2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 4 టేబుల్ స్పూన్స్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ను ఒక బౌల్ లో వేసుకుని కలుపుకోవాలి. తర్వాత తలకు పట్టించాలి. ఇలా 15 నిముషాల పాటూ ఉంచుకుని చల్లని నీటితో కడుగుకోవాలి. ఇవి మన కిచెన్ లో ఉండేవే కాబట్టి మీరు తరచుగా పెట్టుకోవచ్చు.

బేకింగ్ సోడ, నీరు

2 టేబుల్ స్పూన్స్ బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్స్ నీటిని తీసుకోవాలి. వీటిని చక్కగా మిక్స్ చేసి తలకు పట్టించాలి. బేకింగ్ సోడ వల్ల తలపై ఉన్న చుండ్రు అట్టలు అట్టలుగా మొత్తం రాలిపోతుంది. బేకింగ్ సోడా ఇలా చాలా చక్కగా పని చేస్తుంది. అంతేకాదు ఒక్కసారో రెండుసార్లో వాడినంత మాత్రాన ఫలితాలు ఆశించవద్దు. ఇలా తరచూ చేస్తేనే మంచి ఫలితాలుంటాయి.

నిమ్మకాయ

సాధారణంగా నిమ్మకాయ ఓ మంచి దివ్య అవ్షధం. అంతేకాక యాంటీ సెప్టిక్ కూడా. కాబట్టి తలపై చుండ్రు ఎక్కువగా ఉండి దురద మిమ్మల్ని బాధిస్తే 3 టేబుల్ స్పూన్స్ నిమ్మ రసాన్ని తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానా మట్టిని కలిపి స్కాల్ప్కు పెట్టుకోవాలి. ఇలా వారానికి ఒకసారి పెట్టుకోవటం ఎంతో మంచిది.

ఆపిల్ సైడర్, వెనిగర్

మీ ఇంట్లో ఆపిల్ సైడర్ దొరుకితే అది ఖచ్చితంగా చుండ్రుని తొలగిస్తుంది. కాకపోతే ఆపిల్ సైడర్ ను తిన్నగా తలకు పెట్టేయరాదు. దానికి నీటిని కలపాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆపిల్ సైడర్ వెనిగర్ తో పాటు 3 టేబుల్ స్పూన్స్ మంచినీటిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు పెట్టుకోవాలి. అయితే వాష్ చేసుకునే ముందు కాటన్ బాల్ తో స్కాల్ప్ ని తుడుచుకోవాలి.

తల దురదకు అలోవేరా

మీ తలలో చుండ్రు వల్ల బాగా దురద వస్తే దానికి అలోవేరా బాగా పనిచేస్తుంది. అలోవేరా ప్రతీ ఇంట్లో ఉండే మొక్కే. కాబట్టి అలోవేరా ఆకుల్ని తీసుకుని దాని మధ్యలో ఉండే జెల్ ను తీసుకుని దానిని స్కాల్ప్ కి రాసుకోవాలి. తర్వాత కొంతసేపు ఆగాక వాష్ చేసుకోవాలి.

వెనిగర్

వెనిగర్ ఒక నేచురల్ యాసిడ్. దీనిని సరిపడే శాతంలో నీటితో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు కాటన్ సాయంతో స్కాల్ప్ కి రాసుకోవాలి. వెనిగర్ చుండ్రుని తొలగించటంలో బాగా పని చేస్తుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్ మీ చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్ర పోషించగలదు. ఆలివ్ ఆయిల్ ను రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి. తర్వాతా వేచ్చటి టవల్ ను తలకు చుట్టుకోవాలి. స్కాల్ప్ పై వేళ్ళతో మాత్రమే సుతిమెత్తగా మస్సాజ్ చేసుకోవాలి. ఎందుకంటే అతిగా రబ్ చేయటం వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదముంది.

కొబ్బరినూనే

కొబ్బరిలో చాలా యాంటీ ఫంగల్ తత్వాలున్నాయి. ఇవి చుండ్రు పై అధ్భుతంగా పని చేస్తుంది. రోజూ తలకు పట్టించిన తర్వాత తలను మస్సాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల చుండ్రు పోతుంది.

పెరుగు

పెరుగు అదీ 3-4 రోజులు పులిసిన పెరుగు చుండ్రును తొలగించగలదు. అందుచేత పెరుగును స్కాల్ప్ కు పట్టించి 20 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా ఎప్పుడో ఒకసారి చేయటం వల్ల సమస్య పోదు. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితాలోస్తాయి.

