5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా మాస్క్ రెడీ

ఇప్పుడున్న పరిస్థితుల్లో కచ్చితంగా అందరూ కూడా మాస్క్లని ధరించాల్సిందే .. కాబట్టి ఏ పనిమీద బయటకు వెళ్ళవలసి వచ్చినా కచ్చితంగా మాస్క్ని ధరించాలి అని  చెబుతున్నారు నిపుణులు.

కాబట్టి మీకు మాస్క్ అందుబాటులో లేకపోతే.. మీరే స్వయంగా ఇంట్లోనే మాస్క్ ని తయారు చేసుకోవచ్చు .


5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా మాస్క్ రెడీ

కావాల్సిన వస్తువులు

1. కాటన్ మెటీరియల్
2. 4 క్లాత్ స్ట్రిప్స్(చెవులకు తగిలించుకునేందుకు సన్నని తాడులాగా కుట్టుకోండి )
3. కత్తెర
4. కుట్టుమిషన్
  • ముందుగా కాటన్ మెటీరియల్ ని  కత్తిరించుకోవాలి..
  • పెద్దవారికైతే : 9 X 7 ఇంచులు
  • చిన్నవారికైతే : 7 X 5 ఇంచులు
  • ఇప్పుడు 4 స్ట్రిప్స్ ని  క్లాత్కి కట్టేందు, అదే విధంగా పైపింగ్లా చేసేందుకు కొంచం క్లోత్ కట్ చేసుకోవాలి.
  • కట్ చేసి పెట్టుకున్న క్లాత్ ని పైన, కింద ఇలా  చివరలు (పైపింగ్నీటి గా కుట్టుకోండి.
  • ఇప్పుడు క్లాత్ని కిందకి ప్లీట్స్ (మడత) పెడుతుూ కుట్టుకోవాలి. ఒక్కో ప్లీట్ 1.5 ఇంచ్ వచ్చేలా కుట్టుకోవాలి.పెట్టుకున్న తర్వాత రెండు పక్కలా పైపింగ్ చేయాలి.
  • ఇలా తయారైన మాస్క్కి కట్టుకునేందుకు నాలుగువైపులా స్ట్రిప్స్ క్లాత్ని కుట్టాలి.
  • ఇప్పుడు మీకు మాస్క్ రెడీ అయినట్లే, ఇది తయారు చేయడం మాత్రమే కాదు.. తయారైన మాస్క్ని ఎలా వాడాలన్నది కూడా ముఖ్యమే. మాస్క్ని మొత్తం నోరు, ముక్కు కవర్ అయ్యేటట్టు ముఖానికి, మాస్క్కి గ్యాప్ లేకుండా కట్టుకోవాలి. అదే విధంగా.. ప్లీట్స్ కిందికి ఉండేలా కట్టు కోవాలి.
  • మీరు రెండు మాస్క్ ని వాడడం మంచిది. ఒకటి ఉతికినప్పుడు ఇంకొకటి వాడొచ్చు.

మాస్క్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • మాస్క్ని వాడే ముందు కచ్చితంగా  శుభ్రం చేయాలి అదే విధం గా చేతులను  కూడా శుభ్రం చేసుకోవాలి.
  • మాస్క్ త్వరగా మెత్తగా అయినట్లు అనిపిస్తే వేరే మాస్క్ వాడడం మంచిది.
  • ఒకసారి వాడిన మాస్క్ని క్లీన్ చేయకుండా మరోసారి అసలు వాడరాదు  .

మాస్క్ తీసేటప్పుడు..

మాస్క్ని ముందుభాగంలో ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు. కేవలం పక్కభాగంలో ఉన్న స్ట్రింగ్స్ ద్వారే తీసేయాలితీసిన వెంటనే మీ చేతులని70 శాతం ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లేదా సబ్బు నీటితో 40 సెకన్ల పాటు బాగా రుద్దుతూ కడగాలిమాస్క్ని ఉప్పు కలిపిన మరుగుతున్న నీటిలో లేదా సబ్బు నీటిలో నేరుగా వేయండి.

వాడిన మాస్క్ని ప్రతి రోజూ ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలి ?

  • రెండోసారి వాడలేని మాస్క్లని వాష్ చేయొద్దు. ఎందుకంటే అవి ఉతకాల్సిన మెటిరీయల్ కాదని గుర్తుపెట్టుకోవాలి.
  • వాడిన మాస్క్లని సబ్బు, వేడి నీటితో ఉతికిన తర్వాత దానిని ఎండలో కనీసం 5 గంటలపాటైనా ఆరవేయాలి.

ఎండ లేకపోతే ?

వాడిన మాస్క్ని ప్రెజర్ కుక్కర్లో వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆరేయాలి. నీటిలో ఉప్పు వేస్తే మంచిది. కుక్కర్ లేకపోయినట్లైతే దానిని వేడినీటిలో 15 నిమిషాల పాటు ఉడకబెట్టొచ్చు.

కుక్కర్, వేడి నీటిని వాడే వీలు లేకపోతే ?

మాస్క్ని సబ్బుతో శుభ్రం చేసి దానిని 5 నిమిషాల పాటు మీడియం వేడితో ఐరన్ చేయొచ్చు.

మాస్క్ని ఎలా స్టోర్ చేసుకోవాలి ?

ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే తీసుకోవాలి. దీనిని సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత దానిని రెండు వైపులా ఆరవేయాలి. ఇప్పుడు అందులో రెండో మాస్క్ని పెట్టి దాచొచ్చు.
అయితే, కవర్ని ఎప్పుడు కూడా సీల్ చేయడం చాలా ముఖ్యం. 

ఎందుకు కాటన్ మాస్క్ని ఉపయోగించాలి ?

కాటన్ మాస్క్ల గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే.. ఇంట్లో తయారు చేయడం వలన ఇవి కాస్తా పెద్దవిగా ఉంటాయి దాని  వల్ల వైరస్లు సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇవి చిన్న చిన్న వైరస్లని కూడా మనదరికి చేరనివ్వవు. వీటిని ఇంట్లో తయారు చేయడం కూడా చాలా సులభం.

0 comments:

Post a Comment