మన దేశంలో భయంకరమైన ప్రదేశాలు ఏవో తెలుసా?

భారతదేశం లో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే  అంతు చిక్కని  ఎన్నో రహస్యాలు కూడా కలిగిన దేశం భారతదేశం. ఎన్నో వింతలు, విచిత్రాలు, ఊహకి అందని ఎన్నో కథనాలు. కంటికి కనిపించని రహస్యాలు ఎన్నో.... రాజభవనాలు, కోటలు, రాజులు, రాకుమారి, సంపదలు, యుద్ధాలు అంటూ ఇలా ఎన్నో చిక్కువిడవని కధలు ఉన్నాయి. ఈలోకం లో  ఆత్మలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు వస్తే చాలామంది లేవు అంతా భ్రమ అంటారు. కొందరయితే కచ్చితంగా ఉన్నాయి మేము కళ్ళరా చూసాం అని అంటుంటారు. ఏది నమ్మాలో తెలియని పరిస్థితి. ఇలా కొన్ని మనదేశానికి సంభందించి ప్రశ్నార్ధకంగానే మిగిలిపోయాయి. మనదేశంలో కొన్ని ఊహకందని కధనాలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకోవాలని ఉందా??అయితే ఆలస్యం చేయకుండా తెలుసుకోండి మరి !!




టన్నెల్‌ నెం 33 : సిమ్లా

హిమాచల్‌ ప్రదేశ్‌లో బాగా ప్రసిద్ధి చెందిన అందమైన పట్టణం సిమ్లా. ఇంత అందమైన ప్రదేశంలో కూడా కొన్ని భయంకరమైన నీడలు వెంటాడుతున్నాయి. ఎన్నో అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. సిమ్లాలో టన్నెల్‌ నెం.33 లో ఒక దెయ్యం తిరుగుతుందని దానిపేరు కల్నల్‌ బరోగ్‌. ఇతడు బ్రిటిష్‌ రైల్వే ఇంజనీర్‌. ఇతడి ఆత్మ టన్నెల్‌ నెం.33 లో నివాసం ఉంటుందట. కాని అక్కడి ప్రజలు ఆ దెయ్యం స్నేహపూర్వకంగా ఉంటుందని ఎటువంటి హాని కలిగించదని చెప్పుకొచ్చారు. ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా దెయ్యం అంటే బయపడకుండా ఎవరు ఉంటారు చెప్పండి. ఆ టన్నెల్‌ సమీపంలో ప్రయాణికులు తలుచుకోని దేవుడుండడు.

జిపి బ్లాక్‌ : మీరట్‌

ఉత్తరప్రదేశ్‌ లో మీరట్‌ జిపి బ్లాక్‌ కూడా భయంకర ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ చాలా భయంకర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. వింతవింత శబ్ధాలు, నవ్వులు వినపడుతుంటాయి. ఈ జిపి బ్లాక్‌లో కొంతమంది అబ్బాయిలు,అమ్మాయిల ఆత్మలు నివాసం ఉంటున్నట్లు అక్కడి ప్రజలు చెప్తున్నారు. కొంతమంది అబ్బాయిలు కొవ్వొత్తి కాంతిలో మందు తాగుతున్నట్లు, చిందులేస్తున్నట్లు అక్కడ చూసిన వారు తెలియజేసారు. చాలామంది ఈ ఆత్మలను చూసినట్లు ఎంతో భయబ్రాంతులకు గురయినట్లు ఈ విషయాలు చెప్పడం ద్వారా దెయ్యాలు ఉన్నాయని తెలుస్తుంది.

డుమాస్‌ బీచ్‌ : గుజరాత్‌

గుజరాత్‌ లో అరేబియన్‌ సముద్రం వెంబడి భయానక సంఘటనలు చోటుచేసుకున్నాయి. అక్కడ బీచ్‌ లో నలుపు రంగు ఇసుక ఉంటుంది. గుజరాత్‌ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మార్నింగ్‌ వాక్‌ చేసేవారు, పర్యాటకులు చాలా భయబ్రాంతులకు గురయ్యేవారట.ఈ బీచ్‌లో వింతవింత ఏడుపులు, మూలుగులు వినిపించేవంట. ఈ అందమైన బీచ్‌ వెనుక ఉన్న రహస్యాలను చేదించాలి అనుకునే వారు చాలామంది మాయమైపోయినట్లు అక్కడిప్రజలు చెప్తున్నారు. ఎంతో నిశబ్ధంగా ఉంటూ, అప్పుడప్పుడు అరుపులు గట్టిగా వినిపిస్తూ ఉంటాయని మార్నింగ్‌ వాక్‌ చేసేవారు తెలిపారు.

