గొంతు నొప్పి ఉపశమనానికి ఉత్తమమైన టీలు


శీతాకాలంలో గొంతు నొప్పి రావటం అనేది సహజంగానే జరుగుతుంది. నోటి చివర నుంచి  అన్నవాహిక దాకా ట్యూబ్ ఉంటుంది. ఈ ట్యూబ్ ఎర్రబడితే గొంతు నొప్పి వస్తుంది. ఈ  గొంతు నొప్పి చాలా బాధకరంగాను మరియు ఆహారాన్ని మింగటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అసలు ముందుగా గొంతు నొప్పి రావటానికి గల కారణాలను తెలుసుకుందాం. మనకు తరచుగా జలుబు, దగ్గు వచ్చినప్పుడు గొంతు నొప్పి రావటం సహజమే. గొంతు నొప్పి  రావటానికి అనేక అంశాలు కారణం అవుతాయి. తలనొప్పి, జలుబు మరియు కడుపు నొప్పి  వంటివి కారణం కావచ్చు.  గొంతు నొప్పి ఉపశమనానికి కొన్ని రకాల టీలను ఉపయోగించవచ్చు. ఈ వెచ్చని పానీయాలు గొంతు నొప్పి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.

ఈ టీలు గొంతుకు ఎలా ఉపశమనం కలిగిస్తాయి

మూలికా టీలు త్రాగటం వలన ఎర్రబడిన గొంతు చికిత్సలో సహాయపడతాయి. అలాగే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గటానికి కూడా సహాయపడతాయి. అయితే కొన్ని రకాల మూలిక టీలు గొంతులో భారము, చికాకు మరియు  తిమ్మిరి కలిగించవచ్చు. అంతేకాక ప్రతి ఒక్కరికి ఈ మూలిక టీలు త్రాగటం వలన మంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ఇక్కడ చెప్పుతున్న మూలికా టీలను ప్రయత్నించండి.

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క వివిధ దేశీయ వంటకాల్లో ఉపయోగించే ఒక మసాలా దినుసు. ఇది ఉత్తేజితమైన వాసనను కలిగి గొంతు నొప్పి తగ్గటంలో సహాయపడుతుంది. దాల్చిన చెక్కతో పాటు తేనెను ఉపయోగిస్తే గొంతుకు ఓదార్పు ప్రభావం ఎక్కువగా
ఉంటుంది.

కావలసినవి
  • పాలు - ఒక కప్పు
  • దాల్చిన చెక్క - కొన్ని ముక్కలు
  • అల్లం - చిన్న చిన్న ముక్కలు లేదా పొడి
  • తేనె - ఒక స్పూన్
పద్దతి

పాలలో అల్లం మరియు దాల్చిన చెక్క ముక్కలు వేసి మరిగించాలి. ఆ తర్వాత తేనెను కలపాలి. ఈ టీని ఎప్పుడైనా త్రాగవచ్చు. అయితే రాత్రి పడుకొనే ముందు త్రాగితే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆవు పాలు పడని వారు  బాదం
లేదా కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు.

రష్యన్ టీ

రష్యా నుండి వచ్చిన ఈ టీని రోజులో అనేక సార్లు త్రాగితే ఎర్రబడిన గొంతు ఉపశమనానికి బాగా సహాయపడుతుంది. ఈ టీని చికిత్సా లక్షణాలు ఉన్న మూలికలు మరియు పదార్దాలతో తయారుచేస్తారు. గొంతు లో రద్దీని తగ్గించటమే కాక, గొంతు నొప్పికి కారణం అయిన క్రిములను  తగ్గించటంలో సహాయపడుతుంది.

కావలసినవి
  • చక్కెర
  • బ్లాక్ టీ
  • నారింజ రసం లేదా పొడి
  • దాల్చినచెక్క పొడి
  • లవంగాలు
పద్దతి

ఒక కంటైనర్ లో చక్కర,బ్లాక్ టీ, నారింజ రసం లేదా పొడి, దాల్చిన చెక్క పొడి,లవంగాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నాలుగు స్పూన్ల వేడి నీటిని కలిపి త్రాగాలి. ఇంకా అదనపు రుచి కోసం కొంచెం నిమ్మరసం కలపవచ్చు.

అల్లం టీ

అల్లం వంటల్లో ఎక్కువగా వాడే సాధారణ హెర్బ్ అని చెప్పవచ్చు. అలాగే అల్లం బలమైన శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఈ టీ మంచి రుచి మరియు వాసన కలిగి ఉంటుంది. అంతేకాక ఈ టీ స్వర కండరాలకు విశ్రాంతి ఇవ్వటానికి సహాయపడుతుంది. 

