యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ ఇవే ..

60 లో కూడా 20 లా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. మీకు మాత్రం అలా ఉండాలని లేదా చెప్పండి ? ప్రతిఒక్కరూ తమ వయస్సు కంటే చిన్నవారిలా కనపడాలనే కోరుకుంటారు. కాని అది సాధ్యమా? కొన్ని ఆహారపదార్ధాలను తినడం వల్ల వయస్సు పై బడినట్లు కనపడదు అని కొంతమంది నిపుణులు తెలియజేసారు. అలాంటి పదార్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మంది చిన్న వయస్సులోనే పెద్ద వారిలా కనపడతారు. మరికొంత మంది వయస్సు పెద్దదైనా చిన్నవారి లా కనపడతారు. ఇదంతా తినే తిండి మీద మరియు వారి వంశపార్యం మీద ఆదారపడి ఉంటుంది. ఇప్పుడు యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ ఏమిటో చూద్దాం

బ్లూ బెర్రీస్‌

బ్లూ బ్రెరీస్‌ లో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్‌ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని రోజూ తినడం వల్ల ఆరోగ్యవంతులుగా తయారవుతారు. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్‌ వివిధ రకాల వ్యాధుల భారినుండి రక్షిస్తుంది. అంతేకాకుండా దీనిలోని ఫైబర్‌ కంటెంట్‌ శరీరానికి కావలసిన విటమిన్స్‌ మరియు ముఖ్యమైన ఖనిజాలని అందజేస్తుంది. దీనివల్ల శరీరం యవ్వనంగా కనపడడంలో సహాయపడుతుంది.

పిస్తా

పిస్తా అత్యంత పోషక విలువలు కలిగిన పప్పుదినుసులు. ఇవి పైన షెల్‌ కలిగి ఉంటాయి. ఈ విధంగా షెల్‌ లేని నట్స్‌తో షెల్‌ ఉన్న నట్స్‌ని పోల్చిచూస్తే తక్కువ కేలరీలు కలిగి ఉన్నట్లు పరిశోధకలు తేల్చిచెప్పారు. వీటిని తినడం వలన మంచి ఆరోగ్యంతో పాటు వృద్ధాప్యాన్ని కూడా మరిపించవచ్చు.

చేపలు 

చేప వారానికి 2 లేదా 3 సార్లు తినడం వల్ల ఆరోగ్యానికి, అలాగే కంటి సమస్యలను నివారించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.చేపలో ప్రొటీన్స్‌ మరియు ఒమేగా 3ప్యాటి  ఆసిడ్‌లు అధిక మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా వైల్డ్‌ సాల్మన్‌ తినడం వలన దీనిలోని ప్యాటీ ఆసిడ్స్‌ వలన మీ వయస్సును తగ్గించి మీరు యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇది మంచి యాంటీఏజింగ్‌ గా పనిచేస్తుంది. నిపుణులు దీనిని సిఫార్స్‌ చేస్తున్నారు. దీనిని మీ ఆహారంలో కుదిరినప్పుడల్లా తినడం చాలా మంచిది.

పెరుగు

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగులో షుగర్‌ మరియు లాక్టోస ఉంటాయి. ఇది శరీరం లోపల తయారయ్యే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటుంది. శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది. పెరుగు పేగులోని రుగ్మతలను మరియు ఇతర వ్యాదులను దూరం చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ గ్రీక్‌ పెరుగును తినడం వలన యాంటీ ఏంజింగ్‌ గా పని చేస్తుంది. తొందరగా వచ్చే ముసలి తనాన్ని రానివ్వదు. యవ్వనంలో ఉంచడానికి సహాయపడుతుంది. అని నిపుణులు అంటున్నారు.

కాఫీ

కాఫీ గుండె జబ్బులను అరికట్టడంలో సహాయపడుతుంది. కాఫీ తాగడం వలన చాలా లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. డయాబెటీస్‌ ని అరికట్టడంలో తనవంతు సాయం చేస్తుంది. అలా అని అధికంగా తాగడం కూడా మంచిది కాదు. కాఫీ తక్కువ చక్కెర మరియు క్రీమ్‌ వేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలకు పొందవచ్చు. ఇది కూడా వయస్సు మళ్ళిన తనాన్ని దూరం చేస్తుంది.

ఓట్స్‌ 

ఓట్స్‌ లో అత్యంత పోషక విలువలు కలిగి ఉన్నాయి. అధిక మోతాదులో పైబర్‌ ఉండడం వలన ఓట్స్‌ని తక్కువ మోతాదులో తీసుకున్న కడుపు నిండిన ఫీల్‌ కలుగుతుంది. అందువల్ల ఇప్పుడు చాలామంది దీన్ని అల్పాహారంగా తీసుకుంటున్నారు. దీనిని రోజూ తినడం వలన బరువును నియంత్రించుకోవచ్చు.
ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. అందువల్ల రోజూ వీటిని ఆహారంగా తీసుకోవడం వలన మంచి ఫలితం పొందుతారు. అంతేకాకుండా ఇది యాంటీఏజింగ్‌ గా కూడా పనిచేస్తుంది.

