బరువు తగ్గటానికి ఆహారాలు


బరువు తగ్గటానికి అనుకూలమైన ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1. గుడ్డు 
గుడ్డు ఉత్తమ ఆహారాలలో ఒకటిగా ఉంది. దీనిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగాను, కేలరీలు తక్కువగా ఉండి కడుపు నిండిన భావన కలుగుతుంది. ఒక అధ్యయనంలో అధిక బరువు ఉన్న 30 మందికి గుడ్డును అల్పాహారంగా ఇచ్చి 8 వారాల పాటు పరిశీలన చేయగా బరువు తగ్గటాన్ని గమనించారు. గుడ్డు మొత్తం తక్కువ కేలరీలు మరియు ఎక్కువ పోషకాలతో నిండి ఉంది.

2. పచ్చని ఆకుకూరలు

పచ్చని ఆకుకూరల్లో అనేక పోషకాలు మరియు  విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాసాల్మన్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన స్థూలకాయం మరియు జీవక్రియ వ్యాధులను తగ్గించటంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయిి. కొన్ని అధ్యయనాల్లో వీటిలో ఉండే కాల్షియం కొవ్వు కరిగించటానికి సహాయపడుతుందని తెలిసింది

3.సాల్మన్

సాల్మన్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సమృద్దిగా ఉండుట వలన స్థూలకాయం మరియు జీవక్రియ వ్యాధులను తగ్గించటంలో ఒక ప్రధాన పాత్రను పోషిస్తాయి.

4.ఉడికించిన బంగాళదుంప 

ఉడికించిన బంగాళదుంప తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనిలో ఫైబర్ మరియు నిరోధక పిండి పదార్దం ఉండటం వలన బరువు తగ్గటానికి సహాయపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.

0 comments:

Post a Comment