కావలసినవి
  • అల్లం - చిన్న ముక్కలు
  • నీరు
  • తేనె లేదా చక్కెర
  • టీ ఆకులు
  • పాలు
పద్దతి

అల్లంను శుభ్రంగా కడగాలి. తాజా మరియు సేంద్రీయ అల్లంను ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అల్లం లేకపోతే సేంద్రీయ అల్లం పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో నీటిని పోసి అల్లం ముక్కలు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత చక్కర,టీ ఆకులను కలపాలి. రెండు నిముషాలు అయ్యాక పాలను కలపాలి. దీనిలో చక్కెర ఎక్కువగా వేయవలసిన అవసరం లేదు. ఈ అల్లం టీని రోజులో రెండు సార్లు త్రాగవచ్చు. పాలు ఇష్టపడని వారు పాలను మానేయవచ్చు. 

తేనె మరియు నిమ్మ టీ

తేనెలో నయం చేసే గుణాలు మరియు యాంటీమైక్రోబియాల్ లక్షణాలు, నిమ్మలో గొంతు చికాకును తటస్తం చేసే  సహజ ఆమ్లాలు ఉంటాయి. ఈ టీలో టీ ఆకులను ఉపయోగించకపోయినా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

కావలసినవి
  • నిమ్మ రసం -  ఒక స్పూన్
  • తేనె
  • నీరు
  • అల్లం (ఇష్టమైతే)
పద్దతి

ఒక గిన్నెలో నీరు పోసి వేడిచేయాలి. ఈ నీరు వేడిగా ఉన్నప్పుడే తేనే,నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఇష్టం ఉన్నవారు అల్లం ముక్కలను కలపవచ్చు. ఈ టీని వేడిగా ఉన్నపుడే త్రాగాలి. గొంతు ఉపశమనానికి ఈ టీని ప్రతి రోజు మూడు సార్లు త్రాగాలి.

సేజ్ టీ

సేజ్ అనేది ఎర్రబడిన గొంతు ఉపశమనానికి ఉపయోగించే ఒక హెర్బ్ గా ఉంది. ఈ మూలిక శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. దగ్గు, జ్వరంతో పాటు గొంతు నొప్పి ఉన్నప్పుడు ఇది చాలా  ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ సుగంధ టీని తయారు  చేయడానికి తాజా లేదా ఎండిన సేజ్ ని ఉపయోగించవచ్చు.

కావలసినవి
  • సేజ్ ఆకులు - ఎండిన లేదా తాజా
  • తేనె
  • నిమ్మ రసం (ఇష్టమైతే)
  • నీరు
పద్దతి

ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. ఈ మరిగిన నీటిలో సేజ్ ఆకులను వేసి రెండు నిముషాలు మరిగించాలి. ఆ తర్వాత ఆ గిన్నె మీద మూత పెట్టి కొన్ని నిముషాలు కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత తేనె మరియు నిమ్మ రసం వేసి బాగా కలపాలి. ఈ టీని వేడిగా త్రాగాలి. ఈ టీని పుక్కిలించడం కోసం కూడా ఉపయోగించవచ్చు. అయితే ఈ టీని గర్భిని స్త్రీలు మరియు పాలు ఇచ్చే తల్లులు త్రాగటానికి సిఫార్స్ లేదు.

పిప్పరమింట్ టీ

పిప్పరమింట్ ని  ఎక్కువగా తైల మర్ధన ప్రయోజనాల కోసం మరియు చర్మ రక్షణ పరిశ్రమలో ఉపయోగించే ఒక హెర్బ్ అని చెప్పవచ్చు.  FMCG ఉత్పత్తులలో రుచి కోసం  విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే దీనిని అనేక మానవ రుగ్మతలు నయం చేయటానికి  పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. గొంతు వాపు నుండి ఉపశమనానికి పిప్పరమెంటు టీని ఉపయోగించవచ్చు. పిప్పరమెంటులో మెంథాల్ అనేది ప్రధాన సమ్మేళనంగా ఉంటుంది. గొంతు నొప్పి కోసం ఒక శక్తివంతమైన నివారణ మందుగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో పిప్పరమెంట్ మార్కెట్లో అనేక రూపాల్లో దొరుకుతుంది. ఈ  టీని  చేయడానికి ఎండబెట్టిన పిప్పరమెంటు ఆకులను ఉపయోగించాల్సి ఉంటుంది.

