ఎలుకలను వదిలించుకోవటానికి సులభమైన మార్గాలు..


ఇంట్లో ఎలుకలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా??  అవును అనేది మీ సమాధానం అయితే ఇక్కడ చాలా రకాల ఇంటిచిట్కాలు ఇవ్వడం జరిగింది . వీటిని ఉపయోగించి ఎలుకల బారినుండి విముక్తి పొందండి. ఎలుకల వలన వ్యాధులు మాత్రమే కాదు ఇంట్లో విపరీతమైన దుర్వాసన కూడా.. వీటన్నిటినుండి బయటపడాలంటే ఎలుకలను దూరం చేయాలి... అదెలానో ఇప్పుడు చూద్దాం....


పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్

పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్  ఘాటు వాసన ఎలుకలకు పడదు. కాబట్టి అవి పిప్పరమింట్ ఎసెన్షియల్ ఆయిల్ ఉన్న ప్రదేశం నుండి పారిపోతాయి. ఎలుకలు ఇంటిలోకి ప్రవేశించగానే ఈ పద్దతిని ఉపయోగిస్తే ఎలుకలు దూరంగా పోవటానికి సహాయపడుతుంది.

కావలసినవి

పిప్పరమింట్ నూనె
కాటన్ బాల్స్

పద్దతి

* పిప్పరమింట్ నూనెలో కాటన్ బాల్ ని ముంచాలి.
* సాదారణంగా ఎలుకలు తిరిగే ప్రాంతంలో ఈ కాటన్ బాల్స్ ని ఉంచాలి.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.
* అలాగే ఇంటి పెరటిలో పిప్పరమింట్ మొక్కలను పెంచితే ఎలుకలు ఇంటిలోకి రావు.

లవంగం ఎసెన్షియల్ ఆయిల్

ఎలుకలు బలమైన లవంగం ఎసెన్షియల్ ఆయిల్ వాసనను భరించలేవు. లవంగం వాసన ఉన్న చోటు నుండి ఎలుకలు పారిపోతాయి. దీని కోసం లవంగాలు లేదా లవంగాల నూనెను ఉపయోగించవచ్చు.

కావలసినవి

లవంగం ఎసెన్షియల్ ఆయిల్
కాటన్ బాల్స్

పద్దతి

* లవంగం ఎసెన్షియల్ ఆయిల్ లో కాటన్ బాల్ ని ముంచాలి.
* ఈ కాటన్ బాల్స్ ని తలుపుల దగ్గర మరియు ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో పెట్టాలి.
* అలాగే ఒక కాటన్ క్లాత్ లో కొన్ని లవంగాలను వేసి ర్యాప్ చేసి ఎలుకలు తిరిగే ప్రదేశంలో పెట్టవచ్చు.
* ఈ విధంగా చేస్తే ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

కలరా ఉండలు

కలరా ఉండల  వాసన ఎలుకలను తరిమి కొడుతుంది.

కావలసినవి

మూత ఉన్న చిన్న కంటైనర్
కలరా ఉండలు

పద్దతి

* చిన్న కంటైనర్లను తీసుకోని వాటికీ రంద్రాలు చేయాలి.
* ఈ చిన్న కంటైనర్లలో రెండు లేదా మూడు కలరా ఉండలను ఉంచాలి.
* ఈ చిన్న కంటైనర్లను ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రాంతంలో ఉంచాలి.
* ఈ విధంగా చేయుట వలన ఎలుకలు ఇంటిలోకి రావు. ఇంటిలో ఉన్న ఎలుకలు బయటకు పారిపోతాయి.

అమ్మోనియా

అమ్మోనియా బలమైన వాసనను ఎలుకలు భరించలేక పారిపోతాయి. అమ్మోనియా వాసన ఎలుకలు ఆ ప్రదేశం వదిలి వెళ్ళేలా వెంటాడుతుంది.

కావలసినవి

మూత ఉన్న చిన్న కంటైనర్
అమ్మోనియా

పద్దతి

* ఎలుకలు వదిలించుకోవటం కొరకు కలరా ఉండలతో  ఉపయోగించిన అదే ప్రక్రియను అనుసరించాలి.
* ఎలుకలు తరచుగా తిరిగే ప్రదేశాలను అమ్మోనియాతో శుభ్రం చేయాలి.
* అంతేకాకుండా ఎలుకల రెట్టను శుభ్రం చేయటానికి కూడా అమ్మోనియా సహాయపడుతుంది.

సబ్బు డిటర్జెంట్ మరియు టబాస్కో సాస్

ఇది ఇంటిలో ఎలుకలను బయటకు తరమటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

కావలసినవి

సోప్ డిటర్జెంట్ - ¼ కప్పు
టబాస్కో సాస్ - 1 టేబుల్ స్పూన్
ఒక స్ప్రే బాటిల్
నీరు - 1 గాలన్

పద్దతి

* నీరు, సాస్ మరియ డిటర్జెంట్ ఈ మూడింటిని బాగా కలపాలి.
* ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి ఎలుకలు తరచుగా వచ్చే ప్రదేశంలో స్ప్రే చేయాలి.
* ఈ మిశ్రమం ఎలుకలు ఇంటిలో నుండి బయటకు పోవటానికి సహాయపడుతుంది.

అల్యూమినియం ఫాయిల్

అల్యూమినియం ఫాయిల్ శబ్దం ఎలుకలకు ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఎలుకలు ముట్టుకోకుడని భావించే వస్తువులకు అల్యూమినియం ఫాయిల్ చుట్టాలి.

కావలసినవి

అల్యూమినియం ఫాయిల్ రోల్

పద్దతి

* సాదారణంగా ఎలుకలు దాడి చేసే వస్తువుల ఉపరితలంను అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేయాలి.
* ఈ విధానాన్ని రాత్రి సమయంలో చేయాలి.
* ఈ విధానాన్ని అనుసరిస్తే ఎలుకలను సమర్ధవంతంగా వదిలించుకోవచ్చు.

రాగి ఊలు

రాగి ఊలు సమర్థవంతంగా ఎలుకల సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. రాగి ఊలు లేదా రాగి వైర్ మెష్ ను కట్ చేయటం ఎలుకలకు చాలా కష్టంగా ఉంటుంది.

కావలసినవి

కాపర్ వైర్ మెష్

పద్దతి

* రాగి వైర్ ని తీసుకోని చిన్న చిన్న వ్యాడ్ లను తయారుచేయాలి.
* ఇంటిలో ఉండే రంధ్రాలు లేదా పగుళ్లకు ఈ వ్యాడ్ లను తగిలిస్తే ఎలుకలు లోపలకు రావు.
* ఈ పద్ధతి మరింత సమర్థవంతంగా పనిచేయటానికి పెప్పర్ స్ప్రే కూడా ఉపయోగించవచ్చు.

డ్రై షీట్లు

ఎలుకలు  డ్రై షీట్లు వాసనను భరించలేవు. అందువల్ల ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో ఈ  డ్రై షీట్లను ఉంచి ఎలుకలను తరిమికొట్టవచ్చు.

కావలసినవి

 పాత డ్రై షీట్లు

పద్దతి

* ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పాత డ్రై షీట్లను ఉంచాలి.
* ఆ షీట్స్ వాసన తగ్గితే మరల షీట్స్ మార్చాలి.
* ఎలుకలు ఇంటిలోకి వచ్చే చిన్న ప్రవేశాల దగ్గర ఈ షీట్స్ ఉంచాలి.

0 comments:

Post a Comment