మొటిమలు, వాటి మచ్చలు వేధిస్తున్నాయా ?

యవ్వనం లో మొటిమలు సాధారణ విషయమే. వాటి వల్ల కలిగే మచ్చలు చాలా ఇబ్బంది కి గురిచేస్తాయి. అయితే మీరు బాధ పడవలసిన అవసరం లేదు. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి మీరు మీ మొటిమలను వాటి మచ్చలను నయం  చేసుకోవచ్చు.

మొటిమలు రావడం వలన మీ ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడతాయి అదేవిధం గా  సూర్యరశ్మి మీ చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. బయటకు వెళ్ళేటప్పుడు మీ చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం వల్ల కొంతవరకు సమస్యను అరికట్టవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు క్రింద ఇవ్వబడిన  చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాల  ద్వారా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాకుండా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. మీ చర్మం మొటిమలు మరియు మచ్చలు లేకుండా అందంగా, కాంతివంతం గా  కనిపిస్తుంది. 

టమాటో

 ఒక టమాటోని తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా  కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత వేడి నీటితో కడగాలి.  

కలబంద 

కలబంద నుంచి గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండలో ఎండపెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కులు కలపాలి. ఆ పేస్టు ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు.

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించడం లో సహాయపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి.

గంధపు చెక్క

రెండు టేబుల్ స్పూనుల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి.

పసుపు మరియు నిమ్మరసం

చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా చక్కని ఫలితాన్ని పొందుతారు.

బంగాళదుంప రసం మరియు తేనే

బంగాళదుంప పేస్టు చేసి దానిలోకి కొంచెం తేనెని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత మంచి నీటితో కడగాలి.  ఇలా చేయడం ద్వారా మీ ముఖము మీద ఉన్న నల్ల మచ్చలు దూరం అవుతాయి.(లేదా)బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర 5 నిమిషముల పాటు రుద్దుతూ మసాజ్ ఉండాలి, 15 నిమిషముల తరువాత  మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ C ఎక్కువగా ఉండటం వలన ఇది చర్మంలోని విషపు కణాలను దూరం చేస్తుంది. అలానే మొటిమల వలన వచ్చిన నల్ల మచ్చలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. నిమ్మరసాన్ని మచ్చలు ఉన్న దగ్గర అప్లై చేయడం వలన నల్లమచ్చలు తొలిగిపోతాయి.

బొప్పాయి

బొప్పాయిలో అనేక రకాల  ఎంజైములు ఉన్నాయి . ఇవి మచ్చలను దూరం చేయడానికి  ఉపయోగపడతాయి. బొప్పాయి గుజ్జుని తీసుకొని ముఖము మీద అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి.

మజ్జిగ

మజ్జిగలో లాక్టిక్ ఆసిడ్ మరియు హైడ్రాక్సిల్ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి నెచురల్ ఆసిడ్స్. ఇవి చర్మానికి చాలా మంచివి. మజ్జిగ చర్మ కణాలను ఉత్తేజ పరిచి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహకరిస్తుంది. మజ్జిగను ముఖానికి అప్లై చేయడం వలన నల్ల మచ్చలు పోయి కొత్త చర్మం ఏర్పడుతుంది. మజ్జిగలో నిమ్మరసం కలిపి కూడా మీరు ముఖానికి అప్లై చేయవచ్చు. దీని వలన కూడా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు.

పచ్చి పాలు

పాలల్లో లాక్టిక్ ఆసిడ్ ఎక్కువగా ఉండటం వలన ఇది మచ్చలు పోగొట్టి చర్మాన్ని మృధువుగా చేస్తుంది. పచ్చి పాలను ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు ఉదయాన్నే చేయడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు.

కందిపప్పు మరియు పాలు

మొటిమల మచ్చలను తొలగించడానికి ఇది ఒక మంచి ఉపాయం. ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని తీసుకొని రాత్రి అంతా నానపెట్టాలి. ఉదయాన్నే నానిన కందిపప్పులో పాలు కలుపుతూ పేస్టు తయారు చేయాలి. ఈ  పేస్టుని ముఖానికి రాసి 20 నిమిషముల పాటు అలానే ఉంచాలి.  తరువాత చేతితో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. ఇలా చేయడం వలన 15 రోజుల్లో అద్భుతమైన ఫలితాన్నే మీరు చూడగలరు.

పెరుగు మరియు తేనే

పెరుగులో అనేక రకముల ఎంజైమ్స్ ఉన్నవి. ఇవి నల్ల మచ్చలు తొలగించుటకు సహాయ పడుతుంది. తేనే సహజంగా బ్లీచింగ్ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ పెరుగు మరియు 2 టేబుల్ స్పూనుల తేనెని కలిపి పేస్టు తయారు చేసి ముఖానికి అప్లై చేసి 20 నిమిషములు ఉంచాలి. తరువాత చేతులతో రుద్దుతూ గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా ప్రతిరోజు చేయడం వలన కాంతివంతమైన ముఖం మీ సొంతం అవుతుంది.

ఆముదం

 ఆముదంలో గొప్ప వైద్య లక్షణాలు ఉన్నవి ఇవి మొటిమలను వాటి మచ్చలను దూరం చేయుటకు సహాయపడతాయి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసి తరువాత ఆముదంతో 5 నిమిషముల పాటు మసాజ్ చేసి 20 నిమిషముల తరువాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో ముఖాన్ని తుడవాలి. తరువాత మళ్ళి 5 నిమిషముల పాటు మసాజ్ చేసి నీటితో కడగాలి. ఇలా రోజుకి రెండు సార్లు ఒక నెల పాటు చేయాలి. ఇలా చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందుతారు.

0 comments:

Post a Comment