గ్రే హెయిర్ రావడానికి గల కారణాలు మరియు చిట్కాలు


జుట్టు కి నలుపు రంగు మెలనిన్ అనే వర్ణ ద్రవం వల్ల వస్తుంది. ఇది జుట్టు రూట్ భాగం లో సరిగా ఉత్పత్తి కాకపోతే జుట్టు బూడీద రంగు లోకి మారుతుంది. గ్రే హెయిర్ రావడానికి ఒక నిర్దిస్టమైన వయస్సు ఉంటుంది. అలా కాకుండా చిన్న వయస్సు లోనే రావడం వలన వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ ని కోల్పోతారు.

గ్రే హెయిర్ రావడానికి గల కారణాలు:
·        వంశపారంపర్యంగా
·        బొల్లి
·        ఒత్తిడి
·        విటమిన్ మరియు పోషక లోపం
·        వయస్సు పెరగడం వలన
·        పొగాకు అధికము గా తీసుకోవడం
·        రక్తహీనత
·        హైపోథైరాయిడిజం
·        కాలుష్యం వలన
ప్రస్తుతం మార్కెట్ లో చాలా రకాల ప్రాడక్ట్స్ లభిస్తున్నాయి. గ్రే కలర్ ను మార్చుకొని వేరే నచ్చిన కలర్స్ కూడా వేసుకోవచ్చు కానీ వీటి వల్ల ఒక్కోసారి ముఖానికి కూడా ఎఫెక్ట్ జరుగుతుంది, హెయిర్ కూడా పాడవుతుంది. దాని ఫలితం గా జుట్టు రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల అలాంటి దుష్ప్రభావాలు చూపని హోమ్ రెమెడీస్ ని ఎంచుకోవడం మంచిది. కొన్ని పరిష్కార మార్గాలు చూద్దాం

మెంతులు, కొబ్బరి నూనె :
మెంతులు లెసితిన్, అమీనొ ఆసిడ్స్ కలిగి ఉంటుంది. గ్రే హెయిర్ కి ఇది ఒక మంచి పరిష్కారం. ఇది  గ్రే హెయిర్ రావడాన్ని తగ్గిస్తుంది.
తయారు చేయడానికి కావలసినవి:
మెంతులు-1/4 కప్పు
కొబ్బరి నూనె-1/2 కప్పు
తయారుచేయు పద్దతి:
·        ముందు గా 1/2 కప్పు కొబ్బరి నూనె ని తీసుకొని వేడి చేయాలి.
·        తర్వాత మెంతులు ఆ వేడి నూనె లో వేయాలి.
·        కొబ్బరి నూనె ని ఇంకా మెంతులు కలిపి 8 నుండి 10 నిమిషాల వరకు వేడి చేయాలి.
·        వేడి చేసిన తరువాత  మెంతులు బయటకు తీసివేయాలి.
·        చల్లార నివ్వాలి అంటే కొంచం గోరు వెచ్చగా ఉంటే సరిపోతుంది.
·        గోరు వెచ్చని నూనె ని తల కుదుల్ల కి బాగా పట్టించి వేళ్ళ తో బాగా మసాజ్ ని 2 నుండి ౩ నిమిషాలు  పాటు చేసుకోవాలి.
·        రాత్రి అంతా ఆయిల్ ని అలా తలకి పెట్టుకొని వదిలేయాలి.
·        తరువాత రోజు ఉదయం మైల్డ్ షాంపూ తో శుబ్రపరుచుకోవాలి. కావాలంటే కండీషనర్ ని కూడా వాడవచ్చు.
·        ఇలా 2 లేదా 3 వారాలు తప్పని సరిగా వాడడం వలన గ్రే హెయిర్ నుండి విముక్తి లబిస్తుంది.
ఉల్లిపాయలు :
ఉల్లిపాయలు గ్రే హెయిర్ ని తగ్గించడం లో తోడ్పడతాయి. ఉల్లిపాయలు వాడడం వలన మంచి ఫలితం లబిస్తుంది. ఉల్లిపాయలు  జుట్టు యొక్క సహజ రంగు ని పునరుద్దరిస్తుంది. సులభమైన పద్దతి లో ఇంట్లోనే చేసుకోవచ్చు.
తయారు చేయడానికి కావలసినవి:
  • ఉల్లిపాయ-1
  •  మెత్తటి వస్త్రం-1

తయారుచేయు పద్దతి:
·        ముందుగా ఉల్లిపాయ తొక్క తీసి రెండు ముక్కలుగా కోయాలి.
·        మిక్సర్ లో వేసి 2 నుండి 3 నిమిషాలు ఉంచి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.
·        తర్వాత ఆ పేస్ట్ ని ఒక మెత్తని వస్త్రం లోకి తీసుకొని వడ కట్టాలి.
·        వచ్చిన రసాన్ని తల కుదుల్లకు బాగా పట్టించి 40 నుండి 60 నిమిషాలు పాటు వదిలేయాలి.
·        అనంతరం వట్టి నీటి తో శుబ్రపరుచుకొని తరువాత షాంపూ ని వాడాలి.
·        ఇలా నెలకు ఒక సారి చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