కావలసినవి
  • పిప్పరమెంటు ఎండిన ఆకులు
  • నీరు
  • నిమ్మ రసం (ఇష్టమైతే)
పద్దతి

ఓక్ గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. ఈ మరిగిన నీటిలో ఎండిన ఆకులను వేసి రెండు నిముషాలు మరిగించాలి. ఆ తర్వాత నిమ్మరసం కలిపి త్రాగాలి. గొంతు నొప్పి నివారణకు ప్రతి రోజు ఈ టీని మూడు సార్లు త్రాగవచ్చు.

గ్రీన్ టీ

గ్రీన్ టీ అందించే అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలియని వారు చాలా అరుదుగా ఉంటారు. దీనిలో అద్భుతమైన రుచితో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక శక్తి గణనీయంగా పెంచటంలో సహాయపడుతుంది. దీనిని  గొంతు ఉపశమనం కోసం ఒక ఇంటి నివారిణిగా ఉపయోగించవచ్చు.  మార్కెట్ లో అనేక రకాల గ్రీన్ టీ బ్యాగ్స్ లభ్యం అవుతున్నాయి. వాటిలో మనకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.

కావలసినవి
  • గ్రీన్ టీ బ్యాగ్
  • నీరు
  • నిమ్మ రసం (ఇష్టమైతే)
  • తేనె
పద్దతి

వేడి నీటిని కాచి ఒక కప్పులో పోయాలి. దానిలో గ్రీన్ టీ సంచిని ముంచాలి. టీని తయారుచేయటానికి టీ సంచిని అనేక సార్లు కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత నిమ్మరసం, తేనే కలపాలి. గొంతు ఉపశమనం కోసం గ్రీన్ టీని ప్రతి రోజు కొన్ని సార్లు త్రాగవచ్చు.

పసుపు టీ

పసుపును ఎక్కువగా వంటల్లో ఉపయోగించే సాధారణ గృహ మసాలా మరియు హెర్బ్ అని చెప్పవచ్చు. దీనిలో పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ మరియు పోషకాలు ఉన్నాయి. పసుపులో ఉండే 'కర్క్యుమిన్' శక్తివంతమైన నయం చేసే లక్షణాలు మరియు వాపు తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. మనం గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు పసుపు టీని తప్పనిసరిగా ఉపయోగించవచ్చు. పసుపు రుచి కొంచెం అసహజంగా ఉండుట వలన ఈ టీలో ఇతర పదార్ధాలను కలపాలి.

కావలసినవి
  • పసుపు దుంప -  ముక్కలుగా కోయాలి
  • తేనె
  • నిమ్మరసం
  • నీరు
పద్దతి

ఒక గిన్నెలో నీటిని తీసుకోని మరిగించాలి. ఆ తర్వాత పసుపు దుంప ముక్కలను వేసి రెండు నిముషాలు మరిగించాలి. ఆ తర్వాత నిమ్మ రసం మరియు తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి త్రాగాలి. ఈ టీని రోజులో రెండు సార్లు త్రాగాలి.

లికోరైస్ టీ

లికోరైస్ అనేది  భారతీయ ఆయుర్వేద మరియు సాంప్రదాయ చైనీస్ ఔషధంలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్న ఒక హెర్బ్ అని చెప్పవచ్చు. దీనిని విభిన్న పానీయాలు మరియు ఆహారాలలో సువాసన ఏజెంట్ గా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ మూలిక మంట మరియు శ్లేష్మం తగ్గించటానికి సహాయపడుతుంది. ఎర్రబడిన గొంతు నొప్పిని నయం చేయటానికి లికోరైస్ టీని  ప్రయత్నించవచ్చు. ప్రామాణికమైన లికోరైస్ వేరు కొన్ని చైనీస్ మూలికా దుకాణాలలో దొరుకుతుంది.

కావలసినవి
  • లికోరైస్ వేరు లేదా టీ బ్యాగ్స్
  • అల్లం
  • తేనె
  • ఎర్రటి ఖర్జూరాలు
  • నీరు
పద్దతి

అల్లం ముక్కలు మరియు లికోరైస్ వేర్లను జాగ్రత్తగా చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో నీటిని మరిగించి, దానిలో లికోరైస్ వేరు ముక్కలను వేసి రెండు నిముషాలు మరిగించాలి. ఆ తర్వాత అల్లం మరియు తేనే వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఎర్రటి ఖర్జూరాలను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వడకట్టి వేడిగా ఉన్నప్పుడే త్రాగాలి. ప్రతి రోజు రెండు కప్పుల టీని త్రాగవచ్చు.

0 comments:

Post a Comment