అగ్రసేన్‌కి బావోలి : న్యూఢిల్లీ

ఇటువంటి అద్భుతమైన నిర్మాణం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. దీనిని 14వ శతాబ్ధంలో బావోలి అగ్రసేన్‌ నిర్మించాడు. ఇప్పుడు ఇది పూర్తిగా ఎండిపోయి ఉంది. ఒకప్పుడు ఇది పూర్తిగా నల్లని నీటితో నిండి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. అక్కడి నీరు హిప్నోటైజ్‌ చేస్తుందని ప్రజలు నమ్ముతారు. అది మరణం సంభవించే వరకు వదిలి పెట్టదని వారి వాదన.

రామోజీఫిల్మ్‌ సిటీ : హైదరాబాద్‌

చిత్రాలను, సీరియల్స్‌, ప్రోగ్రామ్స్‌ మొదలగు వాటిని అద్భుతంగా చిత్రీకరించేందుకు ఎంచుకునే అద్భుతమైన ప్రదేశం రామోజీఫిల్మ్‌ సిటీ. దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్‌సిటీగా పేరు పొందింది. ఇక్కడ ఎన్నో హోటళ్లు ఉన్నాయి. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపించే ఈ ఫిల్మ్‌సిటీ వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ఫిల్మ్‌సిటీ నిర్మించిన ప్రాంతం ఒకప్పుడు యుద్ధపోరాటం లో క్రూరంగా చనిపోయిన, భూభాగంలో నిర్మించినట్లు చాలామంది అభిప్రాయం. వేలాది మంది ఇక్కడ చనిపోయినట్లు నమ్ముతున్నారు. చాలామంది సాక్షులు తెలియజేసింది ఏమిటంటే ఇక్కడ లైట్లు ఆరిపోతుంటాయని వాటికవే వెలుగుతుంటాయని,కాంతి ముందుకు వెనుకకు కదులుతుందని, చాలామంది పై నుండి కిందకి పడిపోయి గాయాలపాలు కావడం, ఇలా చాలాసార్లు సంభవించాయని వారు వాపోయారు. ఇక్కడ ఎక్కువ ఆడ దెయ్యాలు ఉన్నాయని, అవి తులుపుకు గడియ పెట్టి అప్పుడప్పుడు బయపెట్టేవని, ఇంకా తలుపులు గట్టిగా బాదడం లాంటి పసులు చేసేవని తెలిపారు. కొంతమంది మాత్రం ఇవి కేవలం కల్పితాలు మాత్రమే అంటున్నారు.

మల్చా మహల్‌ : ఢిల్లీ

ఈ మహల్‌ ఢిల్లీలో ఉంది. బుద్ధ పార్కు వెనుక భాగాన గల అడవిలో ఈ ప్యాలెస్‌ కలదు. ఇది ఎంతో భయంకరంగా ఉంటుంది. ఈ మహల్‌ కి మరోపేరు బిస్తారి మహల్‌ అనికూడా అంటారు. నవాబ్‌ యొక్క మనవరాలు బేగంకి వారి సంతానం అయిన ప్రిన్స్‌ రియాజ్‌ మరియు ప్రిన్సెస్‌ సాకిన కి ఈ స్థలాన్ని ఇచ్చారు. బేగం వజ్రాలను చూర్ణం చేసుకుని తాగి ఆ మహల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె శరీరం 10 రోజులపాటు అలానే ఉండిపోయింది. ఆమె పిల్లలు ఆమె శరీరంతో పాటే పక్కన పడుకునే వారట. ఆమె తల్లి మరణించిన తరువాత ప్రిన్సెస్‌ సాకిన నలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించేవారట.