ఉసిరికాయ, యూకలిప్టస్ ఆయిల్,గుడ్డు మరియు నిమ్మరసం: 
ఉసిరికాయ లో ఆంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఉంటుంది. దాని వల్ల జుట్టు రంగుని కాపాడుతుంది.  గ్రే రంగులోకి మారకుండా చూసుకుంటుంది. యూకలిప్టస్ ఆయిల్ రక్తాన్ని జుట్టు కుదుల్లలో బాగా సరఫరా చేస్తుంది. గుడ్డు లో ప్రోటీన్స్ ఉంటాయి. ఫ్యాటీ ఆసిడ్స్ ఇంకా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయ లో విటమిన్ బి, సి ఇంకా ఫాస్పరస్ ఉండడం వలన జుట్టు ను బూడిద రంగు నుండి నలుపు రంగుకు మార్చడం లో సహాయపడుతుంది.
తయారు చేయడానికి కావలసినవి:
ఉసిరికాయ-1
యూకలిప్టస్ ఆయిల్ -1 టేబుల్ స్పూన్
గుడ్డు-1
నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్
పెరుగు-2 టేబుల్ స్పూన్
తయారుచేయు పద్దతి:
·        ముందుగా ఉసిరి కాయని ముక్కలుగా చేసుకోవాలి.
·        ముక్కలుగా చేసిన తరువాత వీటిని యూకలిప్టస్ ఆయిల్ లో 2 నుండి 3 గంటలు నానపెట్టాలి.
·        వీటిని తప్పనిసరిగా ఐరన్ కంటేనర్ లోనే నానపెట్టాలి.
·        2 నుండి ౩ గంటలు గడిచిన తరువాత  యూకలిప్టస్ ఆయిల్ లో గుడ్డు , నిమ్మ రసాన్ని ఇంకా పెరుగుని కలపాలి.
·        ఆ మిశ్రమాని బాగా కలపాలి. తర్వాత ఆ ఆయిల్ ని తలకు బాగా పట్టించి కొంత సమయం వదిలేయాలి.
·        ఆ ఆయిల్ దేనికి అంటకుండా ఉండేందుకు తలకు షవర్ క్యాప్ ని దరించడం మంచిది. 
·        తర్వాత జుట్టుని మంచి నీటితో శుభ్రంగా కడిగి తరువాత షాంపూ ని వాడాలి. హెయిర్ కండీషనర్ ని కూడా ఉపయోగించవచ్చు.
·        ఇలా వారానికి 3 సార్లు చేయడం వలన పాడైన జుట్టుకి జీవం పోస్తుంది. గ్రే హెయిర్ నుండి విముక్తి లబిస్తుంది.

ఉసిరికాయ మరియు కొబ్బరి నూనె:
ఉసిరికాయ లో ఆంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఉంటుంది. దాని వల్ల జుట్టు రంగుని కాపాడుతుంది. కొబ్బరి నూనె సహజాసిద్దమైన గుణాలు కలిగి జుట్టుని వత్తుగా పెరిగేలా చేస్తుంది.
తయారు చేయడానికి కావలసినవి:
ఉసిరికాయలు-3 నుండి 4 వరకు
కొబ్బరి నూనె-1 కప్పు
తయారుచేయు పద్దతి:
·        ముందుగా ఉసిరికాయని చిన్ని చిన్ని ముక్కలు గా చేయాలి.
·        తర్వాత ఒక పాత్ర తీసుకొని దానిలో ఒక కప్పు ఆయిల్ తీసుకుని బాగా వేడి చేయాలి.
·        ఉసిరికాయ ముక్కలను కాగుతున్న ఆయిల్ లో వేయాలి.
·        ఈ రెండిటి ని కలిపి సన్నని మంట మీద 10  నుండి 15 నిమిషాల పాటు వేడి చేయాలి. (ఆ ఉసిరి ముక్కలు నల్లని రంగులోకి మారెంతవరకూ వేడి చేయాలి)
·        అనంతరం ఆయిల్ ని చల్లార నివ్వాలి.
·        ఆరిన ఆయిల్ ని తలకి బాగా పట్టించి మసాజ్ చేయాలి. ఇలా 2 నుండి 3 నిమిషాల పాటు చేసి ఆ రాత్రంతా వదిలేయాలి. ఇలా చేయడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది.
·        తరువాతి రోజు ఉదయం షాంపూ తో తలను శుబ్రపరుచుకోవాలి. మీకు అవసరం అనిపిస్తే కండీషనర్ కూడా వాడవచ్చు.
·        ఈ పద్దతిని రోజూ తప్పని సరిగా పాటించాలి.

