మీ ఇంట్లో బొద్దింకలున్నాయా అంటూ ఎన్నో ప్రకటనలు చూస్తుంటాం ఇవి వాడండి అవి వాడండి అంటూ చెప్తుంటారు. ఇల్లును ఎంత శుభ్రం గా ఉంచినప్పటికీ ఏ మూల నుండి ప్రవేశిస్తాయో కానీ మనల్ని విసిగిస్తుంటాయి.. ముఖ్యంగా వంట గదిలో బొద్దింకల సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ చేరిపోయి ప్రతి మూల, ప్రతి పాత్ర ప్రతి చోట దర్శనమిస్తూ మనలను చిరాకు పెట్టేస్తాయి. అంతే కాక బోలెడు రోగాలను కలిగిస్తాయి..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే రసాయనాలు వాడడానికి కొంత ఇబ్బందే. అలాంటప్పుడే బొద్దింకలను తరిమి కొట్టడానికి సహజ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అందులో ప్రధానంగా దోసకాయ గురించి చెప్పుకోవాలి. దానివలన బొద్దింకలు ఎలా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే రసాయనాలు వాడడానికి కొంత ఇబ్బందే. అలాంటప్పుడే బొద్దింకలను తరిమి కొట్టడానికి సహజ పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అందులో ప్రధానంగా దోసకాయ గురించి చెప్పుకోవాలి. దానివలన బొద్దింకలు ఎలా పోతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
- దోసకాయల ద్వారా మీ కుటుంబసభ్యుల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలుగకుండా బొద్దింకలను పారద్రోలవచ్చు. ఇది బొద్దింకలను తొలగించడానికి ఒక సులభమైన, సమర్థవంతమైన మార్గంగా చెబుతారు. దోసకాయలు బొద్దింకలకు వ్యతిరేకంగా ఒక అవరోధం వలె పనిచేస్తుంది. తద్వారా హానికరమైన సూక్ష్మజీవుల వృద్ధిని నిలిపివేస్తుంది.
- దోసకాయల వాసన బొద్దింకలను దూరంగా ఉంచటానికి సహాయపడుతుంది. అయితే బొద్దింకలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ముఖ్యంగా కిచెన్ లో మూలలు, సింక్ కింద ఇలా కొన్ని చోట్ల కొన్ని దోసకాయ ముక్కలు పెట్టాలి.
- దోసకాయ ముక్కలే కాకుండా దోసకాయ తొక్కలు కూడా బొద్దింకలను నివారించడంలో తోడ్పడతాయి.
- దోసకాయ తరిమి తొక్కతీసి ఆ తొక్కలను ఒక అల్యూమినియం రేకు తీసుకుని దానిపై ఉంచండి, ఆ రేకును బొద్దింకల ఉనికి గల ప్రదేశంలో ఉంచాలి.
- ఈ తొక్కలు ఒక ప్రత్యేకమైన వాసనను ఉత్పత్తి చేస్తాయి అదే బొద్దింకకు కీటకసంహారణిలా పనిచేస్తుంది. అల్యూమినియం రేకు లేకపోతే, ఒక ఖాళీ అల్యూమినియం సీసాలో కూడా తొక్కలను ఉంచవచ్చు.
0 comments:
Post a Comment