ది శనివర్వాడ ఫోర్ట్‌ : పూనె

ఇది మహారాష్ట్రలో పూనె పట్టణంలో ఉంది. దీనిని 1746 లో నిర్మించారు. ఇది 1818 వరకు పేష్వా పరిపాలకులు, మరాఠా సామ్రాజ్య ఆస్థానంగా ఉండేది. తరువాత బ్రిటిష్‌ వారు పేష్వాలను ఓడించి స్వాదీనం చేసుకున్నారు. ఈ కోట నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. ఈ కోటలో వివిధ రకాల భయానక సంఘటనలు చోటుచేసుకున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ ఫోర్ట్‌ ని దెయ్యాలు వెంటాడుతున్నాయని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ కోటలో 13 ఏళ్ళ వయస్సులో ఉన్నప్పుడు ఒక యువరాజు దారుణంగా చంపబడ్డాడు. అతడు ఈ కోటలో దెయ్యమై తిరుగుతున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ దెయ్యం పౌర్ణమి రోజులలో పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ అరుస్తుందట.

ఫిరోజ్‌ షా కోట్ల : ఢిల్లీ

ఇది ఫిరోజ్‌ షా తుగ్లక్  యొక్క ప్రియమైన నగరం. ప్రస్తుతం ఇది ఒక భయానక ప్రదేశంగా మారింది. దీనిని సందర్శకులు చూడకూడని ప్రదేశంగా ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ ప్రాంతాన్ని కేవలం యక్షిణుల ద్వారా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక ఆత్మహత్యలు జరిగాయి. అధికారులు కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడలేక పోయారు. ఇది చాలా రహస్యమైన, భయంకరమైన భవనంగా పేరుగాంచింది.

డౌ హిల్‌, కుర్సీయంగ్‌ : వెస్ట్‌ బెంగాల్‌

కుర్సీయంగ్‌ ఒక ఆహ్లాదకరమైన హిల్‌ స్టేషన్‌. ఇక్కడి వాతావరణం  చాలా ప్రశాంతంగా ఉంటుంది. డౌ హిల్‌ లో పాఠశాలలు ఎక్కువగా ప్రసిద్ధి చెందాయి. కాని ఖచ్చితంగా భారతదేశం యొక్క అత్యంత హాంటెడ్‌ ప్రదేశాలలో డౌ హిల్‌ ఒకటి అనే చెప్పాలి. ఈ కొండ ప్రాంతం దట్టమైన అడవులతో ఉండి ఎన్నో మరణాలకు శరణాలయంగా నిలించింది. ఈ ప్రాంతాన్ని దాటే సమయంలో ప్రజల ఎముకలు భయంతో వణికి పోతుంటాయి. ఇక్కడ వింత పాటలు, నవ్వులు వినపడుతుంటాయి. దెయ్యం కనిపించడం హఠాత్తుగా అదృశ్యమవడం ఇక్కడ మాములే, అడవిని సందర్శించే పలువురు తలలేని బాలుడుని చూసినట్లు తెలిపారు.

బ్రిజ్‌  రాజ్‌ భవన్‌ ప్యాలెస్‌ : రాజస్థాన్‌

ఈ బ్రిజ్‌ రాజ్‌ భవన్‌ దాదాపు 178 సంవత్సరాల క్రితం ప్యాలెస్‌. ఇది రాజస్థాన్‌ లో చోటుచేసుకుంది. దీనిని 1980 లో హెరిటేజ్‌ హోటల్‌గా మార్చారు. దీనిలో దెయ్యం నివాసం ఉంటుందట. 1857 తిరుగుబాటు సమయంలో భారత సిపాయిల ద్వారా మేజర్‌ బర్డన్‌ మరియు అతని ఇద్దరు కుమారులు చంపబడ్డారు. తరువాత బర్డన్‌ దెయ్యంగా ఆ ప్యాలెస్‌ లో తిరుగుతున్నారట. కాని మేజర్‌ బర్డన్‌ ఇప్పటి వరకు ఎవరికీ ఏహానీ చేయలేదని అక్కడి ప్రజలు అంటున్నారు.

0 comments:

Post a Comment