సుబ్బారావే హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు ?


సుబ్బారావు, సుజాత  దంపతుల గురించి చాలా కథలు  వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకం గా అనుకుంటున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు. వీరి మీద  రెండు విభిన్నమైన కధనాలు నడుస్తున్నాయి.   సుబ్బారావు చాలా  చెడ్డోడు .. సుబ్బారావు పేదింటి కుర్రోడు. సుజాతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సుజాత చాలా మంచి అమ్మాయి చాలా అనుకువ, మంచి నడవడిక కలిగిన అమ్మాయి. ఆస్తి కోసం సుజాతను పెళ్లిచేసుకున్న విషయం సుజాతకు పెళ్లి తరువాత తెలిసిపోవడం తో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సుబ్బారావు అందరిదగ్గర ఆమె భార్య సంపన్నురాలు అనే అహంకారం తో తనను అవమానిస్తుంది అని, తనను వేధిస్తుంది అని అందరికి  చెప్పేవాడు.   మరో కథనం ప్రకారం సుబ్బారావు చాలా మంచోడు. సుబ్బారావు పుట్టుకతోనే సంపన్నుడు. పేదింటి అమ్మాయి అయిన సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం సుబ్బారావు తల్లిదండ్రులకు ఇష్టం లేక వాళ్ళను ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. అప్పటినుండి సుబ్బారావు తన సొంత కాళ్ళమీద నిలబడి కోట్లు సంపాదించాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకుంటాడు సుబ్బారావు చాలా మంచోడు అని మరి కొందరి అభిప్రాయం.   కరెక్ట్ గా సుబ్బారావు నెల క్రితం "సర్ నా భార్య హత్యా కు గురైంది". అని షాక్ తో ఇన్స్పెక్టర్ కి చెప్పాడు.  కొద్దిసేపట్లో ఇన్స్పెక్టర్...సుబ్బారావు ఇంటికి చేరుకున్నాడు.   ఇన్స్పెక్టర్: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు?  సుబ్బారావు: నేను నా భార్య సుజాత   ఇన్స్పెక్టర్: ఇంత పెద్ద ఇంట్లో పని మనుషులు లేకపోవడం ఏమిటి?  సుబ్బారావు: మొదటి నుండి మా పనులు మేమే చేసుకునే అలవాటు ఉంది.. అందుకనే...   ఇన్స్పెక్టర్: రాత్రి ఏ గదిలో పడుకున్నారు?  సుబ్బారావు: రోజు పడుకున్నట్లు గానే పైన బెడ్ రూమ్ లో పడుకున్నాను. సుజాత మాత్రం కింద ఈ గదిలో పడుకుంది (అని రూమ్ చూపిస్తూ చెప్తాడు ).   ఇన్స్పెక్టర్: ఎందుకని ?  సుబ్బారావు: నాకు  గురక సమస్య ఉంది నా గురక ఎప్పుడైనా భరించలేనిదిగా ఉన్నపుడు ఈ గదిలో వచ్చి పడుకుంటుంది.   ఇన్స్పెక్టర్: మీకు ఎవరిమీదైనా అనుమానంగా  ఉందా  ?  సుబ్బారావు: మాకు శత్రువులు ఎవరూ లేరండి ఇది కచ్చితం గా దొంగల పనే. దొంగతనం చేయడానికి ఈ గది విండో పగలకొట్టి లోపలికి  వచ్చారు. సుజాత అరవడం తో చంపేసి ఉంటారు అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. (ఇన్స్పెక్టర్ ఓదార్చదానికి శ్రమపడాల్సి వచ్చింది).   ఆ తరువాత ఇన్స్పెక్టర్ పరిశీలనగా కిటికీ వంక చూసాడు. బయటకు వచ్చి మరో సారి  కిటికీ వంక చూసాడు. పగిలిన అద్దం ముక్కలు చూసాడు.  ఆ తరువాత సుబ్బారావు తో హంతకుడు నువ్వే నిజం ఒప్పుకో అన్నాడు. సుబ్బారావు షాక్ అయ్యాడు  తరువాత  ఏం చేయలేక నిజం ఒప్పుకున్నాడు . ఇప్పుడు చెప్పండి  సుబ్బారావే  హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు ?
సుబ్బారావు, సుజాత  దంపతుల గురించి చాలా కథలు  వినిపిస్తున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కోరకం గా అనుకుంటున్నారు. అయితే అందులో ఎంత నిజం ఉంది అనే విషయం ఎవరికీ తెలియదు. వీరి మీద  రెండు విభిన్నమైన కధనాలు నడుస్తున్నాయి.