పాలకూర

పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరలలో అధిక మోతాదులో విటమిన్లు కలిగిన కూర ఏది అంటే పాలకూర అని చెప్పాలి. దీనితో విటమిన్‌ సి,కె, కాల్షియం, ఇనుము, విటమిన్‌ ఇ, మెగ్నీషియం, పొటాషియం వీటితో పాటుగా పీచు పదార్ధాలు కూడా ఉన్నాయి. దీనిలోని ఫోలేట్‌ కొత్త కణాలను  ఏర్పరచడంలో సహాయపడుతుంది.

మొక్కజొన్న

మొక్కజొన్న లో అధికంగా పైబర్‌ కంటెంట్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కలిగించే కారకాలను దూరం చేస్తుంది. దీనిలో 1పి6 కాంపొనెంట్‌ ఉండడం వలన ఇది క్యాన్సర్‌ కలిగించే కారకాలను చంపడంలో అద్బుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది యాంటీ ఏజింగ్‌ గా కూడా ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క

ఇది సుగంధద్రవ్యాలలో ఉపయోగిస్తారు. దాల్చిన చెక్క ఒక ఔషద వాహిని దీనిని చాలా రకాల రెమెడీస్‌లో వాడుతున్నారు. అదే విధంగా సౌందర్య సాధనాలలో కూడా దీనిని అధికంగా వాడుతున్నారు. మీరు ప్రతి రోజు దాల్చిన చెక్క పొడిని భోజనం తర్వాత తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా తొందరగా వయస్సు మళ్ళిన మాదిరిగా మారదు. దీనిని రోజూ ఆహారం తీసుకున్న తరువాత పావు టీస్పూన్‌ దాల్చిన చెక్కపొడిని తీసుకోవాలి. రోజూ ఇలా చేయండి ఫలితాన్ని మీరే గమనించండి.

డార్క్‌ చాక్లెట్స్‌

ఈ డార్క్‌ చాకెట్ల్స్‌ తక్కువ మోతాదులో తిన్నా సరే కడుపునిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అంతే కాకుండా గుండెకు సంబంధించిన వ్యాదులను కూడా దూరం చేస్తుంది. ఇది శరీరంలోని కేలరీలను తగ్గించి యాంటీ ఏజింగ్‌ కి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియని మెరుగు పరుస్తుంది.

చిలకడదుంపలు

చిలకడదుంపలో విటమిన్‌ ఎ ఉంటుంది. దీనిని అధికంగా తినడం వలన కంటి సమస్యలు తలెత్తవు. అదేవిధంగా ఎముకలను దృఢంగా చేస్తుంది. చిలకడదుంపలో విటమిన్‌ సి, పొటాషియం, విటమిన్‌ బి౬ మరియు బీటాకెరోటిక్‌ అధికంగా ఉన్నాయి. దీనిని రోజూ తినడం వలన యవ్వనంగా ఉంటారు. ఈ తియ్యని దుంపలను తినడం వలన అల్ట్రా వైలెట్‌ వల్ల నష్టం వాటిల్లిన చర్మాన్ని తిరిగి పునరుర్ధరిస్తుంది.

పుచ్చకాయ

సూర్యకాంతి వల్ల దెబ్బతిన్న చర్మాన్ని పుచ్చకాయ నయం చేస్తుంది. పుచ్చకాయ చర్మాన్ని యవ్వనంలో ఉండేలా తీర్చిదిద్దుతుంది. దీనిలో లైకోపీన్‌ మరియు బీటా-కెరోటిన్‌ వంటి విటమిన్లు ఉండడం వలన ఇది చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గ్రీన్‌టీ

గ్రీన్‌టీ రోజూ తాగడం వలన వృద్ధాప్యసమస్యను దూరం చేస్తుందని చాలా పరిశోధనలలో వెల్లడయింది. ఇది డిఎన్‌ఎ నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. వయస్సు పై బడే వారిలో కణాలను క్షీణించ కుండా చూసుకుంటుంది. అందువల్ల వారు యవ్వనంగా కనపడే అవకాశం అధికం గ్రీన్‌టీని చల్లగా లేదా వేడిగా తాగవచ్చు ఇది ఎప్పుడూ మీరు యవ్వనంలో ఉన్నారనే భావన కలిగేలా చేస్తుంది. అంతేకాకుండా గ్రీన్‌లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

0 comments:

Post a Comment