మృదువైన చర్మం కోసం మెంతులు

మృదువైన, కాంతివంతమైన  చర్మం కోరుకోని వారు ఉండరు. ఇటీవల అనేక కారణాల వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది.. అదే విధం గా అనేకరకాల చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి..మొటిమలు, యాక్నే, టాన్ వివిధ రకాల చర్మ సమస్యలను  తొలగించుకోడానికి  అద్భుతమైన చిట్కా ఇప్పుడు తెలుసుకుందాం...

Fenugreek Seeds for glowing skin

 మెంతులు

మెంతులు చర్మకాంతిని మెరుగుపరచడానికి చాలా చక్కగా సహాయపడతాయి. మెంతులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ  బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండడం వల్ల తరచూ చర్మం పై ఏర్పడే యాక్నే, పింపుల్స్ వంటి సమస్యలు, వాటి తాలూకు బాక్టీరియా ను చర్మం నుండి తొలగిస్తుంది. తద్వారా చర్మం మృదువుగా కాంతివంతం గా మారుతుంది. అయితే అసలు ఈ రెమిడీస్ ఏ విధం గా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం...

మెంతులు - పాలు 

  • మెంతులను పాలలో 2 గంటలు నానబెట్టాలి 
  • ఆ తరువాత  మెత్తగా రుబ్బుకోవాలి
  • ఈ మిశ్రమం లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా రాసుకోవాలి. 
  • ౩౦ నిమిషముల తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి.

ఇది చర్మం పై ఏర్పడ్డ నలుపు, పింపుల్స్ మరియు యాక్నే వంటి సమస్యలను తొలగిస్తుంది .. ముఖాన్ని అందంగా తెల్లగా మారుస్తుంది.. ఈ రెమెడీ ని వారానికి 2 లేదా 3 సార్లు వాడడం వల్ల ముఖం పై ఏర్పడ్డ మచ్చలు మొటిమలు తగ్గడమే కాకుండా చర్మం నిగారించేలా చేస్తుంది..

మెంతులు- తేనె-పాలు 

మెంతుల లో చర్మ ఛాయను మెరుగు పరిచే గుణం ఉంది ..

  • చెంచా మెంతులపొడి లో కొద్దిగా తేనే ని, మిశ్రమానికి సరిపడా పాలను కలిపి ముఖానికి పట్టించాలి..
  • 2 నిముషాలు సున్నితం గా మసాజ్ చేయాలి .
  • 15 - 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి ..

పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్ల  చర్మాన్ని తెల్లగా కాంతివంతం గా మారుస్తుంది. మెంతులు మరియు  తేనె లో యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉండడం వల్ల ముఖం పై వచ్చే ముడతలను తొలగించి చర్మాన్ని మృదువుగా మార్చడం లో సహాయపడుతుంది..

మెంతులు - నీరు 

కొంతమంది కి ముఖం పై మొటిమలు ఎర్రని గడ్డలుగా వచ్చి మరీ ఇబ్బంది గా అనిపిస్తుంది. అలాంటి సమయం లో ..

  • ఒక టీ స్పూన్ మెంతులను ఒక టీ గ్లాస్ నీళ్లలో మరిగించి చల్లారిన తరువాత ఆ నీటిలో  దూది ని ముంచి మొటిమలు ఉన్న ప్లేస్ లో అప్లై చేయాలి. 
  • ఒక గంట తరువాత చల్లని నీటి తో కడిగేయాలి..

మెంతులలో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండడం వలన ఈ సమస్యనుండి ఉపశమనం కలిగిస్తుంది .. ఈ విధం గా 2 - 3 రోజులు చేయడం వలన  సమస్య తగ్గిపోతుంది ..

మొటిమలు,మచ్చలకు టీ ట్రీ ఆయిల్‌


0 comments:

Post a Comment