వింత దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా?

బారత దేశంలో ఏమూల చూసినా ఏదో గుడి కచ్చితంగా ఉంటుంది. కొన్ని విగ్రహాలు అయితే వింతగా కూడా వుంటాయి. విగ్రహం ఎవరిదా అని ఎన్నో సందేహాలు రేకెత్తుతాయి. అయితే మన దేశం లో ఇలాంటి వింతదేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని ఉందా...? మరింకెందుకు ఆలస్యం ...

విస్కీదేవి

ఇది ఒక కల్‌ భైరవుని దేవాలయం ఉజ్జయినీ లో ఈ దేవాలయం విచిత్రమైన ఆనావాయితీలతో ఉండడం చేత వింత వార్తలోకి చేరింది. మద్యం సీసాలను మోసుకు వెళుతున్న భక్తులను చూస్తే మీకు ఏమనిపిస్తుంది?చూసారా మీరు కళ్ళెర్ర చేసారు. నిజానికి ఈ కల్‌భైరవుని ఆలయానికి భక్తులు తండోపతండాలుగా మందు సీసాలను తీసుకువచ్చి వారి కోరికలను నెరవేర్చమని ఆ దేవతని కోరుకుంటారట.ఈ దేవత ప్రధాన సమర్పణ మద్యం అంట.ఇదే
భక్తులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. పురాణాల ప్రకారం మన హిందూ సంప్రదాయాలలో దేవుడికి నైవేద్యం పెట్టి కోరుకలు కోరుకుంటారు. ఇది ఆచారం అదే విదంగా ఇక్కడ మద్యం నైవేద్యంగా పెడతారట. ఉజ్జయిని లో దేవాలయం బయట పూజ బుట్టలను ఒకటి 40 రూ.లకి అమ్ముతూ ..వెళ్ళే భక్తులను ఆపుతూ కొనమని అడుగుతూ వారి వ్యాపారాలను కొనసాగిస్తుంటారు. ఆ పూజ బుట్టలో కొబ్బరి కాయలు,పువ్వులు,140 మిల్లీలీటర్లు లిక్కర్‌ సీసాలు కలిగి వుంటాయి.

బుల్లెట్‌ బాబా ఆలయం 

రాజస్థాన్‌లోని జోద్ఫూర్‌ సమీపంలో బుల్లెట్‌బాబా అనే ఆలయం ఉంది.ఈ ఆలయం ఓం బన్నా అనే వ్యక్తికి అంకితం చేసారు. అతను 20 సంవత్సరాల క్రితం బుల్లెట్‌ నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయారు. దాంతో ఆ ఆలయానికి బుల్లెట్‌ బాబా అని పేరువచ్చింది. ఆ బైక్‌ని స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వాళ్ళు స్వాదీనం
పరుచుకున్నారు. కాని విచిత్రంగా ఆ బైక్‌ పోలీసు స్టేషన్‌ నుండి అదృశ్యమయి వేరొక స్థలంలో ప్రత్యక్షమయ్యింది. మళ్ళీ అదుపు లోకి తీసుకున్నా అదే పరిస్థితి ఎదురయ్యింది పోలీసులకి .దాంతో ఈ వార్త ఆనోట ఆనోట చేరింది. ఇది వింత కావడంతో అక్కడ బుల్లెట్‌బాబా ఆలయాన్ని నిర్మించారు. పాలీ-జోద్ఫూర్‌ రహదారి మీదుగ ప్రయాణించే వారు ఆ బుల్లెట్‌ బాబా ఆలయం దగ్గర ఆగకుండా వెళితే తమ గమ్యాన్ని శరీరం ముక్కలు ముక్కలై చేరుకుంటారని అక్కడి భక్తుల అభిప్రాయం.

ఎలుకల దేవాలయం 

ఇది రాజస్థాన్‌ లో కర్నిమాత దేవాలయం. ఈ దేవాలయంలో ఎలుకలు పొంచి ఉంటాయి. కాని అవి ఏమి చెయ్యవు ఎందుకంటే అది కర్నిమాత దేవాలయం కావడం చేత అంటున్నారు అక్కడి భక్తులు. ఈ ఎలుకలు భక్తులకు ఇబ్బంది కలిగించవని వారి అభిప్రాయం. ఒక వేళ మీరు అక్కడి ఎలుకని చంపితే దాన్నిమీరు ఒక
బంగారు ఎలుకని ఇచ్చి భర్తీ చేయాల్సి ఉంటుంది. తెలుపు, నలుపు మరియు గోదుమరంగు ఎలుకలు ఆ గుడిలో ఎప్పుడు కనిపిస్తుంటాయి. కాని తెలుపు రంగు ఎలుక కనిపిస్తే మంచిదని భక్తుల నమ్మకం.

సోనియా గాంధీ ఆలయం

కాంగ్రెస్‌ నాయకుడు కాంగ్రెస్‌ పార్టీ అద్యక్షురాలైన సోనియా గాంధీ దేవాలయాన్ని నిర్మించారట .ఈ దేవాలయం తెలంగాణాలో సోనియా తెల్లని పాలరాతి విగ్రహం మరియు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, రాహుల్‌గాంధీ చిత్రాలు బయట గోడలమీద ఉంటాయట.

వీసాబాబా

వీసా రాలేదని బాధపడుతున్నారా? అయితే మీరు ఈ బాబా గురించి తెలుసుకోవాల్సిందే జలందర్‌ సమీపంలో షాషిద్‌ బాబా నిహాల్‌ సింగ్‌ అని ఒక బాబా ఉన్నారు. ఎవరైతే వీసా రాలేదని బాధపడుతుంటారో వారు ఈయనను కలిసి ఈ యనకు ఒక బొమ్మ విమానం ఇస్తేచాలు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది అని భక్తుల నమ్మకం.

మోడీ ఆలయం

ప్రధాని నరేంద్రమోడీ ఆలయం గుజరాత్‌ లో ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇక్కడి ప్రజలు ఉదయం,సాయంత్రం ఆలయంలో పూజలు నిర్వహిస్తారు.

0 comments:

Post a Comment