నవగ్రహాలకు ఇష్టమైన ఆహారాలు ఏమిటో తెలుసా?

నవ గ్రహాలు అంటే తొమ్మిది గ్రహాలు అని అందరికీ తెలుసు. అయితే మనం పుస్తకాలలో సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు 9 అని దానిలో ప్లూటో అనే గ్రహం తొలగించబడింది అని చదువుకున్నాం. అయితే భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో జీవితాలపైనా, ప్రభావం చూపే గ్రహాలకు, ఖగోళ శాస్త్రంలో ఉన్న గ్రహాలకు కొంచెం తేడా ఉంది. సూర్య చంద్రులను ఈ సంప్రదాయంలో గ్రహాలుగా పిలవబడతారు. ఇంకా యురేనస్‌ నెప్ట్యూన్‌లు ఈ లెక్కలోకి రావు. కాని రాహు, కేతువులు రెండు గ్రహాలుగా పరిగణిస్తారు. అయితే హిందూ సంప్రదాలలో నవగ్రహాలను పూజించడం వలన అదృష్టం వరిస్తుందని చాలా మంది నమ్ముతారు. నవగ్రహాలను పూజించడం, హోమాలు, వ్రతాలు చేయడం వల్ల మంచి జరిగి అదృష్టం వరిస్తుందని హిందువుల గట్టి నమ్మకం. నవగ్రహాలను వారు ఇష్టపడే ఆహారంతో పూజిస్తే వారి ఆశీస్సులు పొందుతారు. అయితే కొంత మంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన మాటల ప్రకారం నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కో ప్రీతికరమైన ఆహారం కూడా ఉంది అని వారు అంటున్నారు. మరి మీరు కూడా నవగ్రహాలకు ఇష్టమైన ఆహారాలు ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుని వాటితో పూజించి ఆశీస్సులు పొందండి.

రవి (సూర్యుడు)

ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతికరమైన రోజు. సూర్యుడు అగ్నికి గుర్తు. సూర్యభగవానుడు ఎరుపు రంగుని ఇష్టపడతాడట. అందుకే బెల్లం, ఎరుపు పప్పులు, కేసరి, కుంకుమ పువ్వు, గోధుమలు, ఎరుపు పండ్లుతో పూజించి  సూర్య భగవానుడిని శాంతింపజేస్తే దీర్ఘాయువును ప్రసాదిస్తాడట.

మూన్‌ (చంద్రుడు)

సోమవారం చంద్రుడికి ప్రీతికరమైన రోజు. చంద్రునికి ఇష్టమైన రంగు తెలుపు కాబట్టి అతనికి బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, ఉప్పు, చక్కెర, జీడిపప్పు మరియు ముల్లంగి వంటి పదార్ధాలతో పూజిస్తారు. ఇలా చేయడం వల్ల సమస్యలు దూరమై ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం .

మార్స్‌ (అంగారకుడు)

మార్స్‌ గ్రహానికి అధిపతి హనుమంతుడు. ఇతడికి ఇష్టమైన రోజు మంగళవారం. హనుమాన్‌కి ఇష్టమైన ఆహారాలు ఎర్రని పప్పుదినుసులు, పళ్ళు, బెల్లం, దానిమ్మపండ్లు. ఇలా ఎర్రని పళ్ళుతో పూజించడం వల్ల తలనొప్పి, రక్తసంబంధిత సమస్యలు నయమవుతాయట.

మెర్క్యురీ (బుధుడు)

బుధుడుకి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమట. ఇతడికి ప్రీతికరమైన రోజు బుధవారం. పెసరపప్పు, గుమ్మడికాయ, ఆకుపచ్చ పండ్లు, ఇటువంటి ఆహార పదార్ధాలతో పూజించడం వలన మానసిక రుగ్మతలు నయం అవుతాయని హిందువుల నమ్మకం.

బృహస్పతి (గురుడు)

గురువారం నాడు పసుసు రంగు కలిగిన వాటితో పూజిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని భక్తుల గట్టి నమ్మకం. లడ్డు, శనగపప్పు, బెల్లం వంటి వాటితో పూజిస్తే మూత్రపిండ వ్యాదులు దూరం అవుతాయట. అలాగే వ్యాధి రహిత జీవితం లభిస్తుందని అంటుంటారు.

వీనస్‌ (శుక్రుడు)

శుక్రాచార్యుడు బియ్యం, చక్కెర, సెమోలినా వంటి తెల్లని రంగు కలిగిన వాటిని ఇష్టపడతాడట. ఇలా శుక్రాచార్యుడికి ఇష్టమైన వాటితో పూజించడం వలన భక్తులకు సంతోషాన్ని ప్రసాదిస్తాడట.

సాటర్న్‌ (శని)

శని భగవానుడికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, ఆవాల నూనె, నల్ల నువ్వులు, నల్ల పువ్వులు, నలుపు పండ్లు మొదలగు వాటితో పూజించడం వల్ల మీ శత్రువులు నాశనం అవుతారు. అలాగే మానసిక రుగ్మతలు  తొలగిపోతాయి.

రాహు - కేతు

రాహు - కేతువులు చాయాగ్రహాలు, వీరికి ఇష్టమైన రంగు నలుపు. మినపప్పు, నల్లని స్వీట్లు మొదలగు వాటితో వీరిని పూజించడం వల్ల వారి అనుగ్రహం పొంది సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు.

0 comments:

Post a Comment