చెవి ఇన్ఫెక్షన్ తో బాధ పడేవారికి చక్కటి ఇంటి చిట్కాలు

మధ్య చెవిలో బాక్టీరియా లేదా వైరస్ కారణంగా చెవి అంటువ్యాధులు అనేవి వస్తాయి. చెవి అంటువ్యాధులు అనేవి ఎక్కువగా చిన్న పిల్లల్లో వస్తూ ఉంటాయి. చెవి ఇన్ఫెక్షన్ తో బాధపడేవారికి చెవి నొప్పి,చెవి వద్ద లాగినట్లుండుట,నిద్ర లేమి,తలనొప్పి, శబ్దాలు సరిగ్గా వినపడకపోవటం, అధికజ్వరం, చెవి నుండి ద్రవం కారుట, వాంతులు, అతిసారం వంటి సాదారణ లక్షణాలు వీరిలో కనపడతాయి. అయితే  తక్షణ ఉపశమనం కోసం  కొన్ని సహజ చికిత్సలను ప్రయత్నించవచ్చు. చెవి ఇన్ఫెక్షన్, నొప్పి మరియు ఇతర లక్షణాలను వదిలించుకోవటానికి  ఈ ఇంటి నివారణలు సహాయపడతాయి ... అవేమిటో తెలుసుకుందామా మరి..

ఉప్పు

* ఒక కప్పు ఉప్పును పాన్ లో వేసి తక్కువ మంట మీద కొన్ని నిముషాలు వేడి చేయాలి. లేకపోతే మైక్రోవేవ్ లేదా డబుల్ బాయిలర్ లో వేడి చేయవచ్చు.
* ఒక వస్త్రం మీద వేడి చేసిన ఉప్పును వేసి రబ్బరు బ్యాండ్ లేదా దారం సాయంతో ముడి వేయాలి.
* ఈ వస్త్రాన్ని ప్రభావిత ప్రాంతంలో పది నిముషాలు ఉంచాలి.
* రోజు లో ఎన్ని సార్లు అయినా ఈ విధంగా చేయవచ్చు . ఉప్పు నుండి ఉత్పన్నమైన వేడి కారణంగా  చెవి నుండి ద్రవం బయటకు రాకుండా ఉండటం మరియు వాపు, నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ప్రత్యామ్నాయంగా, పైన వివరించిన పద్ధతిలో ఒక కప్పు అన్నంను కూడా ఉపయోగించవచ్చు.

వెల్లుల్లి

* రెండు స్పూన్ల నువ్వుల నూనె లేదా ఆవ నూనెలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి నల్లగా అయ్యేవరకు వేగించి, ఆ నూనెను వడకట్టి, కొంచెం వేడిగా ఉన్నప్పుడు  4 నుంచి 6 చుక్కల నూనెను చెవిలో వేసుకోవాలి.
* దీనికి ప్రత్యామ్నాయంగా, నీటిలో రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి ఐదు నిముషాలు మరిగించాలి. వెల్లుల్లిని మెత్తగా చేసి ఉప్పు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన వస్త్రంలో వేసి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టాలి.
* ప్రతి రోజు రెండు లేదా మూడు పచ్చి వెల్లుల్లిని తింటే నయం చేసే ప్రక్రియను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది.

తులసి

చిన్న చెవినొప్పి మరియు చెవి ఇన్ఫెక్షన్ చికిత్సలో పవిత్రమైన తులసిని ఉపయోగించవచ్చు.
ఇది చెవి నొప్పి నుంచి ఉపశమనం మరియు ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

* తాజా తులసి ఆకులను తీసుకోని రసం తీయాలి. ఈ రసాన్ని నొప్పి ఉన్న ప్రాంతంలో చెవి చుట్టూ రాయాలి. అంతేకాని చెవిలో ఈ రసాన్ని పోయకూడదు.
* కొబ్బరి నూనె, తులసి నూనెను సమాన మొత్తంలో తీసుకోని కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి చెవి లోపల, చెవి వెలుపలి అంచు చుట్టూ, చెవి వెనక నిదానంగా తుడవాలి. ఈ విధంగా ప్రతి రోజు రెండు సార్లు చేయాలి.

ఆలివ్ నూనె

* కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసి, ఇన్ఫెక్షన్ కి గురి అయిన చెవిలో కొన్ని చుక్కలు వేయాలి.
* నూనె గులిమిని మృదువుగా చేస్తుంది. అప్పుడు కాటన్ బడ్ సాయంతో గులిమిని తీయవచ్చు. చెవిని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే కర్ణభేరికి నష్టం జరుగుతుంది.

ప్రత్యామ్నాయంగా, ఆవాల నూనెను కూడా ఉపయోగించవచ్చు.

వేడి నీటి సీసా

ఇన్ఫెక్షన్ సోకిన చెవికి వీలైనంత త్వరగా వేడి నీటిని కాపడం పెట్టాలి. ఈ విధంగా చేయటం వలన తొందరగా నొప్పి ఉపశమనం మరియు సూక్ష్మజీవి ముట్టడిని నిరోదిస్తుంది.

* చెవి మీద వెచ్చని నీటి సీసా లేదా హీటింగ్ ప్యాడ్ ని కాపడం పెట్టాలి.
* అంతేకాక గోరువెచ్చని నీటిలో ఒక శుభ్రమైన వస్త్రాన్ని ముంచి పిండి ప్రభావిత ప్రాంతంలో కాపడం పెట్టవచ్చు.
* చెవి దగ్గర ఎక్కువసేపు వేడి ఉంచకూడదు. మొదట ఐదు నిముషాలు పెట్టి, ఆ తర్వాత కొంతసేపు అయ్యాక మరల వేడి పెట్టాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయ చెవి ఇన్ఫెక్షన్ కోసమే కాకుండా చాలా సమస్యలకు సహాయపడుతుంది.

* ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి గిన్నెలో వేసి రెండు నిమిషాల పాటు మైక్రోవేవ్ ఓవెన్లో ఉంచాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత రసం తీయాలి. ఇన్ఫెక్షన్ వచ్చిన చెవిలో రెండు చుక్కల ఉల్లిపాయ రసాన్ని వేయాలి.
కొంచెం సేపు అయ్యాక  తలను పక్కకు వంచితే ఎక్కువగా ఉన్న రసం బయటకు వచ్చేస్తుంది.

మామిడి ఆకు రసం

మామిడి ఆకు రసం చాలా తొందరగా మరియు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

* మామిడి ఆకులను మెత్తగా చేసి రసాన్ని తీసి కొంచెం వేడి చేయాలి.
* ఈ రసాన్ని డ్రాపర్ సాయంతో ఇన్ఫెక్షన్ వచ్చిన చెవిలో మూడు చుక్కలను వేస్తె కొన్ని నిమిషాల్లోనే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
* ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే చెవి ఇన్ఫెక్షన్ కి మంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ నివారణలు చిన్న చిన్న చెవి ఇన్ఫెక్షన్  చికిత్సలో సహాయపడతాయి. రెండు రోజుల్లో వీటి వలన ఎలాంటి మెరుగుదల కనపడకపోతే, తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

0 comments:

Post a Comment