ఉసిరికాయ, నిమ్మరసం మరియు బాదం ఆయిల్:
బాదం ఆయిల్ లో మేగ్నిషియం ఉండడం వలన చిన్న వయస్సు లో వచ్చే గ్రే హైర్ ని అరికడుతుంది. నిమ్మకాయ లో విటమిన్ బి, సి ఇంకా ఫాస్పరస్ ఉండడం వలన జుట్టు ను బూడిద రంగు నుండి నలుపు రంగుకు మార్చడం లో సహాయపడుతుంది. ఉసిరికాయ లో ఆంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి ఉంటుంది.
 తయారు చేయడానికి కావలసినవి:
ఉసిరికాయ-3
నిమ్మరసం-౩ టేబుల్ స్పూన్
బాదం ఆయిల్-3 టేబుల్ స్పూన్
తయారుచేయు పద్దతి:
·        ఉసిరికాయాలను ముక్కలుగా చేసుకోవాలి. తరువాత వాటిని మిక్సీ లో వేసి బాగా మెత్తని పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. 
·        బాగా కలిపి దాని నుండి ఉసిరికాయ రసాన్నితీయాలి.
·        ఒక పాత్ర తీసుకొని ఉసిరికాయ రసాన్ని, నిమ్మ రసాన్ని మరియు బాదం ఆయిల్ ని అన్ని కలిసేవిదంగా బాగా కలపాలి.
·        అన్ని చక్కగా కలిసిన మిశ్రమాన్ని తలకి పట్టించి 1నుండి 2 నిమిషాలపాటు మసాజ్ చేసి, దుస్తులు పాడవకుండా షవర్ క్యాప్ ని వాడాలి. ఇలా 30నుండి 35 నిమిషాలపాటు ఉంచుకోవాలి.
·        35 నిమిషాల అనంతరం తలని షాంపూ తో ఆయిల్ పోయే వరకు శుబ్రపరచాలి. 
·        ఈ పద్దతిని వారానికి 3 సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

కరివేపాకు మరియు కొబ్బరి నూనె:
కరివేపాకు మంచి ఔషద గుణాలు కలిగింది. కరివేపాకు లో విటమిన్ బి ఉంటుంది. ఇది జుట్టు కి సహజసిద్దమైన రంగు ని ఇస్తుంది. అందువల్ల కూర లో కరివేపాకు ని తీసిపాడేయకండి. కొబ్బరి నూనె సహజాసిద్దమైన గుణాలు కలిగి జుట్టుని వత్తుగా పెరిగేలా చేస్తుంది.
తయారు చేయడానికి కావలసినవి:
కరివేపాకులు-1/2 కప్పు
కొబ్బరి నూనె-1 కప్పు
పలుచటి వస్త్రం
తయారుచేయు పద్దతి:
·        ముందుగా కొబ్బరి నూనె ని వేడి చేయాలి.
·        తరువాత 1/2 కప్పు కరివేపాకు ఆకులను ఆ కాగుతున్న నూనె లో వేయాలి.
·        అలా 10 నుండి 15 నిమిషాలపాటు వేడి చేయాలి.(కరివేపాకు రెప రెప లాడే వరకు)
·        ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసుకొని పలుచటి వస్త్రం లో వడకట్టాలి.
·        వడ కట్టిన ఆయిల్ ని తలకి బాగా పట్టించి వేళ్లతో 4 నుండి 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరన బాగా జరిగి జుట్టు వత్తుగా పెరగడం లో సహాయ పడుతుంది. జుట్టు కి సహజసిద్ద రంగుని అందిస్తుంది.
·        మసాజ్ అనంతరం ఒక 30 నిమిషాలు అలా వదిలేసి తరువాత తలకి స్నానం చేయాలి.
·        ఇలా వారానికి రెండు సార్లు అలా 4 వారాలు పాటించడం ద్వారా గ్రే హెయిర్ సమస్య బారి నుండి తప్పించుకోవచ్చు.

కొబ్బరి నూనె మరియు నిమ్మ రసం:
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలను పెంచుతుంది. అంతే కాక జుట్టు రాలదన్ని అరికడుతుంది. నిమ్మకాయ లో విటమిన్ బి, సి ఇంకా ఫాస్పరస్ ఉండడం వలన జుట్టు ను బూడిద రంగు నుండి నలుపు రంగుకు మార్చడం లో సహాయపడుతుంది.
తయారు చేయడానికి కావలసినవి:
కొబ్బరి నూనె-2
నిమ్మ రసం-2
తయారుచేయు పద్దతి:
·        ముందుగా కొబ్బరి నూనె ని వేడి చేయాలి.
·        తరువాత పొయ్యి మీది నుండి కొబ్బరి నూనె తీసేసి దాంట్లో కొంచం నిమ్మ రసాన్ని కలపాలి.
·        ఆ గోరువేచ్చని నూనె ని తలకి బాగా పట్టించాలి. అలా ఒక 20 నుండి 30 నిమిషాలపాటు వదిలేయాలి.
·        30 నిమిషాల తరువాత షాంపూ తో  తల ని శుబ్రపరుచుకోవాలి.
·        ఈ విధం గా వారానికి రెండు సార్లు చేయడం వలన మంచి ఫలితం లబిస్తుంది.
·        గ్రే హెయిర్ సహజ సిద్దమైన జుట్టురంగు లోకి మారుతుంది.
చూశారు గా ఇంట్లో లబించే వాటితోనే చాలా చిట్కాలు ముడి పడి ఉన్నాయి. వాడి చూడండి మంచి ఫలితం ఉంటుంది

0 comments:

Post a Comment