సుబ్బారావు చాలా  చెడ్డోడు .. సుబ్బారావు పేదింటి కుర్రోడు. సుజాతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సుజాత చాలా మంచి అమ్మాయి చాలా అనుకువ, మంచి నడవడిక కలిగిన అమ్మాయి. ఆస్తి కోసం సుజాతను పెళ్లిచేసుకున్న విషయం సుజాతకు పెళ్లి తరువాత తెలిసిపోవడం తో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సుబ్బారావు అందరిదగ్గర ఆమె భార్య సంపన్నురాలు అనే అహంకారం తో తనను అవమానిస్తుంది అని, తనను వేధిస్తుంది అని అందరికి  చెప్పేవాడు.

మరో కథనం ప్రకారం సుబ్బారావు చాలా మంచోడు. సుబ్బారావు పుట్టుకతోనే సంపన్నుడు. పేదింటి అమ్మాయి అయిన సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహం సుబ్బారావు తల్లిదండ్రులకు ఇష్టం లేక వాళ్ళను ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. అప్పటినుండి సుబ్బారావు తన సొంత కాళ్ళమీద నిలబడి కోట్లు సంపాదించాడు. భార్యను కంటికి రెప్పలా చూసుకుంటాడు సుబ్బారావు చాలా మంచోడు అని మరి కొందరి అభిప్రాయం.

కరెక్ట్ గా సుబ్బారావు నెల క్రితం "సర్ నా భార్య హత్యా కు గురైంది". అని షాక్ తో ఇన్స్పెక్టర్ కి చెప్పాడు.
కొద్దిసేపట్లో ఇన్స్పెక్టర్...సుబ్బారావు ఇంటికి చేరుకున్నాడు.

ఇన్స్పెక్టర్: ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఎవరెవరు?
సుబ్బారావు: నేను నా భార్య సుజాత

ఇన్స్పెక్టర్: ఇంత పెద్ద ఇంట్లో పని మనుషులు లేకపోవడం ఏమిటి?
సుబ్బారావు: మొదటి నుండి మా పనులు మేమే చేసుకునే అలవాటు ఉంది.. అందుకనే...

ఇన్స్పెక్టర్: రాత్రి ఏ గదిలో పడుకున్నారు?
సుబ్బారావు: రోజు పడుకున్నట్లు గానే పైన బెడ్ రూమ్ లో పడుకున్నాను. సుజాత మాత్రం కింద ఈ గదిలో పడుకుంది (అని రూమ్ చూపిస్తూ చెప్తాడు ).

ఇన్స్పెక్టర్: ఎందుకని ?
సుబ్బారావు: నాకు  గురక సమస్య ఉంది నా గురక ఎప్పుడైనా భరించలేనిదిగా ఉన్నపుడు ఈ గదిలో వచ్చి పడుకుంటుంది.

ఇన్స్పెక్టర్: మీకు ఎవరిమీదైనా అనుమానంగా  ఉందా  ?
సుబ్బారావు: మాకు శత్రువులు ఎవరూ లేరండి ఇది కచ్చితం గా దొంగల పనే. దొంగతనం చేయడానికి ఈ గది విండో పగలకొట్టి లోపలికి  వచ్చారు. సుజాత అరవడం తో చంపేసి ఉంటారు అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. (ఇన్స్పెక్టర్ ఓదార్చదానికి శ్రమపడాల్సి వచ్చింది).

ఆ తరువాత ఇన్స్పెక్టర్ పరిశీలనగా కిటికీ వంక చూసాడు. బయటకు వచ్చి మరో సారి  కిటికీ వంక చూసాడు. పగిలిన అద్దం ముక్కలు చూసాడు.  ఆ తరువాత సుబ్బారావు తో హంతకుడు నువ్వే నిజం ఒప్పుకో అన్నాడు. సుబ్బారావు షాక్ అయ్యాడు  తరువాత  ఏం చేయలేక నిజం ఒప్పుకున్నాడు . ఇప్పుడు చెప్పండి  సుబ్బారావే  హంతకుడని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు ?

0 comments:

Post a Comment