నివారణకు లిలాక్

చుండ్రు లిలాక్ యాంటీ ఫంగల్ ప్రాడక్టు. దీన్ని నీం అని కూడా అంటారు. ఇది స్కాల్ప్ పై ఉన్న ఫంగస్ను అలాగే బ్యాక్టీరియాపై బాగా పనిచేస్తుంది. మీకు గనకు బాగా ఇట్చింగ్ అంటే దురద గనక ఎక్కువగా ఉంటే దీనిని స్కాల్ప్ పై రాసుకుంటే అది తొలగిస్తుంది.

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ తలపై చక్కగా పనిచేస్తుంది. లావెండర్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆల్మండ్ ఆయిల్ స్కాల్ప్ పై చక్కగా పని చేస్తుంది. ఆయిల్ రాసుకుని సర్క్యులర్ పొజిషన్లో మస్సాజ్ చేసుకుంటే చాలా చక్కగా చుండ్రును తొలగిస్తుంది.

టొమోటో జ్యూస్

టొమోటో జ్యూస్ పీహెచ్ సమతుల్యతను ఉంచేందుకు ఉపయోగపడుతుంది. టొమోటో జ్యూస్ లో ఉండే పోషకాలు చర్మంపై చక్కగా పనిచేస్తాయి. టొమోటో జ్యూస్ ను తలకు పట్టించి తర్వాత చక్కగా మస్సాజ్ చేసుకోవాలి. దీనిని ఒక గంట ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

అల్లం

అల్లం తో నువ్వుల నూనే కలిపి తలకు రాసుకుంటే అది చుండ్రును నివారిచగలదు. ఇది వెంట్రుకల పెరుగదలకు అలాగే ఊడతాన్ని, చుండ్రును తగ్గిస్తుంది. ఆయిల్ ను తలకు పట్టించి మస్సాజ్ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత వాష్ చేసుకోవాలి.

చుండ్రు నివారణకు హెన్నా

హెన్న(గోరింటాకు) చుండ్రును సమర్ధవంతంగా తొలగించగలదు. ఇది యాంటీ బ్యాక్టీరియా కండీషనర్ గా కూడా పని చేస్తుంది. హెన్న తీసుకుని దానిలో కొన్ని చుక్కలు నిమ్మ రసాన్ని అలాగే ఆలివ్ ఆయిల్ ను కలిపి తలకు పట్టించుకోవాలి. ఒక గంట పాటు ఉంచుకుకున్న తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రును తొలగించటంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది.

తులసి ఆకులు

తులసి ఆకు అన్ని విధాల శ్రేష్టమైనది. అందుకే ప్రతీ ఇంటా భక్తి పరంగా కావచ్చు. ఓ మంచి ఔషధం గా కావచ్చు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియా అలాగే యాంటీ ఫంగల్ తత్వాలు ఉన్నాయి. తులసి ఆకులకు ఒక టేబుల్ స్పూన్ ఆంల ఆకుల్ని తీసికుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. 30 నిముషాల పాటూ ఉంచుకుని తర్వాత వాష్ చేసుకోవాలి.

కోడిగ్రుడ్డు

కోడిగ్రుడ్డులో పోషకాలు చాలా ఉన్నాయి. ఇది తలపై చక్కగా పని చేస్తుంది. ఒక గ్రుడ్డు ని తీసుకుని పగలగొట్టి దానిని తలకు పెట్టుకుని ఒక గంట ఆగాక వాష్ చేసుకోవాలి. ఇలా ప్రతీ 3 రోజులకోసారి చేయాలి.

ఆస్పిరిన్

ఆస్పిరిన్ టాబ్లెట్ చుండ్రుకు బాగా పని చేస్తుంది. ఒక ఆస్పిరిన్ టాబ్లెట్ ను తీసుకుని దానిని ఒక రుమాలు(కట్చీఫ్) లో చుట్టి దానిని విరగగొట్టలి. అలాగే ఆ కట్చీఫ్ లోనే పొడిగా చేసుకోవాలి. ఆ పొడిని నీటిలో కలుపుకొని తలకు రాసుకోవాలి . 2 నిముషాలు మాత్రమే ఉంచి తర్వాత వాష్ చేసుకోవాలి. 

తేలికపాటి షాంపూ 

తేలికపాటి షాంపూలనే వాడాలి. ఎందుకంటే రసాయనాలు ఎక్కువ ఉండటం వల్ల అవి స్కాల్ప్ పై చాల దుష్ఫలితాలు చూపించే అవకాశం ఉండీ అలాగె బాగా ఎక్కవగా మరిగిన వేడి నీటిని వాడరాదు. దీని వల్ల కూడా చుండ్రు వచ్చే అవకాశాలున్నాయి.

0 comments:

Post a Comment